భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్

నేపాల్ ప్రధానమంత్రి ఓలీ

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రధానమంత్రి ఓలీ
    • రచయిత, సంజీవ్ గిరి
    • హోదా, బీబీసీ న్యూస్

బుధవారం ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, భారత నిఘా ఏజెన్సీ రా చీఫ్ సామంత్ గోయల్ మధ్య జరిగిన చర్చల గురించి తమ పార్టీకే తెలియదని నేపాల్ అధికార పార్టీ సీపీఎన్ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ్ ఒక ప్రకటనలో చెప్పారు.

సీపీఎన్ ఇద్దరు చైర్మన్లలో కేపీ ఓలీ ఒకరు.

"సీపీఎన్ మరో చైర్మన్ పుష్పకమల్ దాహాల్ (ప్రచండ) లేదా పార్టీ సీనియర్ నేతలతో, తొమ్మిది మంది సభ్యులున్న పార్టీ సెక్రటేరియట్‌లోనూ దీనిపై చర్చించలేదు, దీని గురించి సమాచారం కూడ లేదు" అని ఆయన ప్రకటనలో చెప్పారు.

నేపాల్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా భారత నిఘా ఏజెన్సీ రా చీఫ్ సామంత్ గోయల్ పర్యటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

కానీ, గోయల్ ఓలీని కలిశారనే విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి ఓలీ మీడియా సలహాదారు గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.

సీపీఎన్ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ్

ఫొటో సోర్స్, RSS

విమర్శలు, సందేహాలు

నేపాల్ ప్రధాని ఓలీ మీడియా సలహాదారు సూర్యా థాపా సోషల్ మీడియాలో దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.

తర్వాత సీపీఎన్ నేతలు, కార్యకర్తలు, విపక్ష నేతలు ప్రధానమంత్రిపై తీవ్రంగా విమర్శలు చేశారు.

ప్రధానమంత్రి దౌత్య ప్రవర్తనా నియమావళిని అనుసరించలేదని చాలామంది ఆరోపిస్తున్నారు.

"ప్రధాని సాధారణంగా విదేశీ దౌత్యవేత్తలు లేదా రాజకీయ నేతలను కలుస్తుంటారు. కానీ ఆయన సమావేశం జరిగేటపుడు విదేశాంగ శాఖకు సంబంధించిన ఒక అధికారిక ప్రతినిధి అక్కడక కచ్చితంగా ఉంటార"ని మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ ప్రస్తుత ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ్ చెప్పారు.

కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ అనుసరించాలని మాత్రమే తాను చెబుతున్నానని ఆయన తెలిపారు.

ఈ సమావేశాన్ని అసాధారణంగా వర్ణించిన శ్రేష్ఠ్.." భారత నిఘా ఏజెన్సీ చీఫ్ ప్రధానిని ఇలా ఎందుకు కలిశారనే విషయాన్ని సీరియస్‌గా అడగడం సహజమే. ఇక్కడ, ఈ సమావేశం ఎందుకు జరిగింది, ముఖ్యంగా ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న కూడా వస్తుంది" అన్నారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన "ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని తేలిగ్గా తీసుకునేలా లేదు. దీనిపై చర్చ జరగాలి" అన్నారు.

నేపాల్, భారత్ జెండాలు

ఫొటో సోర్స్, Getty Images

రహస్య సమావేశం

మేలో నేపాల్ ఒక కొత్త రాజకీయ పటం విడుదల చేసిన తర్వాత భారత్ నుంచి ఒక ఉన్నతస్థాయి అధికారి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.

భారత్, నేపాల్ మధ్య సంబంధాలు ఇంతకు ముందులా లేవు. ఇలాంటి సమయంలో భారత నిఘా ఏజెన్సీ చీఫ్ అక్కడికి రావడం, ఆ దేశ ప్రధానిని కలవడం అంటే దానికి చాలా లోతైన అర్థం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

విదేశాంగ శాఖ అధికారులకు కూడా తెలీనంత రహస్యంగా జరిగిన ఈ చర్చలతో అధికార పార్టీ నేతలకు షాక్ తగిలింది.

సమావేశంలో ఏం చర్చించారు

బుధవారం భారత నిఘా ఏజెన్సీ చీఫ్ గోయల్ మర్యాద ప్రకారం ప్రధానిని కలిశారని నేపాల్ ప్రధాని ఓలీ మీడియా సలహాదారు సూర్యా థాపా తన ప్రకటనలో చెప్పారు.

భారత్-నేపాల్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం, పరస్పర సహకారం పెంపొందించడం లాంటి అంశాలకు భారత్ కట్టుబడి ఉందని ఈ సమావేశం ద్వారా రా చీఫ్ పునరుద్ఘాటించారని అందులో తెలిపారు.

అధికారిక ప్రకటన రావడానికి ముందు నేపాల్‌లోని ఏ ప్రభుత్వ సంస్థ నుంచీ దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు. కానీ చాలా మంది నేతలు ప్రధాని గోయల్‌ను రా చీఫ్ కలవలేదని స్పష్టం చేశారు.

వీడియో క్యాప్షన్, నేపాల్ ప్రజలు: భారత్ తమ హామీలు నెరవేర్చలేదు

అసంతృప్తికి కారణం

భారత్‌తో వివాదాలను పరిష్కరించుకోడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై చర్చించడానికి ఇటీవల అధికార సీపీఎన్ పార్టీ సిద్ధమైంది.

చాలా కీలక అంశాలపై ప్రభుత్వ తీరు గురించి పార్టీలో తీవ్ర అభిప్రాయ బేధాలు ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కానీ, ఏ సమాచారం లేకుండానే విదేశీ నిఘా ఏజెన్సీ చీఫ్‌తో ప్రధాని సమావేశం కావడం పార్టీ నేతల్లో గందరగోళానికి దారితీసింది.

గోయల్ నేపాల్ చేరుకున్నారనే వార్తలు బయటికి రాగానే, పుష్పకమల్ దాహాల్(ప్రచండ), పార్టీ సీనియర్ నేతలు, విపక్ష నేతలు రా చీఫ్‌ను ప్రధాని కలవలేదని చెప్పారు.

సీపీఎన్ శాశ్వత సభ్యుడు మాజీ ఉప ప్రధాని, హోంమంత్రి భీమ్ రావల్ గురువారం ట్వీట్ ద్వారా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రా చీఫ్ ప్రధానమంత్రి ఓలీని కలవడం గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సమావేశం జరిగిన విధానం కూడా అభ్యంతరకరంగా ఉందన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్, చైనా సరిహద్దు వివాదం: ఎల్ఓసీ, ఎల్ఏసీ, అంతర్జాతీయ సరిహద్దు... వీటి అర్థం ఏంటి?

దౌత్య గౌరవం

ప్రధాని ఓలీ ఇలా సమావేశం కావడం దౌత్య గౌరవానికి వ్యతిరేకమని విదేశాంగ అంశాల్లో నిపుణులు అంటున్నారు.

"ఇటీవల నేపాల్‌లో పెరుగుతున్న చైనా ప్రభావం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. రా చీఫ్ ఈ పర్యటన ద్వారా నేపాల్‌తో చర్చలకు తలుపులు తెరవాలని భారత్ అనుకుంటోంది. కానీ సుదీర్ఘ కాలంలో నేపాల్ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది" అన్నారు.

"ఈ సమావేశం జరిగిన తీరు చూస్తే, ప్రధానమంత్రి తన వ్యక్తిగత ఇబ్బందులను కూడా ప్రస్తావించే ఉంటారు. భారత్ ఆయనకు మద్దతు ఇస్తామని భరోసా కూడా ఇచ్చుంటుంది. వీటి గురించి కచ్చితంగా ఏదో చర్చ జరిగే ఉంటుంది" అన్నారు.

అదే జరిగుంటే, ప్రస్తుతానికి దీనివల్ల ఏ ప్రయోజనం లేకపోయినా, సుదీర్ఘ కాలంలో ఇది ఒక అంశంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)