సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?

వందేభారత్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, యార్లగడ్డ అమరేంద్ర
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.

ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. దీన్ని జనవరి 15వ తేదీన వర్య్చువల్ గా మోదీ ప్రారంభించారు.

సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలు టైమింగ్స్ ఏంటి..?

సికింద్రాబాద్-తిరుపతి మధ్య రైలు ప్రయాణ సమయం 8.30 గంటలు.

రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు ఉన్నాయి.

ఈ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

సికింద్రాబాద్ నుంచి 02701 నంబరుతో ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుపతి నుంచి 02702 నంబరుతో మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నాలుగు స్టాపులున్నాయి.

అవి నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.

ఇందులో నల్లగొండ, ఒంగోలు, నెల్లూరులో నిమిషం చొప్పున ఆగుతుంది.

గుంటూరులో ఐదు నిమిషాలు ఆగుతుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు ఇలా

ఉదయం

6.00 – సికింద్రాబాద్

7.19 – నల్లగొండ

9.45 – గుంటూరు

11.09 – ఒంగోలు

మధ్యాహ్నం

12.29 – నెల్లూరు

2.30 – తిరుపతి

తిరుపతి నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు

మధ్యాహ్నం

3.15 గంటలు – తిరుపతి

సాయంత్ర

5.20 – నెల్లూరు

6.30 – ఒంగోలు

రాత్రి

7.45 – గుంటూరు

10.10 – నల్లగొండ

11.45 - సికింద్రాబాద్

వందేభారత్

ఫొటో సోర్స్, Getty Images

టికెట్ ధర ఎంత..?

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర ఛైర్ కార్ లో రూ.1680 గా రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇందులో బేస్ ఫేర్ – రూ.1168

రిజర్వేషన్ ఛార్జీలు – రూ.40

సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.45

జీఎస్టీ – రూ.63

క్యాటరింగ్ ఛార్జీలు – రూ.364

అలాగే ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీ రూ.3080గా ఉంది.

ఇందులో బేస్ ఫేర్ – రూ.2399

రిజర్వేషన్ ఛార్జీలు – రూ.60

సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.75

జీఎస్టీ – రూ.125

క్యాటరింగ్ ఛార్జీలు – రూ.419

వందేభారత్

ఫొటో సోర్స్, Getty Images

దూరం ఎంత..?

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలు.

ఇది రెండు నగరాల మధ్య ధూరం 660.7 కిలోమీటర్లు

ఈ రైలు అన్ని రోజులు నడవదు.

వారానికి ఆరు రోజులే నడుస్తుంది.

నిర్వహణ కోసం మంగళవారం సెలవు ఉంటుంది.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పోల్చితే సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణం సమయం దాదాపు 4 గంటలు ఆదా అవుతందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు 12 నుంచి 12.30 గంటల ప్రయాణ సమయం ఉండగా.. వందే భారత్ రైలు కేవలం 8.30 గంటలలోనే చేరుకుంటోంది.

వీడియో క్యాప్షన్, ఈ కుక్క అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)