ఫ్రాన్స్: రోడ్లపై యుద్ధ వాతావరణం... తెలుగువాళ్లు ఎలా ఉన్నారు, ఏమంటున్నారు?
ఆందోళనల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించిందని తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ తిగుళ్ల తెలిపారు.
లైవ్ కవరేజీ
కతీజా బీబీ: 'దాదాపు 10 వేల డెలివరీలు చేశాను... అన్నీ సాధారణ ప్రసవాలే, ఒక్కరు కూడా చనిపోలేదు'
విజయవాడ ఎయిర్‌పోర్ట్: ప్రైవేట్ క్యాబ్ సేవల విషయంలో అధికారులది రోజుకో తీరు, ప్రయాణికులు బేజారు
వాగ్నర్ లాంటి 'ప్రైవేట్ ఆర్మీలు' ప్రపంచమంతటా ఎలా పని చేస్తుంటాయి... హైదరాబాద్ నిజాం మీదకు విజయనగర సామ్రాజ్యం కిరాయి సైనికులను పంపించిందా?
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు.. తెలుగు వాళ్ల పరిస్థితి ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Reuters
ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కారును ముందుకు పోనిచ్చిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది.
పారిస్ శివారులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అనంతరం మొదలైన ఆందోళనలు, వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా పోలీసులు ఇప్పటికే దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు వారు బీబీసీతో మాట్లాడారు.
ఆందోళనల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించిందని తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ తిగుళ్ల తెలిపారు.
''ఉదయం గొడవలు జరిగాయి, ప్రస్తుతం కొద్దిగా తగ్గాయి. బాగా ఎఫెక్ట్ అయిన రెండు ఏరియాలలో తెలుగువాళ్లు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చాలామంది ఉంటారు. ప్రస్తుతం అందరు 'వర్క్ ఫ్రం హోం' చేస్తున్నారు. ఈ రాత్రికి పోలీసులను మోహరించొచ్చు. ఆందోళనలు జరుగుతున్న ఏరియాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది'' అని శ్రీనివాస్ చెప్పారు.
తమిళనాడు: డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన గవర్నర్ ఆర్ఎన్. రవి

ఫొటో సోర్స్, ANI
డీఎంకే ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖల మంత్రిగా పనిచేస్తున్న వి. సెంథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్. రవి మంత్రివర్గం నుంచి తొలగించారు.
ఈ మేరకు గురువారం తమిళనాడు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
"మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగ నియామకాల్లో డబ్బులు తీసుకోవడం, మనీలాండరింగ్ సహా పలు తీవ్రమైన కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు" అని ప్రకటనలో పేర్కొంది.
మంత్రి బాలాజీని జూన్ 14వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) అరెస్టు చేసింది.
ఆన్‌లైన్ గేమ్స్: ఇద్దరు పిల్లలను నీళ్ల సంప్‌లో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి, రూ. 15 లక్షలు పోగొట్టుకోవడంతో బలవన్మరణం
సీపాప్ - సీపీఏపీ: నిద్రలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాడుతున్న ఈ పరికరం ఏమిటి? ఎలా పనిచేస్తుంది
'స్పై' రివ్యూ: మెషీన్ గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించిన నిఖిల్ మరోసారి మెప్పించాడా?
టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలలో మృతదేహాల భాగాలు - ఎవరివో స్పష్టం చేయని అధికారులు
చంద్రశేఖర్ ఆజాద్: భీమ్ ఆర్మీ చీఫ్‌పై కాల్పులు జరిపింది ఎవరు? యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలు కరవయ్యాయా
మణిపుర్‌లో రాహుల్ గాంధీ, రాష్ట్రపతి పాలన విధించాలంటున్న కాంగ్రెస్

ఫొటో సోర్స్, CONGRESS PARTY
ఫొటో క్యాప్షన్, మణిపుర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ హింసాత్మకంగా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం మణిపుర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నారు.
హింస కారణంగా ఆశ్రయం కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. ప్రజా సంఘాల నేతలతో రాహుల్ భేటీ కానున్నారు.
గత రెండు నెలలుగా మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మెయితెయ్, కుకీ తెగల మధ్య ఘర్షణలతో హింస చెలరేగింది. ఇప్పటి వరకూ ఈ ఘర్షణల్లో వంద మందికిపైగా చనిపోయారు. సుమారు 400 మంది గాయాలపాలయ్యారు.
రెండు నెలలుగా హింస చెలరేగుతున్నప్పటికీ కనీసం స్పందించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సోమవారం ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు.
హింస చెలరేగిన తర్వాతి నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపుర్‌లో పర్యటించారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ నేటికీ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైనందుకు మణిపుర్ బీజేపీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం బిరేన్ సింగ్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించలేకపోయారని, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మణిపుర్‌లో చెలరేగిన హింస కారణంగా 60 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా సుమారు 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
అయినప్పటికీ మణిపుర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
టీనేజర్‌ను కాల్చి చంపిన ఘటనతో అట్టుడికిపోతున్న ఫ్రాన్స్

ఫొటో సోర్స్, EPA
ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కారును ముందుకు పోనిచ్చిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది.
పారిస్ శివారులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అనంతరం మొదలైన ఆందోళనలు, వరుసగా రెండో రోజూ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు ఇప్పటికే దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కాల్చి చంపిన బాలుడిని నహేల్ ఎం గా గుర్తించారు.
పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఆందోళనలు, దేశంలోని వివిధ నగరాలకు వ్యాపించాయి.
రాళ్లు విసిరే, వాహనాలకు నిప్పంటించే ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఉత్తర ఫ్రాన్స్ నగరం లిల్లీలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల చేతిలో చనిపోయిన యువకుడికి నివాళి అర్పించేందుకు పశ్చిమ నగరం రెన్నెస్‌లో సుమారు 300 మంది సమావేశమయ్యారు.
నహేల్‌పై జరిపిన కాల్పుల ఘటన మర్చిపోయేంత తేలికైనది కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. శాంతంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
సౌదీ అరేబియా: అమెరికా కాన్సులేట్ సమీపంలో కాల్పులు, ఇద్దరు మృతి

ఫొటో సోర్స్, ANI
సౌదీ అరేబియా జెడ్డాలో అమెరికా కాన్సులేట్‌కు సమీపంలో కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
చనిపోయిన వారిలో ఒకరు సెక్యూరిటీ గార్డుకాగా, మరొకరు గన్‌మాన్ అని అమెరికా విదేశాంగ తెలిపిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
అయితే, ఈ ఘటనలో అమెరికా పౌరులెవరూ గాయపడలేదని తెలిపింది.
అమెరికా కాన్సులేట్‌లో పనిచేసే నేపాలీ సెక్యూరిటీ గార్డు తొలుత ఈ కాల్పుల్లో గాయపడ్డారని, ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.
అమెరికా కాన్సులేట్ ముందు గుర్తు తెలియని వ్యక్తి కారు ఆపి, గన్‌తో సెక్యూరిటీ గార్డుల ముందుకు వచ్చి ఈ కాల్పులు జరిపాడని సౌదీ అరేబియా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ ఘటనపై కాన్సులేట్, సౌదీ అరేబియా అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి అమెరికా విదేశాంగ విచారణ చేస్తోంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను చూడండి.
కాఫీ ఫిల్టర్ కనిపెట్టిన మహిళ కథ... ఆమెకు ఈ ఐడియా ఎలా వచ్చింది?
