దిల్లీ మైనర్ బాలిక హత్య: నిందితుడు అందరి ముందే ఆమె తలను రాయితో బాదుతున్నా ఎవరూ వారించలేదు-సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన దృశ్యాలు

మైనర్ బాలిక హత్య
ఫొటో క్యాప్షన్, నిందితుడు సాహిల్ ఆమెను బండరాయితో తలపై బాదాడు

దేశ రాజధానిలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో మైనర్ బాలికను హత్య చేసిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.

నిందితుడిని సాహిల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది?

షహబాద్ డెయిరీడైరీ ప్రాంతంలోని జేజే కాలనీలో మైనర్ బాలిక నివసిస్తున్నట్లు దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక, నిందితుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈనెల 27న ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

బాలిక తన స్నేహితుడి కుమారుడి బర్త్ డే పార్టీకి వెళుతోందని నిందితుడు తెలుసుకున్నాడు. ఆమె వీధి గుండా వెళుతుండగా ఆమెను వెంబడించారు.

అనంతరం కత్తులతో దాడి చేశాడు. ఆ తర్వాత తలను రాయితో బాదాడు. ఆస్పత్రికి తరలించేలోగా బాధితురాలు మృతి చెందింది.

మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు షహబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిందితుడు సాహిల్

ఫొటో సోర్స్, ANI

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

''బాలిక, సాహిల్ (నిందితుడు) ఒకరికొకరు తెలుసు, సాహిల్ వయస్సు 20 సంవత్సరాలు. గతంలో సాహిల్‌పై బాధితురాలి కుటుంబం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఘటన జరిగినప్పుడు నిందితుడు 20 కంటే ఎక్కువసార్లు ఆమెపై దాడి చేశాడని భావిస్తున్నాం'' అని అడిషినల్ డీసీపీ రాజా బంతియా మీడియాకు తెలిపారు.

సాహిల్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సమీపంలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. సాహిల్ ఏసీ, ఫ్రిజ్ మెకానిక్ గా పనిచేసేవాడని దిల్లీ డిప్యూటీ కమిషనర్ సుమన్ నల్వా చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని డీసీపీ అన్నారు.

బాలిక వయసు 16 నుంచి 17 సంవత్సరాలు ఉంటుందని, పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని దిల్లీ పోలీస్ స్పెషల్ సీపీ దీపేందర్ పాఠక్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

బాలికను రక్షించేందుకు ఎవరూ రాలేదు

దాడి ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఘటన జరిగిన సమయంలో అక్కడ చాలామంది ఉన్నారని, అయితే ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.

‘‘చూడండి..మనం సమాజంలో ఉంటూ, మన చుట్టూ ఇలాంటి నేరాలు జరుగుతున్నప్పుడు, మనం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. అలాంటి పరిస్థితులో పెద్దగా అరవండి, హడావుడి చేయండి. పోలీసులం మా పనిని ప్రొఫెషనల్ పద్ధతిలో ముందుకు తీసుకెళతాం" అని దిల్లీ స్పెషల్ సీపీ దీపేందర్ సూచించారు.

భారత మాజీ క్రికెటర్, దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ఈ ఘటనపై స్పందించారు.

‘‘మీ సోదరి లేదా కుమార్తెపై అలాగే దాడి చేస్తే ఇంతమంది ఇలాగే ఉండేవారా?’’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

ఘటనపై ప్రముఖుల సీరియస్

బాలిక మృతి దురదృష్టకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

''దిల్లీలో ఓ మైనర్ బాలికను బహిరంగంగానే దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం. దురదృష్టకరం. నేరస్తులు నిర్భయంగా మారారు, పోలీసులంటే భయం లేదు.

లెఫ్టినెంట్ గవర్నర్ సార్. లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత, ఏదైనా చేయండి. దిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది.'' అని తెలిపారు.

బాలిక హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని దిల్లీ పోలీస్ కమిషనర్‌ను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ కోరారు.

ఘటనపై డెలినా ఖోంగ్‌డాప్ నేతృత్వంలో మహిళా కమిషన్ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆమె చెప్పారు.

మరోవైపు ఈ విషయమై దిల్లీ పోలీసులకు నోటీసులు పంపుతున్నట్లు దిల్లీ మహిళా కమిషన్ అధినేత్రి స్వాతి మలివాల్ ప్రకటించారు.

"దిల్లీలోని షహబాద్ డెయిరీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి, ఆపై రాయితో చితకబాదారు. దిల్లీలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం" అని స్వాతి ట్విట్టర్‌లో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)