ఫ్రాన్స్: వీధుల్లోని నిరసనకారులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కాత్యా ఎడ్లర్
- హోదా, బీబీసీ యూరప్ ఎడిటర్
‘‘మీరు దయచేసి ఇంటికి వెళ్తారా?’’ ఫ్రాన్స్‌కు చెందిన ఒక మహిళ యువతను పదే పదే ప్రాధేయపడుతూ అడుగుతున్నారు.
ఫ్రాన్స్ వీధుల్లో నిరసనలు చేస్తోన్న ఈ బృందాన్ని నిలువరించేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నిస్తున్నారు.
సెంట్రల్ పారిస్‌లోని పర్యాటకుల షాపింగ్‌కు స్వర్గధామం అయిన ఛాంప్స్ ఎలిసిస్‌లో ఆదివారం ఉదయం పూట, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పోలీసుల చేతిలో నహెల్ హత్యకు గురైనప్పటి నుంచి పారిస్ నివాస ప్రాంతాల వీధుల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ ఆందోళనలను బీబీసీ యూరప్ ఎడిటర్ వివరించారు.
‘‘నేను, నా కొలీగ్స్ కలిసి కెమెరాల్లో ఈ ఆందోళనలు చిత్రీకరిస్తున్నాం. ఈ మహిళ అడుగుతున్న మాదిరి ఈ ప్రశ్నను ఫ్రాన్స్‌లో ప్రస్తుతం ఎంత మంది అడుగుతున్నారనే ఆలోచన నాకు వచ్చింది.
ఆందోళనకారులు వెనక్కి తగ్గి, త్వరగా ఇళ్లకి వెళ్తారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఆశిస్తున్నారు.
ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆందోళనలు జరగడం ఇది రెండోసారి. తొలిసారి పింఛను సవరణలపై జరగగా, రెండోసారి నహెల్ మరణంపై జరుగుతున్నాయి. మేక్రాన్ పాపులారిటీ ఇవి దెబ్బతీస్తున్నాయి.

ఈ ఆందోళనలకు బాధ్యులెవరు?
అబ్దుల్ అనే వ్యక్తి టీచర్. నహెల్ ఉండే ప్రాంతంలోనే ఉండే వారు. మేక్రాన్ దీనికి బాధ్యత వహించాలని వారంటున్నారు.
ఆయన ఆర్థిక సంస్కరణలు పూర్తి వైఫల్యం చెందాయని, విద్యా వ్యవస్థలో ఫ్రాన్స్ దిగజారిందని అంటున్నారు.
అసంతృప్త, నిరుద్యోగ యువత ఈ వీధి నిరసనలకు సగం బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా అబ్దుల్ అభిప్రాయపడుతున్నారు. కొందరు వ్యక్తులు వెనకుండి వీరిని ఉసిగొల్పుతున్నారని చెప్పారు.
అబ్దుల్ పక్కింటి వారు ప్రతి రోజూ ఉదయాన్నే తమ మొబైల్ ఫోన్లలో బయట జరుగుతున్న ఆ ఆందోళనలను ఫొటోలు తీస్తున్నారు. యువత ఆందోళనలను ఆపాలని వారు కోరుకుంటున్నారు.
సెలియా ఒక విద్యార్థి. ఈ హింసపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన మొత్తం కమ్యూనికిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలను ఆపివేయాలని ఆమె కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇబ్బందుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు
పారిస్‌కి సమీపంలో వర్కింగ్ క్లాస్ ఏరియా ఔల్నేలో ఉండే చాలామంది తల్లులు వీధుల్లోకి వచ్చి, ఈ హింసకు ముగింపు పలకాలని బ్యానర్లు పట్టుకుని యువతను కోరారు.
యువతను ఇళ్లలోనే ఉండేలా చేయాలని, సోషల్ మీడియా దూరంగా ఉంచాలని ఆందోళనకారుల తల్లిదండ్రులను అధ్యక్షుడు మేక్రాన్ ఇంతకు ముందే అభ్యర్థించారు.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నెలకొన్న ఈ సంక్షోభం మేక్రాన్ రాజకీయంగా దెబ్బతీస్తుంది.
పేద, వెనుకబడిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయనపై అతివాద పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఆందోళనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మితవాద పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించాలని అంటున్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిలా మారింది.
ఏదైనా చర్యలు తీసుకుంటే, వీధుల్లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందని ఆయన ఆందోళన చెందుతున్నారు.
అంతేకాక, అంతర్జాతీయంగా ఫ్రాన్స్ ప్రతిష్ట కూడా దిగజారొచ్చు.
