ఫ్రెండ్స్‌తో ఎక్కువగా గడిపితే ఆరోగ్యంగా ఉంటామా

ఫొటో సోర్స్, Getty Images
రొమాంటిక్ సంబంధాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఎక్కువ కాలం పాటు జీవించేందుకు సహకరిస్తాయని వివిధ అధ్యయనాలలో తేలింది.
మరి, స్నేహబంధాలు కూడా అదే రకమైన ప్రయోజనాలను ఇస్తాయా?
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
బెన్నీ షేక్స్ తన స్నేహితుల విషయానికి వచ్చే సరికి చాలా తక్కువ సమయం కేటాయించే వారు.
‘‘అన్ని సార్లు కూడా నేను నా స్నేహితులతో గడిపే సమయాన్ని రద్దు చేసుకునే వాణ్ని’’ అని బెన్నీ షేక్స్ చెప్పారు.
బెన్నీ షేక్స్ బ్రిటన్‌లో నాటింగ్హామ్‌లో స్టాండప్ కమెడియన్. ఆయన చేసే ఈ పనిలో చాలా ఎనర్జీ అవసరం.
బెన్నీ మానసిక ఆరోగ్య సమస్యలు, పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నారు.
‘‘నా ఈ పరిస్థితుల కారణం చేత ఎక్కువ మంది స్నేహితులను ఉంచుకోవడం చాలా కష్టం. చాలా సార్లు నేను అలసిపోతుంటాను. విసుగెత్తిపోతాను. ’’ అని బెన్నీ షేక్స్ చెప్పారు.
అదృష్టవశాత్తు తన స్నేహితులు, భాగస్వాములు ఈయనకు కావాల్సిన ఏకాంత సమయాన్ని అర్థం చేసుకున్నారు.
మందులు తీసుకోవాలని ఆయనకు గుర్తు చేయడం నుంచి మానసిక ఆరోగ్య సమస్యల తలెత్తినప్పుడు ఆయన చేదోడుగా నిలవడం వరకు ఎప్పటికప్పుడు బెన్నీకి స్నేహితులు సాయపడుతూ ఉన్నారు.
బెన్నీ షేక్స్ తన స్నేహితుడు మార్క్ నికోలస్‌తో కలిసి కరోనా మహమ్మారి సమయంలో ఇతర డిజేబుల్డ్ కమెడియన్లు, కళాకారులతో కలిసి గ్రూప్ చాట్ ఏర్పాటు చేశారు.
ఈ గ్రూప్ చాట్‌తో ప్రస్తుతం తాము ఎప్పుడైనా ఎవరైనా బాధలో ఉంటే లేదా అవసరమైన వారికి 25 మంది వరకు తాము సాయం చేస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరం ఒకరికొకరం సాయపడతామని వివరించారు. షేక్స్ జీవిత అనుభవాలు చాలా ప్రత్యేకం.
స్నేహం రూపంలో ఫ్రెండ్స్ నుంచి ఆయనకు లభించిన తోడుతో, ఒంటరి అనే ఫీలింగ్ నుంచి షేక్స్ బయటపడ్డారు.
చికాకుగా ఆందోళనలో ఉన్న మన మనసును తేలికపరచడం నుంచి గుండెకు మంచి చేయడం వరకు శరీరానికి, మనసుకు స్నేహబంధాలు పలు రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి.
శృంగార, కుటుంబ సంబంధాల కంటే తక్కువగానే మనం స్నేహబంధాలకు విలువ ఇస్తున్నప్పటికీ, వీటి నుంచి ప్రయోజనాలను మాత్రం విలువ కట్టలేనివి.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహబంధంతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక వ్యవస్థపై సోషల్ ఐసోలేషన్ ఎలా ప్రభావం చూపుతుందో వివరిస్తూ సైన్స్ జర్నలిస్ట్ లిడియా డెన్‌వోర్త్ స్నేహంపై ఒక పుస్తకాన్ని రాశారు.
ఉదాహరణకు, మీరు ఒంటరితనంగా భావించినప్పుడు మీ తెల్ల రక్తకణాలు వాటి విధానాన్ని మార్చుకుంటాయి.
ఇవి మరింత అనారోగ్యానికి దారితీస్తాయి. మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని డెన్‌వోర్త్ వివరించారు.
సోషల్ కనెక్షన్లు కేవలం రోగనిరోధక వ్యవస్థను మాత్రమే బలోపేతం చేయవు.
సామాజికంగా ఇతరులతో ఎక్కువగా కలిసే ప్రజలు ఎక్కువ కాలం పాటు, ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు కూడా వీలవుతుంది.
హైపర్ టెన్షన్‌కు తక్కువ ప్రమాదం ఉంటుంది.
