పిక్నిక్‌కు వెళితే పరేషాన్ చేసిన ఎలుగుబంటి
మెక్సికో న్యూవో లియోన్ స్టేట్‌లోని చీపినిక్ ఎకలాజికల్ పార్క్‌లో ఆకలితోనున్న ఓ ఎలుగుబంటి పర్యటకుల దగ్గరకు వచ్చి టేబుల్ పైకి ఎక్కి ఇలా ఆహారం తింది. ఆ సమయంలో అక్కడున్నవారు కదలకుండా ఉండిపోయారు.
ఒకానొక సమయంలో తన బాబును దగ్గరగా పట్టుకొని అక్కడే కదలకుండా కూర్చున్న ఒక మహిళకు చాలా దగ్గరగా వెళ్లింది ఎలుగుబంటి.
అయితే, ఆమెను ఏమీ అనలేదు. ఆహారం తిన్న తర్వాత ఎవరికీ హాని చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. టిక్‌టాక్‌లో దీనికి పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఏం చేయాలో పార్క్ వెబ్‌సైట్‌లో కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఫోటో తీసుకోవడానికి దగ్గర వెళ్లకూడదని కూడా దానిలో హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











