ఈ జంతువులు చేసే కామెడీ చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఫొటో సోర్స్, DELPHINE CASIMIR/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARD
ఈ ఏడాది కామెడీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ఫైనలిస్టులను ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ ఫోటో గ్రాఫర్ల నుంచి వేల కొద్దీ ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో విజేతలను నవంబర్ 23న ప్రకటిస్తారు.
ఫైనల్స్‌కు ఎంపికైన కొన్ని ఫొటోల వివరాలేంటో చూద్దాం.

ఫొటో సోర్స్, JASON MOORE/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
‘‘ఓ మైదానంలో పచ్చని పొలాల్లో మేస్తున్న కంగారూల గుంపును దాటి వెళుతున్న సమయంలో కొన్ని ఫోటోలను తీసుకునేందుకు ఆగాను. అందులో ఓ కంగారూ విచిత్రంగా నిల్చోవడం చూశాను. అదెలా ఉందంటే ఆ కంగారూ గాలిలో గిటార్ వాయిస్తూ ఉన్నట్లు ఉంది’’ అని ఈ ఫోటో తీసిన జేసన్ మూర్ తెలిపారు.

ఫొటో సోర్స్, T FINKELSTEIN/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
చిత్తడి నేలల్లో తిరిగే ఈ భారీ తాబేలు నోరు తెరవడంతో ఓ తూనీగ వచ్చి దాని ముక్కుపై వాలిందని ఈ ఫోటో తీసిన టాహి ఫింకెల్‌స్టెయిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ALLEN HOLMES/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
‘‘కొన్ని జంతువుల ఫోటోలు తీసేందుకు నేను సఫోక్ వెళ్లాను. అయితే దారిలో ఉన్న మిన్‌స్మియర్ రిజర్వ్‌లో ఆర్ఎస్‌పీబీని సందర్శించాలనుకున్నాను. ఆ రోజు చాలా ఎండగా ఉండటంతో ఓ పక్షి కేంద్రంలో ఆగాను. ఈజిప్షియన్ బాతు ఒకటి ఎగురుతూ కనిపించింది. దాన్ని కొంగ అనుకుని పొరబడ్డ కొంగ ఒకటి బాతుతో జత కట్టేందుకు అక్కడ కిందకు దిగింది’’ అని ఈ ఫోటో తీసిన అలెన్ హోమ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, PAUL GOLDSTEIN/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
‘‘అది పక్షి కాదనే విషయం నాకు తెలుసు. సాంకేతికంగా చెప్పాలంటే దీనికి గాలిలోకి ఎగిరే శక్తి కూడా లేదు. అయితే ఈ లెపర్డ్ మాత్రం ఎగిరే ప్రయత్నం చేస్తోంది. ఆ సమయంలో దీనిని మూడు పిల్ల చీతాలు ఇబ్బంది పెట్టడం కనిపించింది’’ అని పాల్ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

ఫొటో సోర్స్, BRIGITTE ALCALAY MARCON/COMEDY WILDLIFE AWARDS
‘‘ఈ పిల్ల కోతి తల్లి వీపు మీద కూర్చుని ఓ ముద్దు పెట్టవా అని అడుగుతున్నట్లు పోజ్ పెట్టింది’’ అని ఫోటోతీసిన బ్రిగిట్టి అల్కలే మర్కన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ADRIAN SLAZOK/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
వసంతకాలం ముగింపు దశకు రావడంతో పిల్లల్ని కనేందుకు సీల్స్ నార్త్ సీ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నాయి.

ఫొటో సోర్స్, CHRISTIAN HARGASSER/COMEDY WILDLIFE PHOTO AWARDS
కెన్యాలోని మసాయ్ మరలో సాయంత్రం పూట చెట్టు కొమ్మ మీద సింహం పిల్ల ఇలా నిద్ర పోతూ కనిపించింది.

ఫొటో సోర్స్, THOMAS VIJAYAN/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS

ఫొటో సోర్స్, JACEK STANKIEWI/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
ఈ బుల్లి గ్రీన్ ఫిచ్ పక్షికి తల్లి పక్షి ఆహారం తినిపిస్తోంది. అయితే వీటిని నిశితంగా చూస్తే ఆహారం తింటున్నట్లు కాకుండా, ఏదో గొడవ పెట్టుకుని అరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, LARA MATHEWS/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS

ఫొటో సోర్స్, JACQUES POULARD/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
ఈడ్చి కొడుతున్న చల్లని చలిగాలుల మధ్య ఈ తెల్లటి గ్రౌస్ పక్షి ఇలా నడిచొస్తోంది.

ఫొటో సోర్స్, JOHN BLUMENKAMP/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS

ఫొటో సోర్స్, KHURRAM KHAN/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS

ఫొటో సోర్స్, ZOE ASHDOWN/COMEDY WILDLIFE PHOTOGRAPHY AWARDS
ఇవి కూడా చదవండి:
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














