చికెన్ మంచూరియా భారత్‌దా, పాకిస్తాన్‌దా?

ఫొటో సోర్స్, Getty Images
సమోసా తయారు చేసే విధానం భారత్‌దా లేదా పాకిస్తాన్‌దా?
బిర్యానీ చేసింది తొలుత తెలంగాణలోని హైదరాబాద్‌లోనా లేదంటే పాకిస్తానీ నగరం కరాచిలోనా?
ఈ ప్రశ్నలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆహారం నుంచి క్రికెట్ వరకు ప్రతి విషయంలో సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ యూజర్ల మధ్య డిబేట్లు జరిగేలా కనిపిస్తోంది.
ప్రస్తుతం చైనీస్ డిష్ అయిన ‘మంచూరియా’ దేశీ వెర్షన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.
మీరెప్పుడైనా చికెన్ మంచూరియా తిన్నారా? తినేటప్పుడు ఈ వంటకాన్ని మొదట ఎక్కడ వండారన్నది ఆలోచించారా?
భారతీయ నగరాల్లోని వీధుల్లో, పెద్ద పెద్ద రెస్టారెంట్లన్నింట్లో ఈ డిష్ దొరుకుతుంది కాబట్టి, తొలిసారి ఈ వంటకాన్ని ఒక భారతీయ చెఫ్ వండించి ఉండొచ్చని మీరు అనుకొని ఉండొచ్చు.
పాకిస్తానీ యూజర్లు మాత్రం ఈ డిష్ లాహోర్‌లో పుట్టిందని చెబుతున్నారు.
పాకిస్తానీ యూజర్ల వాదనను భారతీయ యూజర్లు కొట్టిపారేస్తున్నారు.

ఫొటో సోర్స్, THE NEW YORK TIMES / TWITTER
ఈ చర్చ ఎందుకొచ్చింది?
చికెన్ మంచూరియా తయారీపై అమెరికన్ వార్తాపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ఇటీవల ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
‘‘ఇది చైనీస్, పాకిస్తానీ ఆహారాల మిశ్రమం. చికెన్ మంచూరియా, దక్షిణాసియాలోని చైనీస్ రెస్టారెంట్లలో చాలా పాపులర్’’ అని చెప్పింది.
1990ల్లో చివరి రోజుల్లో పాకిస్తానీ నగరం లాహోర్‌లో ‘సన్ క్వాంగ్’ అనే రెస్టారెంట్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత చికెన్ మంచూరియా వచ్చిందంటూ ఈ వంటక విధానాన్ని పాకిస్తానీ రచయిత జైనాబ్ షా ఆ పత్రికలోరాశారు. పాకిస్తాన్‌తో ఈ వంటకాన్ని అనుసంధానించడం చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు.
దీంతో ‘న్యూయార్క్ టైమ్స్’ ట్విటర్‌లో చర్చ జోరుగా సాగుతోంది.
పాకిస్తానీ చైనీస్ ఫుడ్ లాంటి చైనీస్ ఫుడ్ ప్రపంచంలో అందుబాటులో లేదని జోయా తారిఖ్ చెప్పారు. పాకిస్తాన్‌లో నివసించే చైనా పౌరులు కూడా దీన్ని అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ZOIATARIQ@
దీనిపై నయనికా అనే భారతీయ యూజర్ స్పందిస్తూ- నెల్సన్ వాంగ్ అనే భారతీయ చైనా చెఫ్ ఈ వంటకాన్ని మొదలుపెట్టారని తన ట్విటర్ ఖాతాలో రాశారు. ఆయన కోల్‌కతాలో పుట్టారని, ముంబయిలోని రెస్టారెంట్లలో పనిచేశారని చెప్పారు. ఇది భారతీయ చైనీస్ వంటకమని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, NAYANIKAAA@
వ్యాస రచయిత పాకిస్తానీ అయినంత మాత్రాన ఈ వంటకం పాకిస్తానీది అయిపోదంటూ ‘న్యూయార్క్ టైమ్స్’పై మనీష్ అనే యూజర్ మండిపడ్డారు.
ఇది న్యూయార్క్ టైమ్సా లేక కరాచీ టైమ్సా అని ప్రశ్నిస్తూ మరో యూజర్ కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, OUR_LEVODOPA@
ఇలాంటి విషయాలపై భారతీయులకు ఎందుకింత అభద్రతా భావమని గుఫ్రాన్ ఖాలిద్ అనే యూజర్ ప్రశ్నించారు.
దీనిపై ఒక భారతీయ యూజర్ గట్టిగా స్పందించారు.
‘‘మా ఆహారానిది మా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. మా ఆహారం విషయంలో మేం చాలా గర్వపడతాం. క్రికెట్ కంటే కూడా, మతం కంటే కూడా ఎక్కువగానే. అందుకే బీఫ్ కోసం ప్రజలు చంపుకునే దాకా వెళ్తారు. అంతేకాక, భారతీయులకు తమ ఆహారాన్ని ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు’’ అని చెప్పారు.
మరో యూజర్ అందరికీ భిన్నంగా స్పందించారు. చికెన్ మంచూరియా గురించి కామెంట్ సెక్షన్‌లో స్పందిస్తున్న ప్రతి ఒక్కరి వాదనా తప్పేనని, ఈ వంటకాన్ని తమ తల్లి మొదలుపెట్టారని చెప్పారు.

ఫొటో సోర్స్, SADIAESTER@
‘న్యూయార్క్ టైమ్స్’ ట్వీట్‌పై ట్విటర్‌లో ఇంత వివాదం రేగిన తర్వాత, చికెన్ మంచూరియా పాకిస్తాన్‌లో పుట్టిందని ఎక్కడా చెప్పలేదని అయ్నాన్ చెప్పారు.
‘‘స్నేహితులారా! మీరు బాగున్నారా? ఇక ఇప్పుడు చికెన్ మంచూరియాపై ఫైట్ చేయండి?’’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
ఈ కథనం న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చే వరకు, చికెన్ మంచూరియా భారత్‌లో పుట్టిందా, లేదా పాకిస్తాన్‌లో మొదలైందా అనే దానిపై ఎప్పుడూ కూడా చర్చ జరగలేదు. దీనిపై ప్రస్తుతం గొడవ పడుతున్న భారత్, పాకిస్తాన్ దేశాల యూజర్లు చివరికి ఎలాంటి ముగింపుకూ రాలేదు.
ఇలాంటి అగ్గిని న్యూయార్క్ టైమ్స్ రాజేయాలి, ఇది చాలా ఫన్‌గా ఉందంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