ఈ సంక్షోభ కారణంతో గత వారం ఈయూ నేతల సదస్సుకు మేక్రాన్ హాజరు కాలేదు.
గత వారం చివరిలో జర్మనీకి వెళ్లాల్సిన హై-ప్రొఫైల్ స్టేట్ విజిట్‌ను కూడా రద్దు చేసుకున్నారు.
గత 23 ఏళ్లలో ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడు చేపట్టే తొలి స్టేట్ విజిట్ ఇదే.

ఫొటో సోర్స్, Getty Images
ఈ హింస ఆగేదెప్పుడు?
ప్రపంచంలోనే అతిపెద్ద సైక్లింగ్ చాంపియన్‌షిప్ టూర్ డే ఫ్రాన్స్ వంటి అంతర్జాతీయ పోటీలను సురక్షితంగా ఫ్రాన్స్ నిర్వహించగలదా? అనే సందేహాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.
అంతేకాక, సెప్టెంబర్ నుంచి ఫ్రాన్స్‌లో రగ్బీ వరల్డ్ కప్ జరగనుంది. వచ్చే ఏడాది సమ్మర్ ఒలింపిక్స్ కూడా జరగనున్నాయి.
నహెల్ మరణం తర్వాత చెలరేగిన ఈ నిరసనల్లో ఒక రాత్రి ఒలింపిక్ స్విమ్మింగ్ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు.
నహెల్ పేరుతో ఎవర్ని కూడా విధ్వంసానికి లేదా దొంగతనాలకు లేదా హింసకు పిలవలేదని చనిపోయిన యువకుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ హింసల వల్ల తమకు దక్కాల్సిన న్యాయం దక్కకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయమంటే నహెల్‌ను చంపిన పోలీసు అధికారికి జైలు శిక్ష పడేలా చేయడమని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు
పోలీసులతో సాధారణంగా జరిగే ఘర్షణలతో తాము ఇంట్లో కూడా అసౌకర్యంగా ఉంటున్నట్లు కొందరు చెప్పారు.
ఫ్రాన్స్ రక్షణ దళాలు వ్యవస్థీకృత జాతి వివక్షకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది.
అస్సా ట్రారే ఒక కార్యకర్త. ఏడేళ్ల క్రితం తన సోదరుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మరణించినట్లు అస్సా ట్రారే చెప్పారు.
ఫ్రాన్స్‌లో ఒక యంగ్ బ్లాక్ లేదా అరబ్ వ్యక్తిగా ఉండటమంటే, తరచుగా పోలీసుల క్రూరత్వానికి, వ్యవస్థీకృత జాత్యాంహకరానికి బలి కావాల్సిందే అని ఆమె అన్నారు.
దీన్ని స్థానిక సమస్యగా ఫ్రాన్స్ గుర్తించే వరకు, నహెల్ లాగా చాలా మంది వ్యక్తులకు ఇలానే జరుగుతుందన్నారు.
అయితే, వ్యవస్థీకృత జాత్యంహకార ఆరోపణలను ఫ్రాన్స్ శక్తివంతమైన పోలీసు సంఘాల్లో ఒక యూనిట్ ఎస్‌జీపీ సెక్రటరీ జనరల్ ఖండించారు.
ఫ్రాన్స్ అమెరికా కాదని జీన్ క్రిస్టోఫే కౌవీ చెప్పారు. అక్కడి లాగా మైనార్టీల కాలనీలు లేవన్నారు.
‘‘అన్ని నేపథ్యాల నుంచి వచ్చిన అధికారులతో ఫ్రాన్స్ బహుళ జాతీ సంస్కృతిని మా దళాలు ప్రతిబింబిస్తున్నాయి.’’ అని చెప్పారు.
మిగతా సమాజంతో పోలిస్తే కేవలం ఒక శాతం జాత్యాంహకారాన్ని మాత్రమే ఇక్కడ చూస్తామని, అంతకుమించి ఉండదన్నారు.
నహెల్ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున దీనిపై మరింత మాట్లాండేందుకు ఆసక్తి చూపలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నిరసనలకు ఒక్కటే మార్గం
ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నే జనవరిలో జాత్యాంహకారానికి వ్యతిరేకంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చారు.
ఫ్రాన్స్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న అందరూ కూడా నహెల్ మరణంపైనే కాకుండా.. ఫ్రాన్స్‌లో తమలాంటి వారికి పెద్దగా నిరసనలు వినిపించడం ఒక్కటే మార్గమని కొందరు అంటున్నారు.
అందుకే ఇంటికి వెళ్లలేమని, ఇంటికి వెళ్లకూడదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














