ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?

ఆదిపురుష్

ఫొటో సోర్స్, Instagram/Prabhas

    • రచయిత, పెదగాడి రాజేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘జీవితంలో మొదటిసారి ‘రావణుడి’ని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. ఇది వీఎఫ్‌ఎక్స్‌ను అపహాస్యం చేయడమే. వీఎఫ్ఎక్స్ ప్రొడక్షన్‌లో భారత్ మేజర్ హబ్ అవుతోంది. కానీ, ఇక్కడ చూడండి. క్రియేటివిటీ పేరుతో ఇలాంటివి మనపై వదులుతున్నారు’’ అని సృష్టి అనే యువతి తాజాగా ట్వీట్ చేశారు.

ప్రభాస్, కృతీ సనన్, సైఫ్‌ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ఆమె మాట్లాడుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు కూడా దీనిలోని రావణుడి పాత్రపై చాలా వివాదాలు రాజుకున్నాయి.

ముస్లిం పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీలా రావణుడు కనిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) కూడా ఆశించినట్లుగాలేవని నెటిజన్లు అప్పట్లో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది 2022 అక్టోబరులో జరిగింది.

వాస్తవానికి జనవరి 2023లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. వివాదాలు, నెగిటివ్ ఫీడ్‌ బ్యాక్ నడుమ దీన్ని వాయిదా వేశారు. ఎట్టకేలకు సినిమా జూన్ 16న విడుదలైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఆదిపురుష్

ఫొటో సోర్స్, Instagram/Prabhas

మెరుగులు దిద్దడం అంటే ఇదేనా?

ఈ మధ్యలో ఏం జరిగిందో ఏప్రిల్ 2023లో పీటీఐ వార్తా సంస్థతో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడారు. ‘‘ఈ ఐదారు నెలలు అదనంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయాన్ని మేం విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలకు ఇచ్చాం. ఫలితంగా వారు తమ పనిని మరింత మెరుగ్గా చేయగలిగారు’’అని ఆయన చెప్పారు.

‘‘సవాళ్లు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అయితే, అవే సినిమాను మరింత మెరుగ్గా చేస్తాయి. హాలీవుడ్‌లోని మార్వెల్స్, డీసీ సిరీస్‌లు, అవతార్ లాంటి సినిమాల్లో వాడిన టెక్నాలజీని భారత్‌లో తొలిసారి ఉపయోగిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా సినిమాకు మెరుగులు దిద్దామని, ఇప్పుడు ఫైనల్ ప్రోడక్టును చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని విడుదలకు ముందు నిర్మాత భూషణ్ కుమార్ కూడా అన్నారు.

అదనపు సమయం తీసుకొని మరీ దిద్దిన మెరుగులపై ప్రేక్షకులు ఏం అంటున్నారు?

ఆదిపురుష్

ఫొటో సోర్స్, T-SERIES

విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి?

సినిమాలో పాత్రలు, వారి వేషధారణల సంగతి పక్కన పెడితే, ‘‘విజువల్ ఎఫెక్ట్స్’’ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఆదిపురుష్‌తో పోలిస్తే దీని కంటే కాస్త తక్కువ బడ్జెట్‌తో తీసిన బ్రహ్మాస్త్ర, ఈగ, రా.వన్, బాహుబలి లాంటి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ మెరుగ్గా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మరికొందరైతే ‘‘చోటా భీమ్’’ లాంటి కార్టూన్ సీరియల్స్‌లో వీఎఫ్‌ఎక్స్ ఆదిపురుష్ కంటే మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

రావణుడి వాహనంగా కనిపించే భారీ వీఎఫ్ఎక్స్ గబ్బిలం, అడవిలోని వీఎఫ్ఎక్స్ కోతులు లాంటి కొన్ని దృశ్యాలు మరీ కార్టూన్లలా కనిపిస్తున్నట్లు సినీ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

అసలు ఆదిపురుష్ ప్రపంచాన్ని సృష్టించేందుకు మోషన్ క్యాప్చర్, కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజరీ (సీజీఐ) టెక్నాలజీలను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. అసలేమిటీ టెక్నాలజీలు?

ఆదిపురుష్

ఫొటో సోర్స్, Instagram/Prabhas

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే?

మోషన్ క్యాప్చర్‌ టెక్నాలజీనే ‘‘మో-క్యాప్’’ అని కూడా పిలుస్తారు. మనుషులు, వస్తువుల కదలికలను ఇది రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్‌కు బదిలీ చేస్తారు. ఇదే కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజరీ (సీజీఐ) క్యారెక్టర్‌గా మారుతుంది.

నటుల ముఖ కవళికలు, శరీర కదలికలను మెరుగ్గా మో-క్యాప్ రికార్డు చేయగలదు. దీంతో కంప్యూటర్‌లో రూపొందించే 3డీ క్యారెక్టర్లకు మెరుగ్గా ఫీడ్ అందుతుంది. ఫలితంగా 3డీ క్యారెక్టర్లు ఇంచుమించు వాస్తవ ప్రపంచంలోని క్యారెక్టర్లలా కనిపిస్తాయి.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో నటులు మో-క్యాప్ సూట్ వేసుకుంటారు. శరీర కదలికలను ఆ సూట్ క్యాప్చర్ చేస్తుంది. మరోవైపు ముఖానికి ఎదురుగా ఒక హెడ్-మౌంటెడ్ కెమెరాను కూడా పెడతారు. ముఖంలోని హావ భావాలను ఇది క్యాప్చర్ చేస్తుంది.

