సుందర్‌లాల్ బహుగుణ: చెట్లను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చిన చిప్కో ఉద్యమం ఎలా పుట్టింది

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘భూమి, ప్రకృతిని మనం ధ్వంసం చేస్తున్నాం. ప్రకృతి పాలిట కసాయివారిలా మారుతున్నాం’’అని ఓ ఇంటర్వ్యూలో సుందర్‌లాల్ బహుగుణ చెప్పారు.
94ఏళ్ల వయసులో కోవిడ్‌తో మరణించిన బహుగుణ పర్యావరణ పరిరక్షకుడిగా ప్రపంచ దేశాలకు సుపరిచితుడు. చెట్లను ఆలింగనం చేసుకొని వాటిని కొట్టివేయకుండా కాపాడాలని భారతీయులకు పిలుపునిచ్చింది ఆయనే.
1970లలో ఉత్తర భారత దేశంలో పురుడు పోసుకున్న చిప్కో ఉద్యమ ప్రధాన నాయకుల్లో ఆయన ఒకరు. హిందీలో ‘‘చిప్కో’’ కంటే ఆలింగనం చేసుకోవడం.
బహుగుణ పిలుపుపై తోటి ఉద్యమకారుడు చండీ ప్రసాద్ భట్‌తోపాటు చాలా మంది హిమాలయాల్లోని చెట్లను ఆలింగనం చేసుకున్నారు. ఎవరు చెట్లను కొట్టేయకుండా మానవహారాలు కట్టారు. ‘‘ఈ చెట్లు మాలో భాగమే’’అనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి ఈ ఉద్యమం తీసుకెళ్లింది.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హిమాలయాల్లో పర్యావరణ సంక్షోభాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లింది కూడా ఈ ఉద్యమమే.

