ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
'రెండు వేల రూపాయల నోట్ల విత్‌డ్రా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. దీని వల్ల ఎంత సానుకూల ప్రభావం ఉంటుందనేది, భవిష్యత్‌లో మాత్రమే తెలుస్తుంది' అని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ISPR
పాకిస్తాన్‌లో మే 9న చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలపై దర్యాప్తు పూర్తయిందని పాకిస్తానీ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరి చెప్పారు.
ఈ విషయంపై సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఒక లెఫ్టినెంట్ జనరల్ సహా ముగ్గురు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ అధికారులు సైనిక సదుపాయాలకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని చౌధరి చెప్పారు.
మొత్తంగా ముగ్గురు మేజర్ జనరల్స్‌తోపాటు ఏడుగురు బిగ్రేడియర్లు సహా 18 మంది అధికారులపై శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పెల్లుబికిన నిరసనల్లో భాగంగా కొందరు సైనిక సదుపాయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దీనికి సంబంధించి 120 మందిపై సైనిక కోర్టుల్లో విచారణ చేపడుతున్నట్లు చౌధరి వెల్లడించారు.

ఫొటో సోర్స్, TSeries
టికెట్ల రేట్లు వరసగా రెండు సార్లు తగ్గించినప్పటికీ ఆదిపురుష్ కలెక్షన్లు ఏమీ పెరగలేదు. రెండో వారంలో ఈ చిత్రం భారతదేశంలో రూ. 14 కోట్లు వసూలు చేసింది.
సినిమా కలెక్షన్ల వివరాలు వెల్లడించే Saknilk వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఆదిపురుష్ చిత్రం విడుదలైన రెండో ఆదివార రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజున రికార్డులు సృష్టించింది. హిందీ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓపెనింగ్స్ సాధించింది. మొత్తంగా మొదటి వారంలో ఆదిపురుష్ ఒక్క హిందీలోనే రూ. 113 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ఇప్పటివరకు రూ. 369.55 కోట్లు రాబట్టింది. భారతదేశం వరకే చూస్తే ఈ మొత్తం 316.55 కోట్లు.
అయితే, క్రమంగా ఈ చిత్రం కలెక్షన్లు పడిపోతున్నాయి. మొదటి నుంచీ రకరకాల వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని సంభాషణల మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దాంతో, సినిమాలోని కొన్ని డైలాగులను మార్చారు. మనోజ్ ముంతషిర్ ఈ సినిమా సంభాషణల రచయిత.

ఫొటో సోర్స్, Getty Images
రూ. 2,000 నోటు వెనక్కి తీసుకోవడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
‘‘నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. రెండు వేల రూపాయలనోట్ల విత్‌డ్రా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. దీని వల్ల ఎంత సానుకూల ప్రభావం ఉంటుందనేది, భవిష్యత్‌లో మాత్రమే తెలుస్తుంది’’ అని శక్తికాంత దాస్ చెప్పారు.
రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది.
ఈ నోట్లు క్రమంగా సర్క్యూలేషన్‌లో తగ్గిపోయాయని ఆర్‌బీఐ తెలిపింది. 2018 మార్చి 31 నాటికి మార్కెట్‌లో రూ.6.73 లక్షల కోట్ల విలువైన 2,000 నోట్లు మార్కెట్లో ఉన్నాయని, మొత్తం నోట్లలో వాటి వాటా 37.3 శాతమని పేర్కొంది.
కాగా, 2023 మార్చి 31 నాటికి మార్కెట్లో ఉన్న మొత్తం రూ. 2,000 నోట్ల కరెన్సీ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపింది. ఇప్పుడు మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 10.8 శాతమేనని తెలిపింది.
ఆర్‌బీఐ నిర్ణయంపై స్పందించిన బీజేపీ నేతలు, ఇది అవినీతిపై సర్జికల్ స్ట్రయిక్ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని బెర్హాంపుర్ జిల్లాలోని ఎంకెసీజీ మెడికల్ కాలేజికి తరలించారు.
గంజాం జిల్లా కలెక్టర్ దివ్య జ్యోతి పరీదా ఈ ఘటనపై ఏఎన్ఐతో మాట్లాడుతూ, ”ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గాయపడిన వారికి అవసరమైన అన్ని చికిత్సలూ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం” అని చెప్పారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన ప్రకటించారు.
హలో... గుడ్ మార్నింగ్,
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించే బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం.