ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
'గాంధీ శాంతి బహుమతి' ఎంపిక కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్

ఫొటో సోర్స్, ANI
భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఇండోనేషియా ఓపెన్-2023 టైటిల్ గెలిచినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆదివారం ఇండోనేషియాలో పురుషుల డబుల్స్ ఫైనల్స్ జరిగింది. సాత్విక్, చిరాగ్ జోడీ ఫైనల్లో వరుసగా 21-17, 21-18 తో మలేషియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ జోడీ అరోన్ చియా, సో వూయ్ యిక్‌లను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2021 ఏడాదికి గానూ గాంధీ శాంతి బహుమతిని గీతా ప్రెస్‌కి ప్రకటించింది.
అహింసా, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు దాని సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆదివారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
గీతా ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1923లో ఈ ప్రెస్ ప్రారంభించారు.
ఈ సంస్థ 14 భాషల్లో దాదాపు 41.3 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. 'గాంధీ శాంతి బహుమతి' ఎంపిక కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
ఈ బహుమతి కింద రూ. కోటి నగదు, ఒక అనులేఖనం, ఒక ఫలకం, ఒక సంప్రదాయ హస్తకళా వస్తువును అందించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
నేతాజీ కనుక బతికుంటే దేశ విభజన జరిగేది కాదని నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ డోభాల్ అన్నారు.
దిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెమోరియల్‌లో ఆయన మాట్లాడారు.
‘‘సుభాష్ చంద్ర బోస్ కనుక అప్పుడు ఉండుంటే, భారత్ విభజన జరిగేది కాదు. నేను ఒకే ఒక్క నేతను అంగీకరిస్తా, ఆయనే సుభాష్ చంద్ర బోస్ అని జిన్నా చెప్పారు’’ అని అజిత్ డోభాల్ తెలిపారు. జిన్నా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.
‘‘బ్రిటీష్ వారిపై పోరాడాలనే ఆలోచన నేతాజీ మనసులోకి వచ్చింది. నేను స్వాతంత్య్రం కోసం అడుక్కోను. ఇది నా హక్కు, నేను పొందుతాను అనుకునేవారు’’ అని డోభాల్ చెప్పారు.
అజిత్ డోభాల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రుద్రాన్ష్ ముఖర్జీ ‘పారలల్ లైవ్స్’ పుస్తకాన్ని తాను పంపుతున్నట్లు, వారు అసలు చరిత్రేంటో కొంత తెలుసుకోవాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
‘‘అజిత్ డోభాల్ ఒక విషయం చెప్పలేదు. నేతాజీ పెద్ద అన్న శరత్ చంద్ర బోస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ బెంగాల్ విభజనను సమర్థించిన వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ’’ అని జైరాం రమేశ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఉత్తర ప్రదేశ్ బలియాలో ఎండ తీవ్రతకు గత మూడు రోజుల్లో 54 మంది మరణించారు. 400 మందికి పైగా జిల్లా ఆస్పత్రిలో చేరారు.
బలియా జిల్లా ఆస్పత్రికి చెందిన వైద్యాధికారి డాక్టర్ ఎస్‌కే యాదవ్ ఈ సమాచారం అందించారు.
జూన్ 15 నుంచి 17 మధ్యలో జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రోగులు ఆస్పత్రిలో చేరడం పెరిగిందన్నారు.
జూన్ 15వ తేదీ 23 మంది, జూన్ 16వ తేదీ 20 మంది, జూన్ 17న 11 మంది మరణించారని డాక్టర్ చెప్పారు.
జిల్లాలో మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో లక్నో వైద్యుల బృందం సాయం కోరినట్లు అజంఘడ్ డివిజన్‌కు చెందిన అడిషినల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బీపీ తివారి తెలిపారు.
లక్నో వైద్యుల బృందం వచ్చి ఈ మరణాల వెనకున్న కారణాన్ని గుర్తించనుందని, ఎందుకు అకస్మాత్తుగా ప్రజలు చనిపోతున్నారని కనుగొననుందని చెప్పారు.
అంతేకాక, జిల్లా ఆస్పత్రికి పేషెంట్ల రాక పెరిగిందన్నారు.
అనారోగ్యం బారిన పడిన వారిని ప్రజలు తమ భుజాలపై ఎత్తుకుని ఎమర్జెన్సీ వార్డులకు తీసుకొస్తున్నారని అన్నారు.
ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు సరిపోవడం లేదని చెప్పారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.