12 వేల ఏళ్ల కిందట పక్షి ఎముకతో పిల్లనగ్రోవి.. ఇందులో దాగిన వేటగాళ్ల రహస్యం ఏమిటి?

ఫొటో సోర్స్, YOLI SHWARTZ, ISRAEL ANTIQUITIES AUTHORITY
ఇజ్రాయెల్‌లో 12 వేల ఏళ్ల నాటి అతి చిన్న పిల్లనగ్రోవులను గుర్తించారు పరిశోధకులు. వాటిని పక్షుల ఎముకలతో తయారుచేసినట్లు కనుగొన్నారు.
వీటిలో కూట్స్, టీల్స్ పక్షుల రెక్కలకు సంబంధించిన ఏడు ఎముకలు ఉన్నాయి. వాటికి రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు.
ఈ పిల్లనగ్రోవిని వాయించినపుడు అది వేటాడే పక్షుల శబ్దాన్ని వినిపిస్తోంది.
నీటి పక్షులను భయపెట్టడానికి ఈ పిల్లనగ్రోవులను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు. పక్షులు భయపడి, గుంపులుగా ఎగిరేటపుడు వాటిని పట్టుకోవడం సులభం అవుతుంది.
ఈ వేణువులను సంగీతం కోసం కూడా తయారుచేసి ఉండవచ్చనే వాదనా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఎముకలనే ఎందుకు ఉపయోగించినట్లు..?
ఈ పిల్లనగ్రోవులను వేటాడేందుకు వాడినట్లయితే, వేటలో ధ్వనిని ఉపయోగించారనేందుకు ఇదే అత్యంత పురాతన ఆధారం అవుతుందని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ(ఐఏఏ)కు చెందిన డాక్టర్ హమౌదీ ఖలైలీ అన్నారు.
ఉత్తర ఇజ్రాయెల్‌లోనిహులేహ్ లోయలోని ఐనాన్/ఐన్ మల్లాహా ప్రాంతంలో ఈ ఎముకలను కనుగొన్నారు. లక్షల కొద్దీ పక్షులు వలసల సమయంలో యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇలాంటి చిత్తడి నేలల్లో ప్రయాణిస్తాయి.
ఐనాన్/ఐన్ మల్లాహా అనేది లెవాంట్ ప్రాంతంలోని నటుఫియన్ కాలం నాటి వేటగాళ్ల కమ్యూనిటీల స్థిరనివాస ప్రదేశం.
నీటి పక్షులను పట్టుకునేందుకు వేటగాళ్లు ముఖ్యంగా యురేషియన్ స్పారోహాక్, కామన్ కెస్ట్రెల్ వంటి పక్షుల పిలుపును అనుకరించడానికి ఈ వేణువులను ఉపయోగించి ఉండొచ్చని నేచర్ సైన్స్ రిపోర్ట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదికలోని ఒక సిద్ధాంతం ద్వారా తెలుస్తోంది.
మాంసాహారులు కనిపించినప్పుడు నీటిలో ఉండే పక్షులు ఒక్కసారిగా వేర్వేరు దిశల్లో ఎగురుతాయి. దీంతో వేటగాళ్లకు వాటిని పట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది.
కనుగొన్న పిల్లనగ్రోవుల్లో ఒకటి పూర్తిరూపంలో ఉందని జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లారెంట్ డేవిన్, డాక్టర్ ఖలైలీ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో మునిగిపోయిన క్షణాలు
- గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














