ఇక విదేశీయులు బాలిలో అడుగు పెట్టాలంటే ఈ పన్ను కట్టాల్సిందే

బాలిలో ఓ పర్యాటకురాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నికోలస్ యోంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన బాలిలో ప్రవేశించాలంటే విదేశీ పర్యాటకులు ఇక నుంచి రూ.797 (150,000 ఇండోనేషియన్ రుపియా) ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలనిఇండోనేషియా నిర్ణయం తీసుకుంది.

నిరుడు తొలిసారిగా ప్రకటించిన ఈ పన్ను 2024 ఫిబ్రవరి 14న అమల్లోకి వచ్చింది.

ఈ పన్ను నుంచి ఇండోనేషియా ప్రజలకు మినహాయింపు ఉంటుంది.

బాలిలోకి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులు 'లవ్ బాలి' వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు.

బాలిలో పర్యావరణం, సంస్కృతిని రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

బాలి సహజమైన బీచ్‌లు, సర్ఫింగ్ అలలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.

2023లో జనవరి, నవంబర్ మధ్య దాదాపు 48 లక్షల మంది పర్యాటకులు బాలిని సందర్శించినట్లు అధికారిక సమాచారం.

బాలి

ఫొటో సోర్స్, EPA

కరోనాకు ముందు పర్యాటకం వాటా 60%

కరోనావైరస్ మహమ్మారికి ముందు బాలి వార్షిక జీడీపీలో పర్యాటకం వాటా 60 శాతం ఉండేది.

ప్రావిన్స్ స్టాటిస్టిక్స్ బ్యూరో ప్రకారం 2023 నవంబరులో బాలికి ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా లక్ష మందికి పైగా పర్యాటకులు వచ్చారు. దీని తర్వాత ఇండియా, చైనా, సింగపూర్ నుంచి పర్యాటకులు వచ్చారు.

ఇటీవలి కాలంలో బాలికి వచ్చిన పర్యాటకులు కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇండోనేషియా

ఫొటో సోర్స్, Getty Images

2021లో పవిత్ర మౌంట్ బాటూర్‌లో ఒక రష్యన్ జంట సెక్స్‌లో పాల్గొంటున్న మూడు నిమిషాల వీడియో బయటికి కావడం కలకలం రేగింది.

2023 మార్చిలో హిందువుల దేవతలకు నిలయంగా భావించే అగుంగ్ పర్వతంపై ఒక రష్యన్ బట్టలు విప్పాడు. దీంతో ఆ వ్యక్తిని బాలి నుంచి బహిష్కరించారు.

అదే నెలలో ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో విదేశీ పర్యాటకులు మోటార్‌బైక్‌లను ఉపయోగించకుండా నిషేధించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అగుంగ్ పర్వతం బాలి ప్రజలకు పవిత్రమైనది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)