ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
'ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు' అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో స్పందించినందుకు బీజేపీకి రాహుల్ ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఒడిశాలో గురువారం జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘పీఎం మోదీని గుజరాత్‌లోని ఓబీసీగా బీజేపీ ప్రభుత్వం తయారు చేసింది’ అని ఆరోపించారు.
అయితే, రాహుల్ గాంధీ వాదన పచ్చి అబద్ధమంటూ బీజేపీ బదులిచ్చింది.
మోదీ కులాన్ని 1999 అక్టోబర్ 27న గుజరాత్ ప్రభుత్వం ఓబీసీలో చేర్చిందని, ఇది ఆయన ముఖ్యమంత్రి కావడానికి రెండేళ్ల ముందుగానే జరిగిందని తెలిపింది.
అసలేం జరిగింది?
‘‘నరేంద్ర మోదీని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీగా మార్చేసింది. మోదీ వెనుకబడిన ప్రజల హక్కులు, వాటాలకు న్యాయం చేయరు. ఆయన కులాల లెక్కింపు చేయరు" అని రాహుల్ ఒడిశాలో జరిగిన ఒక ర్యాలీలో ఆరోపించారు.
అయితే, రాహుల్ గాంధీ వాదన 'పచ్చి అబద్ధం' అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తెలిపారు.
భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌ను ఆయన ఎక్స్(ట్విటర్)లో విడుదల చేశారు. 1999 అక్టోబర్ 27న నరేంద్ర మోదీకి చెందిన కులాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లో చేరుస్తూ గెజిట్ విడుదల చేశారని అమిత్ తెలిపారు.
అంతేకాదు రాహుల్ గాంధీ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ వరకు మొత్తం నెహ్రూ-గాంధీ కుటుంబం ఓబీసీలకు వ్యతిరేకమని అమిత్ మాల్వియా ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
1999లో విడుదలైనట్లుగా చెబుతున్న ఆ గెజిట్ నోటిఫికేషన్ పరిశీలిస్తే గుజరాత్‌లోని 'మోద్ ఘంచి', 'ఘంచీ (ముస్లిం)', 'తెలి, 'మాలి' కమ్యూనిటీలను ఇతర వెనుకబడిన తరగతులలో చేరుస్తున్నట్లు రాసి ఉంది.
ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ ఉన్నారు. రెండేళ్ల అనంతరం అంటే 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు.

ఫొటో సోర్స్, ANI
జనరల్ కేటగిరీలో పుట్టారు: రాహుల్
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా గురువారం ఒడిశాలో పర్యటించారు.
అక్కడ జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ, ''మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ 'నేనే ఒక ఓబీసీని, మరి ఓబీసీ వర్గానికి భాగస్వామ్యం అవసరమా' అని అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ఓబీసీగా పుట్టలేదని మీకు చెప్పాలనుకుంటున్నా. ఇది నిజం వినండి, మీరంతా భయంకరంగా మోసపోతున్నారు. నరేంద్ర మోదీ ఓబీసీగా పుట్టలేదు. ఆయన గుజరాత్‌లో తెలి కుల వ్యక్తిగా జన్మించారు. మోదీ వర్గాన్ని బీజేపీ 2000 సంవత్సరంలో ఓబీసీగా మార్చింది. మీ ప్రధాని ఓబీసీగా పుట్టలేదు. మీ ప్రధానమంత్రి ఈ దేశంలో జనరల్ కేటగిరీలోనే పుట్టారు. ప్రధాని దేశం మొత్తానికి అబద్ధం చెబుతున్నారు" అని అన్నారు.
‘‘మీ ప్రధాని ఓబీసీగా పుట్టలేదని నాకెలా తెలుసంటారా?, ఆయన ఏ ఓబీసీని కౌగిలించుకోరు, ఏ రైతు లేదా కార్మికుడి చేయి పట్టుకోరు, ఆయన (మోదీ) అదానీ చేయి మాత్రమే పట్టుకుంటారు" అని రాహుల్ ఆరోపించారు.
కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్ వెల్లడిస్తూ " ప్రధాని దేశం మొత్తానికి అబద్దాలు చెబుతున్నారు, అందుకే ఆయన తన జీవితాంతం కుల గణన చేయరు, ఆయనొక జనరల్ కేటగిరీ వ్యక్తి. ఈ ఓబీసీ కుల గణన మోదీ ఎప్పటికీ జరగనివ్వరు. కుల గణనను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తారు, రాసి పెట్టుకోండి'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు: బీజేపీ
రాహుల్ గాంధీ ప్రకటనపై గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పందిస్తూ 1994న జూలై 25 'మోద్', 'గంజి' వర్గాలను ఓబీసీల్లో చేర్చారని తెలిపారు.
ఆ సమయంలో గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదని, నరేంద్ర మోదీ ప్రధానిగా లేదా ముఖ్యమంత్రిగా లేరని చెప్పారు.
"రాహుల్ గాంధీ ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన గుజరాత్‌లోని ఓబీసీలందరికీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నారు'' అని నరహరి వార్తాసంస్థ ఏఎన్ఐతో అన్నారు. వాళ్లు ప్రధాని మోదీ అంత ఎత్తుకు ఎన్నడూ ఎదగలేరని నరహరి విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కులం విషయంలో రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ ఆరోపించారు.
పీటీఐ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పీఎం మోదీకి చెందిన తెలి కమ్యూనిటీకి ఓబీసీ హోదా ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?
- కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు?
- ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ
- రొమ్ము క్యాన్సర్: బ్రాలో పెట్టుకొనే ఈ సరికొత్త పరికరం వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుంది
- 10 క్యాన్సర్ లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














