BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
కాంగ్రెస్ 'వెన్నుపోటు' పొడిచిందంటూ డీఎంకే ఆగ్రహం.. విజయ్ పార్టీకి మద్దతు వల్ల హస్తం పార్టీకి కలిగే ప్రయోజనమేంటి?
ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి టీవీకేకు మద్దతిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? విజయ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌కు ఒనగూరే ప్రయోజనమేంటి?
దేశ రాజకీయాలపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావమేంటి, టీవీకే విజయం నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోగలవా?
పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారి భవిష్యత్తేంటి? బీజేపీ తన విధానాన్ని అలాగే కొనసాగించి వారి పౌరసత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందా? భారత్‌లోని 'నిరాశ చెందిన' ప్రతిపక్షం టీవీకే విజయం నుంచి పాఠాలు నేర్చుకోగలదా?
కుక్కలు వాసన చూసి క్యాన్సర్‌ను పసిగడతాయా?
కర్ణాటకలోని ఆరు వేర్వేరు ఆసుపత్రులలో శిక్షణ పొందిన కుక్కలతో ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో కుక్కలు ఎవరికి క్యాన్సర్ ఉంది, ఎవరికి లేదు అనే విషయాన్ని 91 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగాయి. అసలు, కుక్కలు క్యాన్సర్‌ను ఎలా పసిగడతాయి?
'ప్రాజెక్ట్ ఫ్రీడమ్': హార్ముజ్ జలసంధిలో ట్రంప్ చేపట్టిన ఈ ఆపరేషన్ ఏంటి, ఎందుకు హఠాత్తుగా నిలిపేశారు?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి హార్ముజ్ జలసంధి చాలా వరకు మూసివేతకు గురైంది. ఈ దాడులకు స్పందనగా.. కీలకమైన ఈ జలమార్గాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన కరూర్ జిల్లాలో ఏ పార్టీకి ఫలితాలు ఎలా వచ్చాయంటే..
ప్రచార సభలో విషాదం తర్వాత, విజయ్ బాధితులను కలవకుండా చెన్నై వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విజయ్ ఆలస్యంగా రావడంవల్లే ఈ దుర్ఘటన జరిగిందని డీఎంకే ఆరోపించింది. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు సాగిన ఈ ప్రాంతంలో గెలుపెవరిది?
పశ్చిమ బెంగాల్: శుభేందు అధికారి పీఏ హత్య, రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తత
ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుభేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య సంచలనం కలకలం రేపింది. ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా బీజేపీ ఆరోపిస్తోంది.
హెర్క్యూలిస్: అది వాళ్లకు కొడుకులాంటిది, కళ్ల ముందే చనిపోయింది - 25 ఏళ్లపాటు ఎలుగు బంటిని పెంచుకున్న దంపతుల కథ
కుక్కలు, పిల్లలను పెంపుడు జంతువులుగా ఇంట్లో పెంచుకోడాన్ని చూసుంటాం. కానీ ఏకంగా ఒక ఎలుగుబంటినే ఇంట్లోకి తెచ్చుకొని 25 ఏళ్ళ పాటు పెంచుకోడాన్ని చూసారా?
విజయ్: మద్దతు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని తెలిపిన టీవీకే బృందం
రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సరైన భాగస్వామ్యం, బాధ్యతతో ఏర్పాటయ్యే ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే కాదని.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా సహకరించుకుంటుందని తన మద్దతు లేఖలో కాంగ్రెస్ తెలిపింది.
వీడియో, 'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయుల సందడి.., వ్యవధి 0,49
మెట్ గాలా 2026లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' కు తగ్గట్టుగా సెలబ్రెటీలు తమదైన శైలిలో మెరిశారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































