సంక్రాంతి సందడి: ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్...
సంక్రాంతి సందడి: ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్...
సంక్రాంతి సందర్భంగా ఆంధప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్ జరిగింది. సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం పలు పోటీలు నిర్వహించింది.
ఈ డ్రాగన్ పడవ పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన 22 జట్లు పాల్గొన్నాయి.
కేరళ తర్వాత, ఇక్కడ ఆత్రేయపురంలో ఇలాంటి పడవ పోటీలు చూడడం బావుందని వీక్షకులు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









