హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో మమతా బెనర్జీకి గాయాలు

ఉత్తర బెంగాల్‌లోని తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయాలు అయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్‌లో

  3. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో మమతా బెనర్జీకి గాయాలు

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, Sanjay_das

    ఉత్తర బెంగాల్‌లోని తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయాలు అయ్యాయి.

    మంగళవారం సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న వెంటనే ఆమెను నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి ఎస్ఎస్‌కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    ఎయిర్‌పోర్టు దగ్గరే మమతా బెనర్జీ కోసం ఒక అంబులెన్స్‌ను సిద్ధంచేశారు. అయితే, ఆమె తన కారులోనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమెకు అక్కడ వీల్‌చైర్ ఏర్పాటుచేశారు.

    ఆమె నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

    ల్యాండింగ్ సమయంలో మమత కాలు, వెన్నుకు గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. టీటీడీ -గుండె ఆపరేషన్లు: లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా

  5. సర్ఫరాజ్ ఖాన్: 37 మ్యాచ్‌లలో 13 సెంచరీలు.. అయినా టీమ్‌ఇండియాకు సెలక్ట్ చేయలేదు.. లావుగా ఉంటే ఆడనివ్వరా

  6. 1971 యుద్ధానికి ముందు భారత ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా పాకిస్తాన్‌ రాయబారిని ఎందుకు కౌగిలించుకున్నారు

  7. రష్యా ఆర్మీలో నేపాలీ యువత.. భారీ వేతనాలే కారణమా

  8. వరల్డ్ కప్ 2023: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  9. ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం... కోటి మందికి ఉచితంగా ఇంటర్న్‌షిప్

  10. ఒబామా వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఒవైసీ

    ఒవైసీ

    ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

    "మోదీ ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటనపై స్పందించాలనుకుంటున్నారు. కానీ, చైనా లేదా మణిపూర్ హింసపై మాత్రం ఏం చెప్పడం లేదు’’ అని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

    ‘‘చైనా బెదిరింపులకు తలొగ్గకుండా దానిపై మాట్లాడే ధైర్యం ఈ విదేశీ ప్రయాణం ద్వారా మోదీకి రావాలని ఆశిస్తున్నాను. అదే విధంగా సుమారు గత 8 వారాలుగా తీవ్ర అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ సమస్యపై కూడా ప్రధాని మౌనాన్ని వీడి ధైర్యంగా మాట్లాడాలి.’’ అని ట్వీట్ చేశారు.

    ‘‘మణిపూర్‌లో రాష్ట్ర ఆయుధశాలల నుంచి 4 వేలకు పైగా ఆయుధాలను దొంగలించారు. కానీ, దీనికి బాధ్యులెవరో గుర్తించలేదు. కశ్మీర్‌ విషయాన్ని పక్కన పెడితే, ఏదైనా విపక్షాలు పాలించే రాష్ట్రాల్లో కాస్త హింస చెలరేగినా కూడా మన మీడియా ఆక్రోశం ఎంత బీభత్సంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదే మన నవ భారతం’’ అని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘ఈజిప్ట్ మసీదుకు కాకుండా కాశీలోని మసీదుకి మోదీ రావాలి’

    ‘‘భారత్‌లోని ముస్లింలకు సౌదీ అరేబియా, ఇరాన్ లేదా ఈజిప్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని నేను నిర్మలా సీతారామన్‌కు తెలియజేయాలనుకుంటున్నా. మేం భారతీయ ముస్లిం ప్రజలం. మేం అంబేద్కర్ రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం. భారతీయ ముస్లింలు 1947లోనే ఇక్కడ నివసించేందుకు నిర్ణయించుకున్నాం’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశిస్తూ ఒవైసీ మరో ట్వీట్ చేశారు.

    ‘‘ప్రధాని మోదీ, మీరు ఈజిప్ట్‌లోని మసీదుకు వెళ్లే కంటే, కాశీలోని మసీదుకు రండి. మీరు భారత ప్రధాని. ఈజిప్ట్‌ దేశానికి కాదు’’ అని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

    కొత్త వందే భారత్ రైళ్లు

    ఫొటో సోర్స్, ANI

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

    వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. అక్కడి నుంచే ఈ రైళ్లకు పచ్చజెండా ఊపారు.

    బిహార్, గోవా, జార్ఖాండ్ రాష్ట్రాలకు తొలిసారి వందే భారత్ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

    ఇవాళ లాంచ్ చేసిన వందే భారత్ రైలు సర్వీసులలో.. భోపాల్(రాణి కమలాపతి)-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భోపాల్(రాణి కమలాపతి)-జబల్పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచి-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గోవా(మడగాన్)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘రాష్ట్రంలో వందే భారత్ రైలు సర్వీసులను తీసుకొస్తుండటంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముంబైతో గోవాను వేగవంతంగా అనుసంధానించేందుకు ఇది సాయపడుతుంది. ఇది పర్యాటకం, వాణిజ్యానికి ఊతమిస్తుంది’’ అని గోవా సీఎం ప్రమోద్ సవాంత్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  12. లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను చూడండి.