యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన 18ఏళ్ల ఎమ్మా రదుకాను - Newsreel

ఫొటో సోర్స్, Robert Deutsch-USA TODAY Sports
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో బ్రిటన్‌కు చెందిన 18 ఏళ్ల ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది.
మహిళల సింగిల్స్‌లో కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 వరుస సెట్లలో ఓడించి ఎమ్మా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.
44 ఏళ్ల తర్వాత యూఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుకున్న బ్రిటన్ మహిళగా ఎమ్మా రికార్డు సృష్టించింది.
బ్రిటన్ తరఫున 1977లో వర్జీనియా వేడ్ తొలి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది.

ఫొటో సోర్స్, Danielle Parhizkaran-USA TODAY Sports
‘‘ఈ మ్యాచ్ నాకు చాలా ముఖ్యమైనది. బ్రిటిష్ దిగ్గజాలైన వర్జీనియా వేడ్, టిమ్ హెన్మాన్‌ల ముందు ఈ మ్యాచ్ గెలిచాను. వారి అడుగు జాడల్లో నిలిచాను. నాపై నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు’’అని మ్యాచ్ అనంతరం ఎమ్మా వ్యాఖ్యానించారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్మా లెలాపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లను గెలిచింది.
ఈ టోర్నీలో ఎమ్మా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేకపోవడం విశేషం.
తాజా మ్యాచ్‌లో గెలుపు అనంతరం ఎమ్మా ర్యాంకు 150 నుంచి 23గా మారింది.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








