లీలా రో దయాల్: వింబుల్డన్‌లో మ్యాచ్ గెలిచిన తొలి భారతీయ మహిళ

- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
రచయితగా, నృత్యకారిణిగా, పర్వతారోహకురాలిగా రోహిణిగా పేరు తెచ్చుకున్న లీలా రో దయాల్ వింబుల్డన్‌లో జరిగిన టెన్నిస్ మ్యాచ్‌లో గెలుపొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
కళా విమర్శకులు గోవిందరాజు వెంకటచలం 1966లో రాసిన ‘మై కాంటెంపరరీస్’ పుస్తకంలో లీలా రో చిన్న వయసులో ఆమెను కలుసుకున్న విషయాలను గుర్తుకు చేసుకున్నారు.
‘‘పిరికిగా, భయస్తురాలిగా, తెలియని వాళ్ల ముందు మాట్లాడేందుకు కూడా బిడియంగా ఉండేది’’ అని ఆయన తన పుస్తకంలో రాశారు.
చిన్నగా, సన్నగా ఉన్న ఈ అమ్మాయినే పిన్న వయసులో భారత్ మెచ్చదగ్గే వ్యక్తిగా, ప్రపంచం మెచ్చే టెన్నిస్ క్రీడాకారులలో ఒకరిగా మారనుందని తాము తక్కువగా గ్రహించినట్లు చెప్పారు.
లీలా రో 1911 డిసెంబర్‌లో ప్రముఖ ఫిజిషియన్ రాఘవేంద్ర రో, ఆ కాలంలో ప్రముఖ సంస్కృత పండితుల్లో ఒకరైన పండిత క్షమా రోలకు పుట్టారు.
భారత్‌లో పెరిగిన రో, ఇంట్లోనే తన తల్లి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. రో కుటుంబం ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లకు వెళ్లాల్సి రావడంతో, అక్కడే ఆమె ఆర్ట్స్ చదువుకున్నారు.
మలేరియా వచ్చిన తర్వాత తన శారీరక బలాన్ని పెంచుకునేందుకు మూడేళ్ల వయసులోనే రో భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు.
రో కుటుంబాన్ని వెంకటచలం తెలిసిన స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. అప్పుడే ఆయన ఆమెను ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని అభివర్ణించారు.
చిన్నగా ఉన్నప్పుడే లీలా రో, పారిస్‌లోని ఒక మాస్టర్ నుంచి వయోలిన్‌లో శిక్షణ పొందారు. స్టేజీపై ప్రదర్శనలు ఇవ్వడం తనకు చాలా మక్కువ.
తన తల్లి నుంచి వచ్చిన ఆసక్తితో, లీలా రోకి టెన్నిస్ అంటే కూడా అభిమానం పెరిగింది.
స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలా మంది భారతీయ మహిళలలో యూరోపియన్ క్రీడలపై ఆసక్తి పెరిగింది.
దక్షిణాసియా సమాజంలో క్రీడలపై ఆసక్తి గురించి తెలియజేస్తూ బోరియా మజుందర్, జేఏ మాంగ్‌నాన్ ఒక పుసక్తం రాశారు.
1920ల్లో దేశంలో అతి కొద్ది మంది తొలి మహిళా టెన్నిస్ క్రీడాకారుల్లో క్షమా రో కూడా ఒకరు. 1927లో బొంబే ప్రెసిడెన్సీ మార్డ్ కోర్ట్ చాంపియన్‌షిప్స్‌లో ఆమె సింగిల్స్ టైటిల్ గెలుపొందారు.
తన తల్లి అడుగు జాడల్లో నడిచిన లీలా రో, తన తల్లితో కలిసి డబుల్స్ మ్యాచ్‌లు ఆడుతూనే సింగిల్స్ ప్లేయర్‌గా దేశంలో టెన్నిస్ విభాగంలో తన సత్తా చాటారు.
1931లో ఆల్ ఇండియా చాంపియన్‌షిప్‌లో తన తొలి టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత ఏళ్లలో ఆరు టైటిల్స్‌ను గెలుపొందారు.