హాయిగా నిద్రపోయేందుకు, ఏదైనా బాధ నుంచి వేగంగా కోలుకునేందుకు కూడా స్నేహితులు సాయపడుతుంటారు.
దీనికి విరుద్ధంగా ఒకరికొకరు ఇష్టపడని, నమ్మకం లేని స్నేహబంధాలు దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తాయి.
కొన్ని కేసుల్లో ధూమపానం, అత్యధిక కోలెస్ట్రాల్ కంటే కూడా సామాజికంగా ఇతరులతో సంబంధాలను తెంచుకోవడమే అత్యధికంగా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల అంశాల పట్లనున్న సంబంధాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయని నార్త్ లండన్‌లోని ఇతర చారిటీలకు మద్దతు ఇచ్చే చారిటీ వాలంటరీ యాక్షన్ క్యామ్‌డెన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మేనేజర్ డోనా టర్న్‌బుల్ చెప్పారు.
సోషల్ ఐసోలేషన్(సామాజికంగా ఇతరులతో కలవకపోవడం) ఏ ఆరోగ్య సమస్యనైనా మరింత క్లిష్టంగా మారుస్తుందని సాధారణంగా మనకు తెలిసిందేనని టర్న్‌బుల్ అన్నారు.
ఉదాహరణకు, ‘‘ఒకవేళ మీరు సామాజికపరంగా చురుకుగా ఉండకపోతే, మీరు శారీరకంగా కూడా చరుకుగా ఉండలేరు’’
‘‘చిన్న చిన్న రూపాల్లో ప్రేమ ఎక్కడి నుంచి మీకు లభిస్తుంది లేదా వారు ఏ బంధానికి చెందిన వారనేది సంబంధం లేకుండా, ఆ సంభాషణలు, సంబంధ బాంధ్యవాలు మంచిగా ఉండటం చాలా ముఖ్యం. మీరు అనారోగ్యం పాలైనప్పుడు మీకు సాధారణంగా కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.
కానీ, కొన్నిసార్లు ఈ సహకారం స్నేహితుల రూపంలో కూడా రావొచ్చు. ఇది కూడా ఎప్పటికీ ప్రేమను తెలియపరుస్తుంది’’ అని అమెరికాలోని క్లేర్‌మాంట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ సైదా హేష్మతి, ఆమె కొలీగ్స్ పరిశోధన తెలిపింది.
మనల్ని ఆరోగ్యకరంగా ఉంచే స్నేహబంధాల పాత్రను చారిత్రాత్మకంగా చూసుకుంటే మనం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. సైన్స్‌పై దశాబ్దాల పాటు చేపట్టిన పరిశోధనలు ఇది తప్పని సూచిస్తున్నాయి.
‘‘స్నేహితులు మరింత గౌరవాన్ని పొందాల్సి ఉంది. మన ప్రాధాన్యతల జాబితాలో వారిని చివరిగా ఉంచకూడదు’’ అని డెన్‌వోర్త్ చెప్పారు.
కొన్ని సార్లు వివాహ బంధం లేదా కుటుంబంతో పోలిస్తే స్నేహితులే మనల్ని బాగా సంరక్షిస్తూ ఉంటారు.
మొత్తానికి మెరుగైన ఆరోగ్యానికి, మరింత సంతోషకరమైన జీవనానికి.. కుటుంబానికి, స్నేహితులకు ఇచ్చే విలువతోనే ముడిపడి ఉంటుందని 97 దేశాలపై చేపట్టిన ఒక డేటా అనాలసిస్‌లో వెల్లడైంది.
వయసు పైబడిన వారి ఆరోగ్యానికి, సంతోషానికి స్నేహబంధాలు చాలా ముఖ్యమని ఈ డేటా తేల్చింది.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ రకాల స్నేహాలు
అన్ని సంస్కృతుల్లో స్నేహమనేది స్వచ్ఛందంగా పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడుతూ కోరుకునే బంధమని హేష్మతి చెప్పారు.
ఇది సమయానికి అనుగుణంగా మారుతూ వస్తోంది.
ఈ బంధంలోని వ్యక్తులు సామాజిక, భావోద్వేగ లక్ష్యాలను అనుసరిస్తూ ఉంటారు. కానీ, సాంస్కృతిక అంశాలు, అంచనాలతో ఇవి ప్రభావమయ్యే అవకాశం ఉంది.
ఒక జీవిత ప్రయాణంలో స్నేహాలపై చేపట్టిన పరిశోధనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి.
స్నేహితులతో కేటాయించే సమయానికొస్తే, యూ-కర్వ్ కనిపిస్తోంది.
యుక్త వయసులో ఉన్న వారిపై స్నేహబంధాలు ఎక్కువ ప్రభావం చూపుతాయని డెన్‌వోర్త్ రిపోర్ట్‌లు తెలిపాయి.
