ఏమిటీ భయంకరమైన ప్రాణి.. ఎక్కడుంటుంది ఇది

stargazer fish

ఫొటో సోర్స్, PIETRO FORMIS

ఈ ఫోటోను చూస్తే మీకు ఏమనిపిస్తోంది?

మహా సముద్రం నుంచి ఏదో భారీ సైజున్న భయంకరమైన ఆకారం ఒకటి మీదకు వస్తున్నట్లుగా అనిపిస్తోందా..

నిజానికి ఈ చిత్రంలో మీరు చూస్తున్నది ‘స్టార్‌గేజర్’ అనే ఒక రకమైన చేప. ఇది సముద్రంలో అడుగున ఇసుకలో తనను తాను కప్పుకొని ఉంటుంది.

ఇటలీకి చెందిన పియెట్రో ఫార్మిస్ అనే ఫొటోగ్రాఫర్ మధ్యధరా సముద్రంలో ఈ ఫొటో తీశారు.

ఈ ఏడాది ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద యియర్’ పోటీలలో వచ్చిన ఫొటోలలో దీనికి అనేక మంది నుంచి ప్రశంసలు దక్కాయి.

పియెట్రో ఫార్మిస్

ఫొటో సోర్స్, www.pietroformis.com

ఫొటో క్యాప్షన్, పియెట్రో ఫార్మిస్

అయితే, ఈ ఫొటో తీసిన పియెట్రో మాట్లాడుతూ తాను సాధారణంగా పోటీల కోసం ఫొటోలు తీయనని.. కానీ, తీసిన తనకే ఇది ఎంతగానో నచ్చడంతో పోటీ కోసం పంపించానని చెప్పారు.

ఈ పోటీలో తాను తీసిన ఈ ఫొటోకు ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉందని, ఇలాంటి స్పందన వస్తుందని అసలు ఊహించలేదన్నారు.

‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫలితాలు వెల్లడించే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు పియెట్రో.

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ

ఫొటో సోర్స్, ZHAI ZEYU

ఫొటో క్యాప్షన్, పోటీలో ఉన్న మరో చిత్రం ఇది

కాగా ఈ పోటీలో వచ్చిన ఎంట్రీలన్నీ పరిశీలించిన తరువాత తుది విజేతలను అక్టోబర్ 10న ప్రకటిస్తారు.

ఈ పోటీకి వచ్చిన వేలాది ఎంట్రీల నుంచి 100 మంచి చిత్రాలను ఎంపిక చేసి ‘ది యాన్యువల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎగ్జిబిషన్’లో అక్టోబర్ 13 నుంచి ప్రదర్శిస్తారు.

సముద్ర గర్భం

ఫొటో సోర్స్, Getty Images

అట్లాంటిక్ స్టార్‌గేజర్ చేప లాటిన్ పేరు యురానోపస్ స్కాబర్.

ఇవి తాము వేటాడే చేపలను దక్కించుకోవడం కోసం సముద్రం అడుగున ఇసుకలో మాటు వేస్తాయి.

కళ్లు, నోరు తప్ప మిగతా శరీరం అంతటినీ పూర్తిగా ఇసుకతో కప్పుకొంటాయి.

పియెట్రో తీసిన ఫొటోలోనూ ఈ చేపను ఇలాంటి స్థితిలోనే చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)