Ind Vs Eng: సంజూ హాఫ్ సెంచరీ, భారీ స్కోరు దిశగా భారత్

క్రికెట్, భారత్, ఇంగ్లండ్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 3 నిమిషాలు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది.

భారత్ భారీ స్కోరు దిశగా వెళ్తోంది.

టీం ఇండియా 15 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

14వ ఓవర్ తొలి బంతికి, 89 పరుగుల వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. భారత్ స్కోర్ 160 పరుగుల వద్ద సంజూ పెవిలియన్ చేరాడు.

సంజూ శాంసన్ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. సంజూ వికెట్ విల్ జాక్స్‌కు దక్కింది.

అనంతరం క్రీజులకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 16వ ఓవర్ నాలుగో బంతికి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

పది ఓవర్లు ముగిసేనాటికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.

పదో ఓవర్ మూడో బంతికి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇషాన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జాక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు.

జట్టు స్కోరు 20 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. 7 బంతుల్లో 9 పరుగులు చేసిన అభిషేక్ 2వ ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ అతని వికెట్ తీశాడు.

డ్రింక్స్ బ్రేక్ సమయానికి 67 పరుగులు చేసింది భారత జట్టు.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవు. అయితే, ఇంగ్లండ్ జట్టులో ఒక మార్పు జరిగింది.

ప్లేయింగ్ 11లో రెహాన్‌కు బదులు ఓవర్టన్‌కు చోటు కల్పించినట్లు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్:

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్:

ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బెంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

క్రికెట్, టీమిండియా, ఇంగ్లండ్, టీ20 వరల్డ్‌కప్

ఫొటో సోర్స్, Getty Images

బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరిగే ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)