లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
రాబోయే కాలంలో ఈ విమానాలు సంస్థ చేతికి వస్తే, ఇండిగో దగ్గర ఉన్న విమానాల సంఖ్య దాదాపు వెయ్యికి చేరుకుంటుందని ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండియో 500 కొత్త ఎయిర్‌బస్- 320 రకం విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తమ సంస్థ చరిత్రలోనే అతి పెద్ద డీల్ అని ఆయన వెల్లడించారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఎయిర్ షో 2023 సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇండిగో బోర్డ్ చైర్మన్ వి. సుమంత్రణ్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్ బస్ సీఈవో గ్విలామే ఫారీ, ఎయిర్ బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ షేరర్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆ సంస్థ ప్రకటనలో తెలిపారు.
2030 నుంచి 2035 మధ్యలో ఈ విమానాల డెలివరీ ఉంటుందని, ఇది తమ సంస్థ చరిత్రలోనే కాక, విమానయాన చరిత్రలోనే లార్జెస్ట్ సింగిల్ ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేజ్ అని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
రాబోయే కాలంలో ఈ విమానాలు సంస్థ చేతికి వస్తే, ఇండిగో దగ్గర ఉన్న విమానాల సంఖ్య దాదాపు వెయ్యికి చేరుకుంటుందని ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, KUMAR HARSH
గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం తమకు చాలా గర్వకారణమని గీతా ప్రెస్ చెప్పింది. కానీ, తమ ప్రచురణ సంస్థ కోటి రూపాయల నగదు బహుమతిని మాత్రం తీసుకోదని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో గాంధీ శాంతి పురస్కారం 2021కి గీతా ప్రెస్‌ను ఎంపిక చేశారు.
ఈ అవార్డును తీసుకోవాలని గీతా ప్రెస్ ట్రస్టీల బోర్డు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారని, కానీ కోటి రూపాయల నగదును మాత్రం తీసుకోకూడదని అనుకున్నారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
‘‘గాంధీ శాంతి పురస్కారానికి మమ్మల్ని ఎంపిక చేయడంపై కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రికి మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి రూపంలో విరాళాలను సేకరించకూడదన్నది మా సిద్ధాంతం. ట్రస్టీల బోర్డు అవార్డును మాత్రమే స్వీకరించాలని నిర్ణయించింది. అవార్డుతో పాటు వచ్చే నగదు బహుమతిని మేం తీసుకోం.’’ అని గీతా ప్రెస్ మేనేజర్ లల్మాని త్రిపాఠి చెప్పారు.
1923 ఏప్రిల్ 29న గీతా ప్రెస్‌ను ఏర్పాటు చేసినట్లు త్రిపాఠి తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రచురణ సంస్థ నుంచి 93 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం ఆంటోనీ బ్లింకెన్ చైనా వెళ్లారు.
గత ఐదేళ్లలో చైనా పర్యటనకు వెళ్లిన తొలి అమెరికా నేత ఈయనే.
బ్లింకెన్, జిన్‌పింగ్ సమావేశం ఈ పర్యటన షెడ్యూల్‌లో లేదు. కానీ, ఆ తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంపై చైనా అధికారిక మీడియా లైవ్ రిపోర్టింగ్ అందిస్తోంది.
చైనా రాజధాని బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో ఈ సమావేశం జరుగుతోంది.
బ్లింకెన్ అంతకుముందు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో, విదేశాంగ శాఖలోని ఉన్నతాధికారి వాంగ్ యీతో భేటీ అయ్యారు.
వాంగ్ యీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కేంద్ర విదేశీ వ్యవహారాల కమిషన్‌కి అధినేతగా ఉన్నారు.
చైనా, అమెరికాల మధ్య సుదీర్ఘ కాలంగా అంత మంచి సంబంధాలు లేవు.
చాలా విషయాలపై ఇరు దేశాల మధ్య సమస్యలున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి ప్రస్తుత పర్యటన ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, FILM POSTER
ఆదిపురుష్ సినిమాను మాత్రమే కాకుండా, అన్ని బాలీవుడ్ సినిమాలను కాఠ్‌మాండూ నగరంలో నిషేధిస్తున్నట్లు నగర మేయర్ బాలేంద్ర షా ప్రకటించారు. ఆది పురుష్ సినిమాలో సీతను భారత పుత్రికగా పేర్కొనడంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ అభ్యంతరకర డైలాగ్‌లను మూడు రోజుల్లోగా తొలగించాలని, లేదంటే సినిమాను నిషేధిస్తామని కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా ఇటీవల హెచ్చరించారు. తాజాగా అన్ని బాలీవుడ్ సినిమాలను రాజధాని నగరంలో నిషేధిస్తున్నట్లు షా ప్రకటించారు.
మరో నగరం పొఖరాలో కూడా ఆదిపురుష్ సినిమాను నిషేధిస్తునట్లు ఆ నగర మేయర్ ధన్‌రాజ్ ఆచార్య ప్రకటించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. జనకుడి పుత్రిక అయిన సీతను, భారతీయ మహిళగా పేర్కొనడంపై ధన్‌రాజ్ ఆచార్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి నేపాల్‌లో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో డైలాగులపై పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయితే, ఈ డైలాగులను ఉద్దేశపూర్వకంగా రాయలేదని, ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ వీటిని త్వరలోనే తొలగిస్తామని ఈ సినిమా సహ రచయిత అయిన మనోజ్ ముంతషీర్ శుక్లా అన్నారు. అయితే, ఈ డైలాగులు భారతీయుల అభ్యంతరాలకు సంబంధించినవా, లేక నేపాల్ ప్రజలకు సంబంధించినవా అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి 23 మధ్య అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఈజిప్టుకు వెళ్తారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానంపై నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు.
‘‘రెండు దేశాల మధ్య సంబంధాల్లో దీన్నొక మైలురాయిగా చెప్పుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పర్యటన’’అని వినయ్ చెప్పారు.
‘‘జూన్ 21 ఉదయం మోదీ న్యూయార్క్‌కు చేరుకుంటారు. అక్కడి ఐరాస ప్రధాన కార్యాలయంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాలుంపచుకుంటారు’’ అని వినయ్ అన్నారు.
న్యూయార్క్‌లో ప్రముఖ నాయకులతో చర్చల అనంతరం మోదీ వాషింగ్టన్‌కు వెళ్తారు.
జూన్ 22న వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ ఆహ్వానం పలుకుతారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోపాటు కొన్ని ప్రముఖ సంస్థ సీఈవోలతోనూ మోదీ భేటీ అవుతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్లబోనని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తాజాగా స్పందించారు.
‘‘నేను కావాలంటే జైలుకైనా వెళ్తాను. పాకిస్తాన్‌ను నియంతల నుంచి విడిపించేందుకు చివరి వరకూ పోరాడతాను’’ అని ఆయన అన్నారు.
‘‘మే 9న మా పార్టీ వర్కర్ల బృందంలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి సైనిక సదుపాయాలపై దాడి చేశారు. కమాండర్ల ఇళ్లలోకి వారు ప్రవేశిస్తున్నప్పుడు అసలు పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్‌లో భారీగా నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. నిరసనల్లో భాగంగా కొందరు సైనిక సదుపాయాలపైనా దాడిచేశారు. అయితే, సైనిక సదుపాయాలపై ఆ దాడులను పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.