మధ్య వయసు వారిపై కాస్త తక్కువ ప్రభావం చూపుతుంది.
వయసు పైబడిన వారికి ఇవి కాస్త కోలుకునేందుకు సహకరిస్తాయని ఈ రిపోర్ట్‌లు తెలిపాయి.
న్యూరోసైన్స్ రీసెర్చ్ నుంచి కూడా దీనికి బలమైన ఆధారం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహితులతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వారి మెదడు పనితీరుపై అధ్యయనం చేసేందుకు పలు అధ్యయనాలు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్(ఎఫ్ఎంఆర్ఐ)ను ఉపయోగించారు.
సోషల్ బ్రెయిన్ విభాగాలను ఫ్రెండ్‌షిప్ యాక్టివేట్ చేస్తుందని ఈ ఫలితాలు నిరూపించాయి.
ఇతరుల ఆలోచలను, దృక్పథాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు వీరికి ఉంటున్నాయి.
డబ్బులను గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చి వాటిని స్నేహితులతో లేదా ఇష్టంలేని వారితో పంచుకునే అవకాశాన్ని ఇస్తే... వారు స్నేహితున్ని ఎంపిక చేసుకున్నప్పుడు మెదడులోని రివార్డు రీజియన్స్ మరింత చురుకుగా మారాయని ఒక అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
తమ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి రివార్డులను గెలుచుకున్నప్పుడు, రివార్డు సెన్సిటివిటీ పెరుగుతుందని ముఖ్యంగా యుక్తవయసులో వారికి ఇది ఎక్కువగా ఉంటుందని నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీకి చెందిన డెవలపర్‌మెంటల్ న్యూరోసైంటిస్ట్ బెర్నా గురోగ్లు అన్నారు.
15 నుంచి 16 ఏళ్ల వయసులోని వారికి ఇది అధికంగా ఉంటుందన్నారు.
సోషియోఎమోషనల్ కనెక్టివిటీ థియరీని గురించి హేష్మతి వివరించారు.
ప్రజల వయసు పెరిగే కొద్దీ సోషల్ ఇంటరాక్షన్స్ విషయంలో వారు చాలా సెలక్టివ్‌గా ఉంటారని అన్నారు.
‘‘యుక్తవయసులో, మీరు వివిధ రకాల స్నేహితులతో సమయాన్ని గడుపుతుంటారు. ఆ సమయంలో మీరు కేవలం వివిధ అంశాలను తెలుసుకునేందుకే ఆసక్తి చూపుతుంటారు.
వయసు పెరిగే కొద్దీ మీకు సాయపడని చాలా వరకు సంబంధాలను మీరు తెంచుకుంటూ వెళ్తారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూర్చే వారిని మాత్రమే ఉంచుకుంటారు’’ అని హేష్మతి తెలిపారు.
ముఖ్యంగా ప్రజలు వయసు మీదపడుతున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునే స్నేహితులుండటం చాలా అవసరం. కానీ, మీ జీవిత కాలంలో కాజువల్ స్నేహితులు కూడా మీకు సాయంగా నిలుస్తారు.
మనకు సమాచారాన్ని అందించేందుకు నార్మల్ ఫ్రెండ్స్ చాలా సాయపడుతుంటారు.
కానీ, ఇదే సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ కీలక సపోర్ట్ ఇస్తూ ఉంటారు.
స్నేహబంధాల్లో వైవిధ్యత కూడా చాలా ఉపయోగపడుతుంది.
సామాజిక సంబంధాల్లో వివిధ రకాల వారు ఉండటం మన ఆరోగ్యానికి ప్రయోజనకరం.
బలమైన స్నేహాలు పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఇబ్బందులతో, క్లిష్టంగా ఉండే సంబంధ బాంధవ్యాలు అధిక రక్తపోటుకి, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
‘‘మీకు వందలాది మంది స్నేహితులు ఉండొచ్చు. కానీ, ఇంకా మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు.’’ అని కొన్ని స్నేహాల గురించి షేక్స్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహబంధాలలో ఉన్న ప్రాక్టికల్ సమస్యలు
స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వారు, రెండేళ్ల తర్వాత కూడా సామాజిక మినహాయింపుకు తక్కువ సెన్సిటివిటీని కలిగి ఉంటారని లాస్ ఏంజిల్స్ హైస్కూలర్స్ అధ్యయనంలో తెలిసింది.
స్నేహితులతో ఎల్లప్పుడూ పాజిటివ్ సంభాషణలు చేసే వారికి రివార్డు సిస్టమ్ చురుకుగా పనిచేస్తూ ఉంటుందని గురోగ్లు చెప్పారు.
