బిపర్‌జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు

ఫొటో సోర్స్, @Indiametdept
బిపర్‌జోయ్ తుఫాను తీరాన్ని తాకడం మొదలైందని, ఇది గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్ప పీడనం నుంచి తీవ్ర తుఫానుగా మారి ఇది గురువారం సాయంత్రాన్ని తీరాన్ని తాకుతుందని అంతకు ముందే ఐఎండీ అధికారులు ప్రకటించారు.
సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇది తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
‘'బిపర్‌జోయ్’ సౌరాష్ట్ర కచ్ తీర ప్రాంతాలలో ల్యాండ్ ఫాల్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది’’ అని ఆయన వెల్లడించారు.
ఈ తుపాను కారణంగా గుజరాత్‌లోని అన్ని కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
ద్వారకా, జామ్‌నగర్, మోర్బీ, రాజ్‌కోట్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి.
పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు తమకు సమాచారం వచ్చిందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సహాయక చర్యలు ముమ్మరం
తుపాను తీవ్రతను ఎదుర్కొనేందుకు డజన్ల కొద్దీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. దేశంలోని తీర ప్రాంతాల్లో ఈ బృందాలు ఉన్నాయి.
తీరప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
ఇప్పటి వరకు 4,000 హోర్డింగ్‌లు తొలగించామని, చేపలు పట్టే పడవలను నిలిపివేశామని, పెద్ద ఓడలను తీరానికి దూరంగా పంపామని వెల్లడించారు.
ఇప్పటి వరకు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ తెలిపారు.
సహాయక చర్యలు చేపట్టేందుకు ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలో 15కు పైగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు.
దీనితో పాటు గుజరాత్, మహారాష్ట్రలలో 33 బృందాలను సిద్ధంగా ఉంచాలని కోరారు.
భారత్, పాకిస్తాన్‌లలో ప్రభావం
అంతకు ముందు...తుపాను ముప్పు పొంచి ఉండడంతో భారత్, పాకిస్తాన్‌లో సుమారు లక్షా 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు, పంటపొలాలు నాశనమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇంతకుముందే హెచ్చరించారు.
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే భారత్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
గోడకూలి ఇద్దరు చిన్నారులు మరణించారని, బైక్‌పై వెళ్తుండగా చెట్టు కొమ్మలు విరిగిపడి మరో మహిళ చనిపోయినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌పై బిపర్‌జోయ్ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు 81 వేల మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పాఠశాల భవనాల్లో 75 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న కరాచీ నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని, అత్యవసర చర్యలు చేపట్టినట్లు పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
గంటకు సుమారు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, 150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అలలు ఎగసిపడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో బుధవారం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మాండ్విలో గురువారం ఉదయం నుంచే బలమైన గాలులు వీస్తున్నాయని, సముద్రం అల్లకల్లోలంగా మారింది.
తుపాను ముప్పు కారణంగా తీరప్రాంత గ్రామాలను ఖాళీ చేయించడంతో ఎప్పుడూ మత్స్యకారులతో కిటకిటలాడే జాఖు పోర్టు ఖాళీగా కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, EPA
తీరప్రాంతాల నుంచి 67 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గుజరాత్ అధికారులు తెలిపారు.
తుపాను నేపథ్యంలో గుజరాత్ రీజియన్‌లో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కండ్లా, ముంద్రా పోర్టుల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
గుజరాత్ తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. సముద్రంలోకి వెళ్లొద్దని పాకిస్తాన్ కూడా మత్స్యకారులకు హెచ్చరికలు చేసింది.
కచ్ ప్రాంతంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆరు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.
తుపాను తీవ్రతను బట్టి అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇస్తామని ఎన్డీఆర్‌ఎఫ్ తెలిపింది.
తీరం దాటిన తర్వాత బిపోర్‌జోయ్ తుపాను బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?














