ఎలినా స్వితోలినా: వింబుల్డన్‌లో ఆమె సెమీస్‌కు చేరుకోవడం ఎంతో స్పెషల్... ఎందుకో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు

ఫొటో సోర్స్, Getty Images
వింబుల్డన్‌లోని మహిళల సింగిల్స్‌లో సెమీ ఫైనల్‌కు ఎలినా స్వితోలినా చేరుకున్నారు.
ఈ వార్తలో విశేషమేమిటని చూస్తున్నారా? ఇక్కడవరకు వచ్చేందుకు స్వితోలినా చేసిన కృషిలో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆమె సొంత దేశం యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. అయినప్పటికీ, ఆమె ప్రాక్టీసును ఆపలేదు.
నిజానికి యుద్ధం వల్లే ఆమె మరింత ఏకాగ్రతతో వింబుల్డన్‌కు సన్నద్ధమయ్యారు. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే తొమ్మిది నెలల క్రితమే ఆమె పాపకు జన్మనిచ్చారు. ప్రసవం తర్వాత వ్యాయామం చేసేందుకు ఆమెకు చాలా తక్కువ సమయమే దొరికింది.
ఇక మూడో ముఖ్యమైన విషయం ఏమిటంటే విమెన్స్ టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ 1 చాంపియన్ ఇగా స్వియాతెక్‌ను ఆమె ఓడించారు.
7-5, 6-7, 6-2తో ఇగాపై స్వితోలినా విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ నంబర్-1ను ఓడించి..
ఇగాపై మ్యాచ్ గెలిచిన అనంతరం మీడియాతో స్వితోలినా మాట్లాడారు. తన దేశంలో జరుగుతున్న యుద్ధమే తనను మానసికంగా దృఢంగా చేసిందని ఆమె చెప్పారు.
గత అక్టోబరులో ప్రసవం అనంతరం మూడు నెలలకే టెన్నిస్ కోర్టులోకి స్వితోలినా అడుగుపెట్టి అగ్ర క్రీడాకారిణులను ఓడించారు.
యుద్ధంలో పోరాడుతున్న తమ దేశ సైనికులకు తన విజయం ద్వారా వేడుకలు చేసుకునేందుకు ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తోందని ఆమె అన్నారు.
‘‘ఇబ్బందికర పరిస్థితులేమీ అంత పెద్ద సమస్యలు కాదు. దీనికంటే పెద్ద సమస్యలు మన జీవితంలో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి యుద్ధమే నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చింది.’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టులో ప్రశంసల జల్లు
మ్యాచ్ జరిగే సమయంలో కోర్టులో కూర్చున్న ప్రజల నుంచి స్వితోలినాకు మంచి మద్దతు లభించింది.
రష్యా దాడి ఒకవైపు, కొత్త తల్లి కావడంతో వచ్చే బాధ్యతల నుంచి మరోవైపు ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆమెకు మద్దతుగా మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
స్టాండ్స్ నుంచి తనకు చాలా మద్దతుకు రావడంతో 28 ఏళ్ల స్వితోలినా చాలా సంతోషంగా కనిపించారు. ఊహించని రీతిలో ఇదే ఆమెను సెమీ ఫైనల్స్‌కు తీసుకెళ్లింది.
‘‘పిల్లలు తమ ఫోన్లలో టెన్నిస్ చూస్తున్న చాలా వీడియోలను నేను చూశాను. అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు నా గుండె బరువెక్కుతుంది.’’ అని ఆమె మీడియాతో చెప్పారు.
2019లోనే వింబుల్డన్‌లో సెమీ-ఫైనల్స్‌కు స్వితోలినా చేరుకుంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ చివరివరకూ ఆమె పోరాడారు.
తాజా మ్యాచ్ మొదటి సెట్‌లో వర్షం పడింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. వర్షం వల్ల కోర్టు పైనుంచి క్లోజ్ చేశారు. దీంతో కొద్దసేపటి వరకూ మ్యాచ్‌ను నిలిపేయాల్సి వచ్చింది.
తాజా మ్యాచ్ అనంతరం ఆమె ర్యాంకు 76 నుంచి 30కి వచ్చింది.
‘‘మహిళల టెన్నిస్‌లో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కృషి చేస్తున్నాను. నా సొంత దేశంలో యుద్ధం, నా పాప.. నాలో పట్టుదలను మరింత పెంచాయి. నేడు వీరి వల్ల నాకు జీవితం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ముందెన్నడూ లేనంత ప్రశాంతంగానూ నేను ఇప్పుడు ఉన్నాను.’’ అని ఆమె చెప్పారు.
ఐస్ క్రీమ్ లేదా అమ్మ మ్యాచ్?
పాప తనలో ఎంత స్ఫూర్తి నింపుతున్నారు? తల్లి టెన్నిస్ ఆడటాన్ని టీవీలో తొలిసారి చూసినప్పుడు తన పాప స్కై ఎలా స్పందించారు?
‘‘అప్పుడు తను ఐస్ క్రీమ్ తింటూ బిజీగా ఉంది. నా ఓటమి లేదా గెలుపును పట్టించుకునే వయసులో తను లేదు. తనకు ఇష్టమైన సంగతులు వేరే ఉన్నాయి.’’ అని స్వితోలినా చెప్పారు.
ఈ గెలుపును స్వితోలినా కుమార్తె గుర్తుపెట్టుకోకపోవచ్చు కానీ, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఇగా మాత్రం గుర్తుపెట్టుకుంటారు.
మ్యాచ్ అనంతరం గ్రాండ్‌స్లాంను ఇగా గెలవాలని కోరుకుంటున్నట్లు స్వితోలినా చెప్పారు.
మరోవైపు మ్యాచ్ అనంతరం ‘‘ఈ టోర్నమెంటు నువ్వు గెలవాలి’’ అని ఇగా తనతో చెప్పారని స్వితోలినా వెల్లడించారు.
వీరిద్దరి మధ్య మంచి స్నేహముంది. యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి పసుపు, నీలం రిబ్బన్లున్న క్యాప్‌ను ఇగా పెట్టుకుంటున్నారు. ఈ రెండు రంగులూ యుక్రెయిన్ జెండాలో కనిపిస్తాయి.
మరోవైపు యుక్రెయిన్ నుంచి వచ్చిన స్వితోలినా, ఇతర ప్లేయర్ల కోసం వింబుల్డన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి సన్నద్ధత కోసం మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.
‘‘ఇక్కడి మేనేజర్లు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లండ్ ఇస్తున్న మద్దతును యుక్రెయిన్ ఎప్పటికీ మరచిపోదు.’’ అని ఆమె అన్నారు.
గురువారం జరగబోతున్న సెమీ-ఫైనల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మార్కెటా వాండరూసేవాతో ఆమె తలపడబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్‌లో ఫీచర్స్ ఏమిటి
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















