ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1.తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది?
''ఓకూన్ సమయా తిలంగాణ దేసటోన్ మొన్ సమొన్ కౌ సా..''
ఇలా సాగే జోలపాట మియన్మార్ దేశంలోనిది. ఇందులో 'తెలంగాణ' పదం కనిపిస్తుంది. ఇది దాదాపు ఐదో శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉంది.
ఈ పూర్తి జోలపాటకు అర్థం…
''ఓ కొడుకా, మన నేల తిలంగాణ..
మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే,
మనం పడవల్లో తూర్పు దిక్కున ఉన్న
ఈ సువర్ణ భూమికి వచ్చాం..''
చరిత్ర పరిశోధకురాలు, సీనియర్ జర్నలిస్టు డీపీ అనురాధ రచించిన 'జగము నేలిన తెలుగు' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

2.స్లీపర్ క్లాస్: ఎస్ 1 నుంచి ఎస్ 12 వరకు బోగీలు ఇక గతమేనా?
ట్రైన్ నంబర్ 17015. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్.
మొత్తం 22 బోగీలుండే ఈ రైలులో థర్డ్ ఏసీ బోగీలు 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీ ఒకటి చొప్పున ఉన్నాయి.
అంటే, మొత్తం ఏసీ బోగీలు 15 కాగా, స్లీపర్ బోగీలు కేవలం మూడు మాత్రమే. జనరల్ రెండు బోగీలు, వికలాంగులు, మహిళలకు కలిపి మరో బోగీ ఉంది. మరోటి జనరేటర్, లగేజ్ కోసం వాడుతున్నారు.
గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 12 స్లీపర్ క్లాస్ బోగీలుండేవి. ఇప్పుడు వాటిని 3కి కుదించేశారు. రిజర్వ్ చేయించుకునే అవకాశం ఉన్న స్లీపర్ క్లాసులో ప్రస్తుతం మూడు బోగీలే మిగిలాయి.
రిజర్వేషన్ చేయించుకోవడం సాధ్యపడని వారు, అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చిన వారు, జనరల్ టికెట్‌తో ప్రయాణించేందుకు మూడు బోగీల్లోనే అనుమతి ఉంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
3.మనిషిని చంపేసి ఇంటర్నెట్‌లో ఏం వెతుకుతున్నారు?
గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్నికలిచివేయొచ్చు.
చంపడం, మృతదేహాన్ని ముక్కలు చేయడం, ఆధారాలు లేకుండా చేసేందుకు అనువైన మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు హంతకులు.
''ఆధారాలు దొరకకుండా శవాన్ని ఎలా పారేయాలి?''
''మృతదేహాన్ని ముక్కలుగా ఎలా కోయాలి?''
2022 మే 18నదిల్లీలో శ్రద్ధా వాల్కర్‌ను హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఇంటర్నెట్‌లో వెతికిన ప్రశ్నలివి.
2023 మే 12న హైదరాబాద్‌లో యర్రం అనురాధా రెడ్డి అనే మహిళను హత్య చేసిన చంద్ర మోహన్ కూడా ''డెడ్ బాడీ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?'' అని ఆన్‌లైన్‌లో వెతికాడు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
4.పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
మనలో చాలా మంది రోజూ పాలు తాగుతుంటారు. పాలతోపాటు పెరుగు, టీ లాంటివి మన జీవితంలో భాగమైపోయాయి.
ఆరోగ్యానికి పాలు చాలా మేలు చేస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, ఎముకలు, దంతాలు గట్టి పడతాయి.
పాలతో శరీర జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఇంట్లో పెద్దవారు చెబుతుంటారు.
పాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2001 నుంచి ఏటా జూన్ 1ని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం, వ్యవసాయం సంస్థ(ఎఫ్‌ఏవో) 'ప్రపంచ పాల దినోత్సవం'గా పాటిస్తోంది.
అయితే, పాలు తాగాల్సిన విధంగా తాగడం లేదంటూ ఈ మధ్య యూట్యూబ్‌లో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
5.ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
''ఫస్ట్ డే.. ఫస్ట్ షో'' పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కొత్త సేవలను మొదలుపెడుతోంది.
కొత్త సినిమాలను విడుదలైన రోజు నుంచే ఇంట్లోనే చూసేందుకు ఈ సేవలు వీలు కల్పిస్తాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.
విశాఖపట్నంలో శుక్రవారం ఈ సేవలను ప్రారంభిస్తున్నారు.
ఇంతకు ఏమిటీ ''ఫస్ట్ డే.. ఫస్ట్ షో''? దీనికి సబ్‌స్రైబ్ చేసుకోవడం ఎలా? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు? సినీ వర్గాలు ఏమంటున్నాయి?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ
- 'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
- జగనన్న భూ రీ సర్వే- గిరిజనుల భూములు చేతులు మారాయా, రికార్డులు తారుమారయ్యాయా-
- వరంగల్-లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్- సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు-
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








