ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
బుల్లెట్ చంద్రశేఖర్ నడుము భాగాన్ని తాకింది. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎస్ఎస్పీ విపిన్ తాడా తెలిపారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ani
ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరాం) జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో బుధవారం ఈ ఘటన జరిగిందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
కారులో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్‌పై మరో వాహనంలో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
బుల్లెట్ చంద్రశేఖర్ నడుము భాగాన్ని తాకింది. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎస్ఎస్పీ విపిన్ తాడా తెలిపారు.
''నాకు సరిగ్గా గుర్తు లేదు. కానీ మా వాళ్లు వారిని గుర్తించారు. వాళ్ల కారు సహరాన్‌పూర్ వైపు వెళ్లింది. మేం యూ-టర్న్ తీసుకున్నాం. ఘటన జరిగినప్పుడు కారులో మా తమ్ముడు సహా ఐదుగురం ఉన్నాం'' అని చంద్రశేఖర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలను టాప్‌లెస్‌గా వచ్చేందుకు అనుమతించాలని పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌కు స్పెయిన్‌లోని కెటలోనియా స్థానిక ప్రభుత్వం సూచించడంతో అక్కడి సామాజిక ఉద్యమకారులు సంబరాలు చేసుకుంటున్నారు.
2020 కెటలోన్ ‘ఈక్విటీ లా’లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్‌కు అనుమతించేందుకు నిబంధనలు ఉన్నాయి.
అయితే, కొన్ని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్స్ దీనికి అనుమతించడం లేదు.
దీంతో ఏటా వేసవిలో దీనిపై ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ విషయంలో ఎలాంటి వివక్షా చూపించకూడదని స్థానిక అధికారులు ప్రస్తుతం స్పష్టంచేశారు.
టాప్‌లెస్‌గా వచ్చే వారిని అడ్డుకోవడమంటే తమ శరీరం విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కులను ఉల్లంఘించడమేనని కెటలోన్ ప్రభుత్వానికి చెందిన ఈక్వాలిటీ, ఫెమినిజం శాఖ తాజాగా ఒక లేఖను విడుదల చేసింది.
అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలు పట్టడాన్ని కూడా అనుమతించాలని లేఖలో సూచించారు.
మరోవైపు ముస్లింల బాతింగ్ సూట్‌లు ‘బుర్కినీ’ని కూడా అనుమతించాలని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏడాది ఏడాదికి మన వయసు పెరుగుతూ ఉంటుంది. కానీ, ఇప్పుడు దక్షిణ కొరియా ప్రజల వయసు మాత్రం ఏడాది లేదా రెండేళ్లు తగ్గుతోంది.
వయసును లెక్కించేందుకు ఇప్పటి వరకూ అనుసరించిన శతాబ్దాల కిందటి రెండు విధానాలను దక్షిణ కొరియా మార్చేసింది.
పాత విధానం ప్రకారం, పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచే వయసును లెక్కిస్తారు. ఆ కారణంతో పిల్లలు పుట్టినప్పుడే, వారికి ఏడాది వయసు ఉంటుంది. మరుసటి ఏడాది జనవరి 1కి రెండేళ్లుగా లెక్కించేవారు. అంటే డిసెంబర్ 31న పుట్టిన చిన్నారికి కూడా మరునాడు జనవరి 1కి రెండేళ్లుగా లెక్కించేవారు.
మరో పాత విధానం ప్రకారం, ఏ నెలలో ఏ రోజు పుట్టినా సరే ఆ ఏడాది జనవరి 1 నుంచి వారి వయసు లెక్కించేవారు.
పాత విధానలు గందరగోళంగా ఉన్నందున, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వయసును లెక్కించేలా కొత్త చట్టాన్ని దక్షిణ కొరియా తీసుకొచ్చింది.
ఇవాళ్టి (జూన్ 28)న కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకనుంచి అక్కడి ప్రజలు కూడా తమ పుట్టిన రోజులను ఆధారంగా చేసుకుని వయసును లెక్కించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Congress party
దిల్లీలోని కరోల్ బాగ్‌లో ఉన్న ఓ బైకు మెకానిక్ షాపుకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు.
అక్కడ పనిచేస్తున్న మెకానిక్‌ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలప్పుడు మెకానిక్ షాపుకు వెళ్లిన రాహుల్ గాంధీ, దాదాపు రెండు గంటలపాటు అక్కడే ఉన్నారు.
గతంలోనూ దిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కారు.
ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే సమయంలోనూ ట్రక్కులో ప్రయాణించారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ల రోజువారీ జీవితాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను చూడండి.