ఆంధ్రప్రదేశ్: మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే..
ఇవి మడ అడవులు. నదులు సముద్రంలో కలిసే చోట, తీరప్రాంతంలో ఇవి సహజసిద్ధంగా పెరుగుతాయి.
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే మడ అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.
మడ అడవుల మధ్య ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏపీలోని కేజీ బేసిన్‌లో ఇవి ఉన్నాయి. కృష్ణా, బాపట్ల జిల్లాల పరిధిలో 5 వేల హెక్టార్ల వరకూ ఈ అడవులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి.

నీళ్లలో వేర్లు, మొదళ్లు కనిపిస్తూ, పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి మడ అడవులు. ఇవి పలు జీవులకు ఆవాసంగా ఉంటాయి. అదే సమయంలో మత్స్యకారుల చేపల వేటకు కూడా ఇవి ఆధారంగా ఉన్నాయి.
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం ప్రాంతంలో మడ అడవుల నుంచి సముద్రం మధ్యలో ఉండే పాయ వరకూ వెళ్లి చేపలు పడుతుంటారు.
ఇవి కూడా చదవండి
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా,
- తెలంగాణ: 43 కులాలకు భవనాలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం, కులాల జనాభాను ఎందుకు రహస్యంగా పెట్టింది?
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి ప్రేమాయణం పెళ్లిగా ఎలా మారింది?
- క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్గఢ్లో వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