ఫొటో సోర్స్, GETTY IMAGES
1970ల్లో ఉత్తరాఖండ్‌లో విధ్వంసకర వరదలు ముంచెత్తడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. ‘‘చెట్ల నరికివేత, వరదలు, కొండ చరియలు విరిగిపడం మధ్య లంకెను వారు తెలుసుకున్నారు’’అని చిప్కో ఉద్యమం గురించి ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు.
ఈ వరదలకు మూడేళ్ల తర్వాత, బహుగుణతోపాటు ఆయన అనుచరులు చెట్లను ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది యువకులు అయితే, ప్రకృతిని పరిరక్షిస్తామని రక్తంతో ప్రతినబూనారు.
ఆ తర్వాత మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. చెట్లను హత్తుకోవడంతోపాటు వాటికి రాఖీలు కూడా కట్టారు. మంచులో నడుచుకుంటూ వెళ్లి, చెట్లను కొట్టేవారి చేతుల్లో నుంచి పనిముట్లను కూడా వారు లాగేసుకునేవారు.
హిమాలయాల్లో పెరిగిన బహుగుణ ఈ ఉద్యమానికి చక్కటి నాయకత్వం అందించారు. చెట్ల నరికివేతతో నేల కోతకు గురవుతుందని, దీంతో ఇక్కడి పురుషులు అన్నింటినీ కోల్పోయి పట్టణాలకు వలస వెళ్లాల్సి ఉంటుందని బహుగుణ హెచ్చరించారు.
దీంతో వంట చెరకు తేవడం నుంచి నీళ్లు మోసుకోవడం, వ్యవసాయం.. ఇలా అన్ని బాధ్యతలూ మహిళలపై పడతాయని బహుగుణ అన్నారు. మహిళా హక్కుల ఉద్యమాల్లో ఈ ఉద్యమం ఒక మైలురాయిలా నిలిచింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏళ్లు గడిచేకొద్దీ, ఈ ఉద్యమం మరింత బలపడింది. పెద్దయెత్తున కాలేజీ విద్యార్థులు, మహిళలు దీనిలో చేరారు. వీరు శాంతియుత ప్రదర్శనలు, దీక్షలు చెపడుతూ... చెట్లను ఆలింగనం చేసుకునేవారు.
ఈ ఉద్యమం 1981లో ఫలించింది. ఉత్తరాఖండ్‌లో వాణిజ్య అవసరాల కోసం చెట్లను కొట్టేయకుండా ప్రభుత్వం 15ఏళ్ల నిషేధం విధించింది. రెండేళ్ల తర్వాత, హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసం గురించి అందరికీ తెలియజేసేందుకు బహుగుణ నాలుగు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.
1992లో భారత్‌లో అత్యంత పొడవైన తెహ్రీ డ్యాం ముందు బహుగుణ గుండు కొట్టించుకొని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆనకట్ట వల్ల తమ ఇళ్లను కోల్పోయినవారిలో బహుగుణ కూడా ఒకరు.
అటవీ అధికారులు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు పర్యావరణ విధ్వంసంపై ఆయన హితబోధ చేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
బహుగుణ ఉద్యమం గురించి ఓ ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ప్రశ్నిచినప్పుడు.. ‘‘నిజానికి, ఈ ఉద్యమ లక్ష్యాల గురించి నాకు తెలియదు. ఒకవేళ చెట్లను నరికివేయకుండా అడ్డుకోవడమే వీరి లక్ష్యం అయితే, నేను కూడా వారి వెంట నిలబడతాను’’అని ఆమె చెప్పారు.
ఏళ్లు గడిచినప్పటికీ బహుగుణ ఇచ్చిన సందేశం ఇప్పటికీ మనకు కనిపిస్తుంటుంది. 2017లో ముంబయిలో మెట్రో రైలు కోసం చెట్లు నరికేయకుండా చాలా మంది చెట్లను ఆలింగనం చేసుకున్నారు.
బహుగుణ గాంధేయవాది. చిన్న ఆశ్రమంలో ఆయన జీవించేవారు. హింసను ఆయన త్యజించారు. ఆయన ఉద్యమాలకు రాజకీయాలతో సంబంధంలేదు. విదేశీ వాణిజ్యం కంటే ఆత్మనిర్భరతకే ఆయన మొగ్గుచూపేవారు.
భారత్ ఇంధన అవసరాల కోసం మానవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని.. సౌర, పవన, జల విద్యుత్‌లను ఉపయోగించాలని ఆయన సూచించారు. తక్కువ విద్యుత్ ఉపయోగించుకునేలా మెషీన్లను మెరుగుపరచుకోవాలని అన్నారు.

ఫొటో సోర్స్, PIB
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927లో బహుగుణ జన్మించారు. పచ్చని పచ్చిక బయళ్లు, దేవదారు వృక్షాల నడుమ ఆయన పెరిగారు.
స్కూల్ ట్రిప్‌లో భాగంగా బహుగుణను చూసేందుకు 1970ల్లో హిమాలయాలకు వెళ్లిన బీబీసీ మాజీ ఉద్యోగి అమిత్ బారువా తన అనుభవాలను వివరించారు.
‘‘వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉండే బహుగుణ చాలా మృదు స్వభావి. ఎంతో హుందాగా నడుచుకుంటారు. హిమాలయ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడానికి, చెట్ల నరికివేతకు సంబంధముందని తొలినాళ్లలో చెప్పినవారిలో ఆయన కూడా ఒకరు’’అని అమిత్ చెప్పారు.
‘‘అప్పట్లో నేను అక్కడికి వెళ్లినప్పుడు నీటి కోసం మహిళలు చాలా దూరం నడిచివెళ్లడాన్ని చూశాను. తమ సొంత జీవిత అనుభవాల నుంచే ఈ ఉద్యమం పుట్టుకు వచ్చింది’’అని నాకు తెలిసింది.
మట్టి మనిషిగా బహుగుణ చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ప్రకృతిని కాపాడేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా ప్రకటించాలని కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు చెప్పింది
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- కరోనావైరస్: గంగా నదిలో కుప్పలు తెప్పలుగా కొట్టుకొస్తున్న కోవిడ్ మృతదేహాలు
- కరోనావైరస్: గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