అవతార్

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS

అవతార్‌తో ప్రజల్లోకి..

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని మొదటిసారి ఎవరు ఉపయోగించారనే ప్రశ్నకు మీకు ఆన్‌లైన్‌లో చాలా సమాధానాలు వస్తాయి.

కానీ, ఈ టెక్నాలజీ ప్రజల్లోకి తీసుకెళ్లింది మాత్రం జేమ్స్ కామెరాన్ ‘‘అవతార్’’ సినిమాగా చెప్పుకోవాలి.

అవెంజర్స్ సినిమాలోని థానోస్, హాబిట్‌లోని స్మగ్ లాంటి క్యారెక్టర్లకు ప్రాణం పోసింది ఈ టెక్నాలజీనే.

రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘‘కొచ్చాడయాన్’’ కూడా ఈ టెక్నాలజీతోనే తీశారు. భారత్‌లోని తొలి ఫొటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ సినిమా అదే.

అవతార్

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS

కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ అంటే?

సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే సీజీఐ అంటే సినిమాలోని క్యారెక్టర్లు లేదా దృశ్యాలను కంప్యూటర్ల సాయంతో రూపొందించడం.

వాస్తవంలోలేని లేదా కల్పిత దృశ్యాలను సృష్టించేందుకు, కొన్నిసార్లు ఇదివరకు తీసిన చిత్రాలు, వీడియోల్లో కొత్త అంశాలను చేర్చేందుకు సీజీఐ ఉపయోగిస్తారు.

ఫొటోలతోపాటు 2డీ, 3డీ దృశ్యాలను రూపొందించేందుకు కూడా సీజీఐ ఉపయోగపడుతుంది. కొన్ని దృశ్యాలను రూపొందించడం నుంచి ఆ సీన్ మొత్తం వరకూ సీజీఐతో సిద్ధంచేయొచ్చు.

సైన్స్ ఫిక్షన్ సినిమాలతో మొదలుపెట్టి సాధారణ సినిమాల వరకూ చుట్టుపక్కల వాతావరణానికి మెరుగులు దిద్దడానికి సీజీఐను ఉపయోగిస్తున్నారు.

రాజమౌళి సినిమా ఈగ, బాహుబలి 1-2, శంకర్ రోబో లాంటి సినిమాల్లో సీజీఐ దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలపై ప్రశంసలు కురిశాయి.

వీడియో క్యాప్షన్, Adipurush Controversy : నేపాల్‌లోని రెండు నగరాల్లో హిందీ సినిమాలపై నిషేధం, వివాదం ఏంటంటే..

వీఎఫ్‌ఎక్స్ సరిగ్గా రాలేదా?

ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్‌పై సినీ విమర్శకుడు సాహితి స్పందిస్తూ.. కొన్నిసీన్లు 3డీలో సరిగ్గా రాలేదని, మరికొన్ని 2డీలో సరిగ్గా రాలేదని చెప్పారు.

‘‘ఇక్కడ సినిమా మొత్తం ఒకే స్టూడియోకు ఇవ్వరు. దాని ప్రాబ్లం మొత్తంగా కనిపిస్తుంది. ఉదాహరణకు సినిమా ప్రారంభంలో దెయ్యాలతో ప్రభాస్ పోరాడే దృశ్యాలు 3డీలో సరిగ్గా రాలేదు. బహుశా ఆ సీన్లు అప్పగించిన స్టూడియో సరిగ్గా ఇవ్వకపోవచ్చు. దీన్ని మళ్లీ వేరే స్టూడియోకు ఇచ్చేంత సమయం ఉండకపోవచ్చు. అన్నింటికంటే ఇక్కడ సమయమే ముఖ్యం. చాలా వరకు స్టూడియోలు సమయానికి సీన్లు ఇవ్వవు. పైగా స్డూడియోలు కొన్ని విదేశాల్లో ఉంటాయి. వీటితో సమన్వయం చేసుకోవడం కష్టం’’ అని ఆయన అన్నారు.

మొత్తంగా ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ‘‘యావరేజ్’’గా ఉన్నాయని తెలిపారు.

మరో సినీ విమర్శకుడు కె.శరత్ మాట్లాడుతూ, ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగాలేవని అన్నారు.

‘‘ఫైటింగ్ సీన్లు కొన్ని నవ్వొచ్చేలా ఉన్నాయి. రావణుడి పాత్రతోపాటు అతడి చుట్టుపక్కల వారి లుక్స్ కూడా అల్ట్రా మోడర్న్‌గా కనిపించాయి. మొత్తంగా కార్టూన్ సినిమా చూసినట్లు అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

అయితే, వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో ఈ సినిమా రూ.340 కోట్లను వసూలు చేసిందని సినిమా నిర్మాతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)