షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?

బ్రిటన్‌లో పౌరసత్వాన్ని పొందడంలో షమిమా బేగం మరోసారి విఫలమయ్యారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు తన 15 ఏళ్ల వయసులో ఆమె బ్రిటన్ వదిలి వెళ్లారు.
ఆమె తిరిగి బ్రిటన్‌లో అడుగు పెట్టకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకుంది. ప్రస్తుతం 24 ఏళ్ల వయసున్న షమీమా సిరియాలో ఉంటున్నారు.
ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు తూర్పు లండన్ నుంచి సిరియా వెళ్లిన ముగ్గురు స్కూలు విద్యార్థినుల్లో షమిమా ఒకరు.
ఆమె ఇంగ్లండ్‌లోనే పుట్టారు. ఆమె తల్లిదండ్రులు బంగ్లాదేశ్‌కు చెందినవారు.
షమిమా ఇస్లామిక్ స్టేట్ ఫైటర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు చనిపోయారు.
దేశ భద్రత దృష్ట్యా ఆమె పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు బ్రిటన్ 2019లో ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఉత్తర సిరియాలోని క్యాంపులో జీవిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వం అంటే ఏమిటి ?
పౌరసత్వం అనేది ఒక వ్యక్తి ఒక దేశంలో నివసించేందుకు చట్టబద్దంగా లభించే అనుమతి. బ్రిటన్‌లో ఉండాలంటే ఆ దేశ పౌరసత్వం తప్పనిసరి.
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, విద్య, వైద్య సౌకర్యాలు పొందాలంటే పౌరసత్వం తప్పనిసరి. దానితోనే ఓటు వేసే హక్కు వస్తుంది. అది వ్యక్తుల గుర్తింపు కూడా.
అయితే కొంతమంది వ్యక్తులకు బ్రిటిష్ పౌరసత్వం లేకున్నా బ్రిటిషర్లకు ఉండే హక్కులతో సమానమైన హక్కులతో అక్కడ జీవించవచ్చు.
అలాంటి వారికి సెటిలర్లు, జీవించేందుకు నివాసం లాంటి హోదాలు కల్పిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వాన్ని ఎలా ఉపసంహరించుకోవచ్చు?
ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఓ వ్యక్తికి ఇచ్చిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా ప్రజా ప్రయోజనం కోసమే.
ఎవరైనా మోసపూరితంగా ఆ దేశ పౌరసత్వం సంపాదించుకున్నట్లు తేలినా సిటిజన్ షిప్ రద్దు చెయ్యవచ్చు.
ఒక వ్యక్తి వల్ల బ్రిటన్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావిస్తే అలాంటి వారి పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు. వారు వేరే దేశంలో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌గ్రూప్ లాంటి సంస్థల్లో సభ్యులు మోసపూరితంగా బ్రిటన్ సభ్యత్వాన్ని పొందినప్పుడు దాన్ని రద్దు చెయ్యవచ్చు.
ఒక వ్యక్తికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పౌరసత్వాన్ని రద్దు చేసే హక్కు జాతీయత సరిహద్దు చట్టం ద్వారా హోం శాఖకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
షమిమా బేగం కేసులో తర్వాత ఏం జరగనుంది?
షమిమా బేగం బంగ్లాదేశ్‌లోనే జన్మించారు కాబట్టి, ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం చట్టబద్దమేనని 2020 ఫిబ్రవరిలో కోర్టు చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఆమె సిటిజన్ షిప్ రద్దు చేయడం వల్ల ఆమె ఏ దేశానికీ చెందని వ్యక్తిగా మిగిలిపోరని పేర్కొంది.
అయితే బంగ్లాదేశ్ మాత్రం ఇది సరికాదని, ఆమెను తమ దేశంలోకి అనుమతించేది లేదని చెబుతోంది.
షమిమా బేగం మళ్లీ బ్రిటన్ వచ్చేందుకు అర్హత కోల్పోయారని 2021లో బ్రిటన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
షమిమా పౌరసత్వాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని ఆమె తరపు లాయర్లు స్పెషల్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ ఎదుట సవాల్ చేశారు.
ఈ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఆమె మానవ అక్రమ రవాణాలో బాధితురాలని వాదిస్తున్నారు.
షమిమా మానవ అక్రమ రవాణా బాధితురాలైనా , ఆమెను లైంగికంగా వేధించినట్లు తాము గుర్తించినప్పటికీ, ఆమె వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్ర హోంమంత్రికున్న హక్కును తాము నిరోధించలేమని స్పెషల్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ తెలిపింది.
ఈ నిర్ణయాన్ని తాజాగా కోర్టు కూడా సమర్థించింది.
షమిమా బేగం ఇతరుల మాటల వల్ల ప్రభావితమైనా, బాధితురాలైనా, సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్‌లో చేరాలనే నిర్ణయం ఆమె స్వయంగా తీసుకున్నారని న్యాయమూర్తులు చెప్పారు.
ఈ కేసు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని బీబీసీ లీగల్ అఫైర్స్ కరస్పాండెంట్ కస్కియాని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ
- యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున తెలంగాణ యువకులు పోరాడుతున్నారా? వారిని పంపించింది ఎవరు?
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లి కొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్ డోస్ కావడంతో చనిపోయారా?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














