సూడాన్: సైన్యం జరిపిన వైమానిక దాడిలో 5 గురు చిన్నారులు సహా 17 మంది మృతి
ఈ దాడిలో మరో 11 మంది గాయపడ్డారని, వారిని బషీర్ ఆసుపత్రిలో చేర్చినట్లు సూడాన్ వార్తాసంస్థ డార్ఫుర్ 24 తెలిపింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
బాపట్ల: ‘అబ్బాయి శరీరమంతా కాలిపోయింది, కాపాడన్నా కాపాడన్నా అంటూ వచ్చాడు’
హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
సూడాన్: సైన్యం జరిపిన వైమానిక దాడిలో 5 గురు చిన్నారులు సహా 17 మంది మృతి

ఫొటో సోర్స్, REUTERS
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో జరిగిన వైమానిక దాడిలో 5 గురు చిన్నారులు సహా 17 మంది పౌరులు మరణించారు. ఈ దాడిని సైన్యం చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో మరో 11 మంది గాయపడ్డారని, వారిని బషీర్ ఆసుపత్రిలో చేర్చినట్లు సూడాన్ వార్తాసంస్థ డార్ఫుర్ 24 తెలిపింది.
పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)పై సైన్యం దాడులను తీవ్రతరం చేస్తుందని ఆర్మీ జనరల్ యాసిర్ అబ్దుల్ రెహమాన్ హసన్ అల్-అటా చెప్పిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏప్రిల్ 15 నుంచి సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య పోరాటం జరుగుతోంది.
మణిపుర్‌లో హింసను మోదీ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోంది?
మహారాష్ట్ర: రూ.3 లక్షల కోట్ల విలువైన భారీ ఆయిల్ కంపెనీని ఇక్కడి ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
తెలంగాణ పోలీసుల ‘రహస్య’ కేసు: ఐపీఎస్‌లకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ పై తీవ్రవాదం కేసు ఏమిటీ, ఎందుకు వెనక్కు తగ్గారు?
బాపట్ల టెన్త్ విద్యార్థి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు, ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి?
యుగాండాలో స్కూల్‌పై దాడి చేసిన తిరుగుబాటుదారులు.. 25 మందికిపైగా మృతి

యుగాండాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్న తిరుగుబాటుదారులు ఓ స్కూల్ వద్ద దాడి చేశారు. ఈ దాడిలో 25 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కేంద్రంగా పనిచేసే అల్లీడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్‌గా పిలిచే ఈ గ్రూప్ శుక్రవారం పశ్చిమ యుగాండాలోని ఎంపాడ్వెలో ఉన్న లూబిరా సెకండరీ స్కూల్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు.
దాడి అనంతరం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని విరూంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయిన తిరుగుబాటుదారుల కోసం యుగాండా సైనికులు వెతుకుతున్నారు.
‘దాడికి గురైన స్కూల్ నుంచి ఇప్పటి వరకు 25 మృతదేహాలు బయటకు తీశాం’ యుగాండా జాతీయ పోలీస్ అధికార ప్రతినిధి ఫ్రెడ్ ఎనాంగా శనివారం ప్రకటించారు.
స్కూల్ వద్ద ఉన్న ఒక డార్మిటరీని తగలబెట్టారని, ఫుడ్ స్టోర్‌ను లూటీ చేశారని ఆయన చెప్పారు.
తిరుగుబాటుదారులు అక్కడ బాంబులు కూడా పేల్చారని.. మృతుల సంఖ్య 40 వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
చాలామంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు. కొందరు స్థానికులను కూడా తిరుగుబాటుదారులు అపహరించినట్లు చెప్తున్నారు. అపహరణకు గురైన వారిని కాపాడేందుకు సైన్యం వెళ్లిందని రక్షణ శాఖ అధికారప్రతినిధి ఫెలిక్స్ చెప్పారు.
దాడికి గురైన స్కూల్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది.
మోదీ అమెరికా పర్యటన: జూన్ 20 నుంచి 25 వరకు యూఎస్, ఈజిప్ట్‌లలో పర్యటించనున్న ప్రధాని

ఫొటో సోర్స్, ANI
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్ట్‌లలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా టూర్ షెడ్యూల్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
జూన్ 21: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు. 2014లో ఐరాస సర్వసభ్య సమావేశంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినప్పటి నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
జూన్ 22: మోదీ వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. వైట్‌హౌస్‌లో ఆయనకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారు. అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం బైడెన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
జూన్ 23: మధ్యాహ్నం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇచ్చే విందుకు హాజరవుతారు. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంథోనీ బ్లింకెన్ కూడా ఈ విందుకు హాజరవుతారు.
దీంతో పాటు అమెరికాలోని వివిధ సంస్థల సీఈవోలు, వృత్తి నిపుణులు, ప్రవాస భారతీయులు, ఇతరులతోనూ మోదీ భేటీ అవుతారు.
జూన్ 24-25: ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశ రాజధాని కైరో వెళ్తారు.
‘ఆయుధం అందుకో ద్రౌపదీ..!’

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజా ఓ కవితను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ కవి పుష్యమిత్ర ఉఫాధ్యాయ్ రాసిన ఆ కవితను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇదీ ఆ కవిత..
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
గోరింటాకు చేతులతో కత్తి పట్టుకో
నీ చీరను నువ్వే కాపాడుకో
శకుని జూదమాడుకుంటున్నాడు
మెదళ్లన్నీ అమ్ముడైపోతాయి
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
ఇంకా ఎంతకాలమని వేచి చూస్తావ్!
అమ్ముడైపోయిన మీడియాను ఏమని రక్షణ అడుగుతావ్!
దుశ్శాసన సభలో సిగ్గులేని వారంతా
నీ మానాన్ని ఏం కాపాడుతారు?
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
నిన్నటి వరకు రాజు గుడ్డివాడు మాత్రమే..
ఇప్పుడు చెవిటి, మూగ కూడా..
ప్రజల నోళ్లకు కుట్లు వేశారు
చెవులకు కట్లు కట్టారు
ఈ కన్నీళ్లు నీవేనని నువ్వే చెప్పుకో
ఎవరికి ఏం చెప్పగలం?
ద్రౌపదీ! ఆయుధం అందుకో
శ్రీకృష్ణుడు ఇక రాడు..
కెనడాలో భారతీయ విద్యార్థులు ఎలా మోసపోయారు... విదేశాల్లో చదువుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి
3 వేల ఏళ్ల కిందటి సమాధిలో స్త్రీ పురుష మృతదేహాల పక్కనే తళతళలాడే పురాతన కాంస్య ఖడ్గం

ఫొటో సోర్స్, ARCHÄOLOGIE-BÜRO DR. WOIDICH
జర్మనీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు 3,000 ఏళ్ల కిందట కాంస్య యుగం నాటి కంచు కత్తిని తవ్వకాలలో గుర్తించారు.
అష్టముఖ పిడి ఉన్న ఈ కాంస్య ఖడ్గాన్ని దక్షిణ జర్మనీలోని నార్లింజెన్ నగరంలోని ఓ సమాధిలో గుర్తించారు.
ఇది క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం చివరి కాలం నాటిదిగా పురాతత్వ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
వేల సంవత్సరాల కిందటిది అయినప్పటికీ ఇప్పటికీ ఇది తళతళలాడుతోందని, ఏమాత్రం పాడవలేదని బవేరియాలోని పురాతత్వ వస్తువుల రక్షణ కార్యాలయ అధికారులు తెలిపారు.
కాగా ఆ సమాధిలో ఒక పురుషుడు, మహిళ, బాలుడికి చెందిన ఎముకలతో పాటు ఈ కాంస్య ఖడ్గం, మరికొన్ని కంచు వస్తువులు ఉన్నట్లు చెప్పారు.
అయితే, సమాధిలో ఉన్న ముగ్గురూ ఒకరికొకరు ఏమవుతారు, అసలు ఆ ముగ్గురు సంబంధీకులేనా అనేది తెలియదని, ఈ ఖడ్గం ఎక్కడిది? దాని మూలలేమిటి కూడా ఇంకా స్పష్టంగా తెలియదని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పారు.
కత్తిని పిడిలో తొడగకుండా.. నేరుగా కత్తిపైనే పిడిని పోత పోశారని, ఇలాంటిది తయారు చేయడం చాలా కష్టమని పురాతత్వ వస్తువుల రక్షణ కార్యాలయ అధికారులు తెలిపారు.
అయితే, ఈ కత్తిని క్రోధ కార్యకలాపాలకు వాడినట్లు ఆధారాలు కనిపించలేదని, అలా అని అలంకారప్రాయమైన కత్తి కూడా కాదని, అసలైనదేనని చెప్పారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.
ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది, చరిత్రలో ఏం జరిగింది?
