ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1.బాస్మతికి ఆ సువాసన ఎలా వస్తుంది?
పూల నుంచి సువాసన రావడం తెలుసు. కానీ అన్నం నుంచి సుగంధ పరిమళం వస్తే..!
అలాంటి అన్నాన్ని అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. పొడవైన మెతుకులు, ముత్యాల మాదిరి మెరిసిపోతున్నాయి. ముట్టుకుంటే మల్లెపువ్వంత మెత్తగా ఉన్నాయి. వాటి నుంచి సెంట్ కొట్టినట్లు మంచి వాసన వస్తోంది.
ఆ వాసనకు ఆకలి మరింత పెరిగింది. ముద్దముద్దకు మనసు మురిసిపోయింది. నేను తొలిసారి బిర్యానీ తిన్నప్పుడు కలిగిన అనుభవం అది. బాస్మతి అనే పేరును విన్నది కూడా అప్పుడే. బిర్యానీతో ప్రేమలో పడిపోయింది కూడా అప్పుడే.
ఇంతకూ బాస్మతికి ఇంతటి సువాసన ఎలా వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సువాసన వచ్చే బియ్యపు రకాలు చాలా ఉన్నా దీన్ని మాత్రమే ''క్వీన్ ఆఫ్ అరోమాటిక్ రైస్'' అని ఎందుకు అంటారు?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC
2.షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి కావడం కష్టం, ఎందుకంటే..
బిహార్‌లోని సుపౌల్‌కు చెందిన షామా, పెళ్లి పాటలు వింటున్నప్పుడల్లా నిరాశకు గురవుతుంటారు.
ఇంకా పెళ్లి కాకపోవడమే 27 ఏళ్ల షామా నిస్పృహకు కారణం. పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆమె నిర్ణయం కాదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఉండాల్సి వచ్చింది.
షామా సోదరి సకీనా ఖాతూన్‌కు కూడా పెళ్లి కాలేదు. ఆమె వయస్సు 26 ఏళ్లు.
ఈ కథ కేవలం షామా, సకీనాలది మాత్రమే కాదు.
సుపౌల్ బ్లాక్ , కొచ్‌గామా పంచాయతీ 10వ వార్డులోని దాదాపు 15 మంది యువతుల కథ ఇది. వారంతా పెళ్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
3.మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
రెండు శాస్త్రీయ పరిశోధనలు మానవుల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చివేశాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు.
ఒకటి, భూమి విశ్వానికి కేంద్రం కాదు అన్నది. రెండవది, భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయినా, మనిషి పుట్టుక కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జరిగిందన్నది.
మానవులు లేకుండానే ఈ విశ్వం ఉనికిలో ఉంది. మనమే ఆలస్యంగా కళ్లు తెరిచాం.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవ శరీరాకృతి "రూపకల్పన" సరిగ్గా జరగలేదు. ప్రకృతి చేసిన డిజైన్‌లోనే చాలా లోపాలున్నాయి.
మన శరీర నిర్మాణం ఎంత పేలవంగా జరిగిందో చెప్పడానికి మంచి ఉదాహరణ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ.
అంత సున్నితమైన అవయవం అలా బయటకు కనిపించేలా ఉండడం తెలివైన నిర్మాణంగా తోచదు. గుండె, ఊపిరితిత్తుల్లా చర్మం లోపల భద్రంగా ఉంటే బాగుండేది.
పూర్తి కథనం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Eve family
4.ఆమె ముగ్గురు నాన్నల కూతురు...థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా పుట్టానని ఈవ్ విలీకి 16 సంవత్సరాల వయసులో తెలిసింది.
అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఈవ్‌కి ఇది ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ తర్వాత తన అసలు తండ్రి ఎవరనే ఉత్సుకతతో పాటు, ఆమె కొన్ని షాకింగ్ నిజాలను తెలుసుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి ఈవ్‌ను పెంచిన తండ్రి ఆమెకు 7 సంవత్సరాల వయస్సులో ఉండగా గుండె జబ్బుతో మరణించారు.
అనంతరం ఈవ్ తన స్పెర్మ్ డోనర్ బయోలాజికల్ తండ్రిని కలిశారు. ఆమె ఆ వ్యక్తిని నాన్న అని పిలవడం కూడా మొదలుపెట్టారు.
అంతేకాదు ఆమె తన వివాహంలో ఆయనకు తండ్రి గౌరవాన్ని కూడా ఇచ్చారు. కానీ ఈవ్ కొడుకు అనారోగ్యం పాలవడంతో కథ మరో మలుపు తిరిగింది. ఈవ్ తండ్రిగా మరో పేరు తెరమీదకి వచ్చింది.
ఈవ్ పుట్టినప్పుడు జరిగిన విచిత్రమైన డ్రామా అది. బీబీసీ అవుట్‌లుక్ ద్వారా తన కథను ఈవ్ విలే అందరితో పంచుకున్నారు.
పూర్తి కథనం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, ANI
5. చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటి?
నిలకడైన ఆటకి నిలువెత్తు చిరునామా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). మనం పొద్దున్న లేచి ఆఫీసు కెళ్ళినంత మామూలుగా ఈ టీమ్ దాదాపుగా ప్రతి సారీ ఐపీఎల్ ఫైనల్‌కి వెళ్తూ ఉంటుంది.
పద్నాలుగు సీజన్లలో పది సార్లు ఫైనల్‌కి చేరడం - బహుశా ఇంత మంచి రికార్డు మరే ఇతర జట్టుకు, క్రికెట్‌లోనే కాదు వేరే క్రీడల్లో కూడా ఉండదేమో.
ఆ మిగతా నాలుగు సీజన్లలో కూడా రెండు సార్లు ప్లేఆఫ్స్ దాకా చెన్నై రాగలిగింది.
సీఎస్‌కే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే, ముంబై ఇండియన్స్ వారి కన్నా ఒకటి ఎక్కువగా ఐదు టైటిల్స్ సాధించారు.
కానీ పదహారు సీజన్లలో ముంబై జట్టు ఆరు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది. ప్లేఆఫ్స్‌కు కూడా పదిసార్లు మాత్రమే క్వాలిఫై అయింది.
పూర్తి కథనం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