1920, 1930లలో వరుసగా చాంపియన్‌షిప్ టైటిట్స్ గెలుపొందుతూ లీలా రో తరచూ వార్తల్లో నిలిచేవారు.
1934లో వింబుల్డన్ మైదానంలో బ్రిటన్‌కు చెందిన గ్లాడీస్ సౌత్‌వెల్‌పై 4-6, 10-8, 6-2 తేడాతో గెలుపొందిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
అయితే, తర్వాత రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఇడా అడమాఫ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత ఏడాది జరిగిన టోర్నమెంట్‌లో కూడా పాల్గొన్న లీలా రో, తొలి రౌండ్‌లోనే బ్రిటన్‌కు చెందిన ఎవెలిన్ డియర్‌మ్యాన్ చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత 71 ఏళ్లకు వింబుల్డన్‌లో సీనియర్ మహిళల విభాగంలో మరో భారతీయ మహిళా సానియా మీర్జా పోటీ పడ్డారు.
రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో విశిష్టమైన భారతీయ జీవన విధానంలో ఆమె నివసించారని 2018లో సిదిన్ వదుకుత్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, SPORTS STUDIO PHOTOS
1943లో లీలా రో, హరీశ్వర్ దయాల్ అనే సివిల్ సర్వెంట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే వారు.
ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీగా పనిచేశారు.
అమెరికాలో ఉన్న కాలంలో ఎగ్జిబిషన్ టెన్నిస్ మ్యాచ్‌లను ఆడటం కొనసాగించారు.
కానీ, ఆ తర్వాత 1940 దశాబ్దం చివరిలో తాను అభిమానించే మరో ప్రపంచం రచనలు, కళలపై దృష్టిమరలించారు.
ఆధునీక సంస్కృతిలో ప్రముఖ వ్యక్తిగా పరిగణించే తన తల్లి నుంచి ఆమెకూ భాషపై అభిమానం పెరిగింది.
తన తల్లి రాసిన పలు సంస్కృత కావ్యాలను స్టేజీపై ప్రదర్శించారు.
ఆమె నైపుణ్యవంతురాలైన నృత్యకారిణి కానప్పటికీ, భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఆంగ్లం, సంస్కృత భాషల్లో అనేక పుస్తకాలు రాశారు.
నాట్య చంద్రిక అనే పుస్తకంలో భారతీయ నాట్యం, నాటకాల గురించి వివరించారు. నృత్త మంజరి అనే పుస్తకంలో భరతనాట్యానికి చెందిన పలు నృత్య సన్నివేశాలను గురించి రాశారు.
అమెరికా కాంగ్రెస్ లైబ్రరీలో భద్రపరిచిన భారతీయ రచయితకు చెందిన తొలి పుస్తకం నాట్య చంద్రిక అని 1958లో ఎల్ఏ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
మణిపురి నృత్య విధానాల గురించి పలు మెళకువలు, ఈ నృత్యం ఎక్కడ పుట్టిందనే విషయాలపై కూడా ఆమె పుసక్తం రాశారు.
భారతీయ శాస్త్రీయ నృత్య గొప్పతనానికి, వైవిధ్యభరితమైన నిధికి ఇదొక మనోహరమైన పరిచయం అని ఒక సమీక్షకుడు అన్నారు.
1950 చివరి నాటికి భారతీయ నాట్య విధానాల గురించి పరిశోధన చేసి, వాటిపై ఐదు పుస్తకాలు రాసేందుకు 20 ఏళ్లు వెచ్చించారు.
దీనిలో కొన్నింట్లో, ఈ నాట్యానికి చెందిన రూపాలను, కదలికలను తెలియజేసేందుకు ఆమెనే ఒక ఉదాహరణగా నిలిచారు.
‘‘దక్షిణాసియా ఆలయాల్లోని విగ్రహాలపై మా పూర్వీకులు ఏ శిలలనైతే చెక్కారో వాటిని చిత్రలేఖనాల రూపంలో నేను ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటున్నా’’ విండ్సర్ డైలీ స్టార్‌కి లీలా రో చెప్పారు.

