నడి సముద్రంలో రెండు నెలలు ఆస్ట్రేలియా నావికుడి జీవన్మరణ పోరాటం.. ఆయన ఏం తిని బతికారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జరొస్లావ్ లుకివ్
- హోదా, బీబీసీ న్యూస్
పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతో కలిసి తప్పిపోయిన ఆస్ట్రేలియా నావికుడు రెండు నెలలు జీవన్మరణ పోరాటం సాగించారు.
రెండు నెలలుగా పచ్చి చేపలతో పాటు వర్షపు నీటిని తాగుతూ కాలం వెళ్లదీసిన ఆ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ చెప్పారు.
సిడ్నీలో ఉండే 51 ఏళ్ల టిమ్ షాడాక్, తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి బోటులో మెక్సికో నుంచి ఫ్రెంచ్ పాలినిసీయా ద్వీపానికి ఏప్రిల్‌లో బయల్దేరారు.
ప్రయాణం మొదలైన కొన్ని వారాల తర్వాత తుపానుల కారణంగా వారి బోటు దెబ్బతింది.
సముద్రంలో ఉన్న వీరిని ఒక హెలికాప్టర్ గుర్తించడంతో చేపల వేటకు ఉపయోగించే ‘ట్యూనా’ అనే ఓడ సహాయంతో ఈ వారంలో వారిని కాపాడారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది’’ అని ఆస్ట్రేలియాకు చెందిన వార్తా సంస్థ ‘9 న్యూస్’తో ట్యూనాలో ఉన్న డాక్టర్ చెప్పారు.
మెక్సికోలోని లా పెజ్ నుంచి 6,000 కి.మీ ప్రయాణాన్ని షాడాక్ ప్రారంభించారు.
సముద్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన బోటులోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ చెడిపోయింది. దీంతో ఉత్తర పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతోపాటు ఆయన చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, 9 NEWS
ప్రాణాలు నిలబెట్టిన చేపల గాలం
చివరకు, రెండు నెలల తర్వాత మెక్సికో తీరంలో వారిని గుర్తించినప్పుడు టిమ్ షాడాక్ బలహీనంగా, బాగా పెరిగిన గడ్డంతో కనిపించారు.
‘‘నేను సముద్రంలో చాలా కఠిన పరీక్షను ఎదుర్కొన్నా. ఒంటరిగా సముద్రంలో చాలా రోజులు గడిపాను. నాకు ఇప్పుడు కేవలం మంచి ఆహారం, బాగా విశ్రాంతి అవసరం. అంతే తప్ప నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా’’ అని 9 న్యూస్‌తో ఆయన చెప్పారు.
చేపల గాలమే తనను ఇంత కాలం ప్రాణాలతో కాపాడిందని షాడాక్ తెలిపారు.
బోటుకు ఉన్న కనోపి సహాయంతో వడదెబ్బ నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు.
సముద్రంలో నుంచి కాపాడిన వెంటనే షాడాక్ నవ్వుతూ, చేతికి బీపీని కొలిచే మిషన్‌తో కనిపించారు.
ఇప్పుడు ఆయన కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోగలుగుతున్నారు కూడా.
ట్యూనా ఓడ ఇప్పుడు మెక్సికో తిరిగి బయల్దేరింది. అందులోనే షాడాక్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే చికిత్స అందించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్‌లోకి
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- హైటెక్ బెగ్గింగ్: ఆన్లైన్లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?
- BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