డిప్రెషన్‌తో బాధపడే వారు రివార్డు సిస్టమ్ పనితీరులో కొన్ని సమస్యలున్నప్పటికీ, వివిధ రకాల వ్యక్తులలో ఈ రివార్డు సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దానిపై మరింత పరిశోధన చేపట్టేందుకు సమయం పడుతుందని పరిశోధకులు తెలిపారు.
‘‘స్నేహంపై ఫోకస్ చేసేందుకు 50 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చేంత వరకు ఆగుదామని ఆలోచిస్తుంటే, వారు తప్పు చేస్తున్నట్లే’’ అని డెన్‌వోర్త్ అన్నారు.
కుటుంబం, కెరీర్ నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల మధ్య మయస్కుల వారు స్నేహితులను పక్కన పెడుతూ ఉంటారు.
కొంతమంది డాక్టర్లు వృద్ధులను తమ స్నేహాల గురించి అడుగుతూ ఉంటారు. ఈ బంధాలు వారిని డిమెన్షియా నుంచి కాపాడుతూ ఉంటాయి.
కానీ, కేవలం రోగులు మాత్రమే వీటి నుంచి ప్రయోజనం పొందడం లేదని పరిశోధకులు అన్నారు. ఇతర వ్యక్తులు కూడా వీటి ప్రయోజనాలు పొందుతున్నారు.
సోషల్ ప్రిస్క్రేబింగ్‌ను వైద్యులు తమ రోగులకు సూచిస్తుంటారు. సంప్రదాయ వైద్య చికిత్సనే కాకుండా దీంతో పాటు సోషల్ లేదా రిక్రెషనల్ యాక్టివిటీని కూడా సూచిస్తారు.
వాలంటరీ యాక్షన్ క్యామ్‌డెన్‌లో సోషల్ ప్రిస్క్రేబింగ్ యాక్టివిటీను అభివృద్ధి చేసిన టర్న్‌బుల్, అన్ని వయసుల వారికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటరితనం కేవలం వృద్ధులకు మాత్రమే కాదని అన్నారు.
క్యామ్‌డెన్ నివాసితులు స్వచ్ఛందంగా, వాకింగ్ గ్రూప్‌లలో చేరడంతో ఎన్నో శక్తివంతమైన ప్రయోజనాలను వారు పొందుతున్నట్లు ఆమె చెప్పారు.
ఈ యాక్టివిటీలు చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు డాక్టర్ సూచనల మేరకు యాంటీడిప్రెసెంట్స్ తీసుకోవడం ఆపివేశారు.
జీవిత కాల స్నేహాలను అందించే దీర్ఘకాలిక ప్రొగ్రామ్స్‌ను వారు బాగా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
‘‘మీ సామాజిక బంధాలను మీరు అభివృద్ధి చేసుకుంటే, ఆరోగ్య సమస్యలను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలరు.’’ అని టర్న్‌బుల్ వివరించారు.
అవును, సోషల్ ప్రిస్క్రేబింగ్ అన్నింటిన్ని నయం చేయదు, అందరికీ ఇది సరసమైనది కాదు.
‘‘జీవన వ్యయాలు కచ్చితంగా ప్రజల్ని వారి సామాజిక బంధాలను ఏర్పరచుకోవడానికి అడ్డంకిగా ఉంటాయి’’ అని టర్న్‌బుల్ అన్నారు.
ట్రాన్స్‌పోర్ట్ పొందడం నుంచి చాయ్ కప్ ధర వరకు ప్రతీది అడ్డంకిగా నిలవచ్చన్నారు.
రోజులో మనకు పరిమిత సమయం మాత్రమే ఉంటుందని, దీనిలో స్నేహం కోసం కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని డెన్‌వోర్త్ అన్నారు.
కానీ ఆ సమయాన్ని ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. తన మానసిక ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత, స్నేహితులు అవసరమని డాక్టర్లు చెప్పినట్లు బెన్నీ షేక్స్ తెలిపారు.
కానీ, స్నేహం ఎలా తన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందో అప్పుడు తనకేం అర్థం కాలేదన్నారు.
‘‘నా పరిస్థితిని, నా మానసిక ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకునేందుకు, సరైన సంరక్షణ పొందేందుకు నాకు 18 ఏళ్లు సమయం పట్టింది. ’’ అని బెన్నీ షేక్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయా?
- భోజనం కావాలంటే దుస్తులు వద్దనుకోవాలి, దుస్తులు కావాలంటే పస్తులుండాలి - ఉప్పు, పసుపు, దువ్వెన కూడా కొనలేని ప్రజలు, ఇండియాలోనే అత్యంత పేద జిల్లా కథ ఇది
- గర్భధారణ సమయంలో గుండె ఆకారం మారుతుందా?
- వయసు పెరిగే కొద్దీ గొంతు ఎందుకు మారుతుంది?
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