ఫొటో సోర్స్, FOX PHOTOS
తన స్వహస్తాలతో రాసిన పిల్లల పుస్తకాన్ని ఆమె 1963లో ప్రచురించారు. తన తల్లి రాసిన సంస్కృత కావ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఆధ్యాత్మిక కవయిత్రి మీరాబాయి కథనాన్ని ఆ పుస్తకంలో వివరించారు.
నల్లటి రంగులో చిత్రలేఖనాలు గీస్తూ ఈ కథనాన్ని పిల్లలకి వివరించారు.
ఆసియా పిల్లల సాహిత్య సేకరణలో అత్యంత విలువైన దానిలో ఇది ఒకటని సింగపూర్ నేషనల్ లైబ్రరీకి చెందిన ఒక సీనియర్ లైబ్రేరియన్ చెప్పారు.
ఆసియాలో అత్యంత పురాతనమైన, అరుదైన పిల్లల పుస్తకాలు ఇవని చెప్పారు.
ఆమె, తన భర్త ఎత్తయిన పర్వతాలను అధిరోహించడాన్ని అమితంగా ఇష్టపడేవారమని రో తన హిమాలయాన్ జర్నల్ వాల్యూమ్ 26లో చెప్పారు.
1963లో నేపాల్ భారత రాయబార కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించేటప్పుడు, ఈ జంట ఎంతో సంతోషంగా గడిపే వారు.
అక్కడున్న సమయంలో, దేశ కళలు, కట్టడాల గురించి ఆమె పుస్తకాలు రాశారు.
రో కొన్ని సార్లు తన భర్తతో కలిసి లేదా ఒంటరిగా పర్వాతాల్లో ట్రెకింగ్‌కి కూడా వెళ్తుండేవారు.
ట్రిప్‌లకు వెళ్లకుండా నిరోధిస్తూ లేదా అనుకున్న సమయం కంటే ముందుగానే తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంటూ రాజకీయ సంక్షోభాలు తలెత్తేవని ఆమె తన పుస్తకంలో రాశారు.
మౌంట్ ఎవరెస్ట్‌లోని ఖుంబు ప్రాంతంలో ట్రెక్‌కు వెళ్లి, త్యాంగ్‌బోచే ఆశ్రమాన్ని సందర్శించడంపై కూడా ఆమె తన పుసక్తంలో చెప్పారు.
ఇక్కడికి వెళ్లిన తొలి మహిళ ఈమెనే. ప్రతి రోజూ మౌంట్ ఎవరెస్ట్‌ను చూడటం చాలా సంతోషంగా ఉండేదన్నారు.
తబోచే పర్వతశ్రేణిపై ట్రెకింగ్ చేయడం తన జీవితంలో అతిపెద్ద సాహసం అని ఆమె చెప్పారు.
తన జీవిత కల సాకారమైందని ఆమె ఒక జర్నల్‌లో రాశారు.
ఈ జంట ఖుంబు ప్రాంతంలో మరో పర్యటనకు వెళ్లిన సమయంలో దయాల్ 1964లో కన్నుమూశారు.
రో తన జీవితంలో చివరి క్షణాలను ఎలా గడిపారన్న దానిపై చాలా తక్కువ సమాచారమే అందుబాటులో ఉంది.
ఫ్రాన్స్‌లో పక్షి ప్రదర్శనశాలలో హిమాలయాలోని జంతు జాలానికి చెందిన ఆమె చిత్రలేఖనాలను ప్రదర్శించినప్పుడు 1975లో టైమ్స్ ఆఫ్ ఇండియా చివరిసారి లీలా రో గురించి వార్తలు రాసింది.
ఆమె అసాధారణమైన విజయాలను సాధించినప్పటికీ, రో జీవితం గురించి చాలా తక్కువ పరిశోధనలే జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















