ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

చార్లీ చాప్లిన్ దర్శకత్వం వహించి, నటించిన 1931 నాటి ''సిటీ లైట్స్'' చిత్రానికి చెందిన ప్రమోషనల్ పోస్టర్

ఫొటో సోర్స్, Getty Images

1. చార్లీ చాప్లిన్ శవపేటిక‌ను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?

జీవితంలోని కఠినమైన సవాళ్లను, విషాదాలను హాస్యరూపంలో తెరపైకి ఎక్కించి.. సినిమా అనే వినోద మాధ్యమాన్ని ఒక కళగా మలచిన గొప్ప నట దర్శక నిర్మాత చార్లీ చాప్లిన్.

ఆయన 45 ఏళ్ల కిందట కన్నుమూశారు. 1977 డిసెంబర్ 25న ప్రపంచం ఈయనకు కన్నీటి వీడ్కోలు చెప్పింది.

ఆయన చనిపోయాక.. ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రల్లాగా ఓ ఇద్దరు దొంగలు ఆయన శవాన్ని ఎత్తుకుపోయి, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ కథను ప్రపంచం దాదాపుగా మర్చిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అమ్మ ఒడి

ఫొటో సోర్స్, Mary Evans Picture Library

2. అమ్మ ఒడి: పిల్లలను బడికి పంపి రూ.15 వేలు పొందడం ఎలా?

ఇంట్లో బ‌డి ఈడుకొచ్చిన బిడ్డ ఉంటే, ఆ బిడ్డ‌ను ద‌గ్గ‌ర్లోని బ‌డిలో చేర్చితే చాలు, ఆ బిడ్డ త‌ల్లికి బ్యాంకు ఖాతాలో ఏటా 15వేల రూపాయ‌ల డ‌బ్బు జ‌మ చేసే ప‌థ‌కం ఆంధ్రప్రదేశ్‌లో అమ‌ల‌వుతోంద‌ని మీకు తెలుసా?

ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో దాదాపు 43 ల‌క్ష‌ల మందికిపైగా పేద విద్యార్థులు ల‌బ్ధి పొందుతున్నారు.

ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌భుత్వం రూ.6,455 కోట్లు కేటాయించి విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో సొమ్ము జ‌త చేస్తోంది.

అస‌లు అమ్మ ఒడి ప‌థ‌కం అంటే ఏమిటి? ల‌బ్ధిదారుల‌ను ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తారు? త‌దిత‌ర వివరాల‌ను పూర్తీగా తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పీలే భారత్‌లో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఎందుకు వివాదంగా మారింది?

ఫొటో సోర్స్, SATYEN SEN

3. పీలే భారత్‌లో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఎందుకు వివాదంగా మారింది?

''మిస్టర్ పీలే, యువర్ ఎక్సలెన్సీ అని పిలిపించుకోవడం మీకు ఇష్టమా?'' అని కోల్‌కతాలోని ఒక విలేఖరి బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను అడిగారు.

ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు పీలే మూడు రోజుల ఇండియా పర్యటనకు వచ్చారు.

స్టార్‌ ఆటగాళ్లున్న ఆయన జట్టు న్యూయార్క్ కాస్మోస్‌, బెంగాల్‌ స్థానిక క్లబ్ మోహన్ బగాన్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.

మోహన్ బగాన్‌ ఆసియాలోని పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటి.

విలేఖరి ప్రశ్నకు 37 ఏళ్ల బ్రెజిలియన్ స్టార్ పగలబడి నవ్వారని మ్యాచ్‌కు ఒకరోజు ముందు అంటే 1977 సెప్టెంబర్ 24న 'ది హిందుస్తాన్ స్టాండర్డ్ వార్తాపత్రిక రాసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తల్లితో ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

4. మోదీ ప్రధాని అవుతారని హీరాబెన్ 2002లోనే చెప్పారా?

తల్లి మరణం తర్వాత ప్రధాని మోదీ ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ ఏడాది ఆమె పుట్టిన రోజున తాను కలిసినప్పుడు ఆమె తనకొక విషయం చెప్పారని మోదీ అన్నారు.

''విజ్ఞతతో పనిచెయ్యి, స్వచ్ఛతతో జీవించు'' అని తల్లి తనకు చెప్పారని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని తల్లి హీరాబెన్‌ను అనేకమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేశారు.

జర్నలిస్టు భార్గవ్ పరేఖ్‌కు 2002లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ''ఏదో ఒక రోజు అతను ప్రధాన మంత్రి అవుతాడు'' అని ఆమె తన కొడుకు గురించి చెప్పారు.

హీరాబెన్‌ను ఇంటర్వ్యూ చేసిన వారిలో గుజరాత్‌కు చెందిన జర్నలిస్టు దేవాసి బరాద్ కూడా ఒకరు.

2007లో ఆయన హీరాబెన్‌ను ఇంటర్వ్యూ చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని కావాలన్నది తన కల అని హీరాబెన్ తనతో చెప్పినట్లు దేవాసీ బరద్ వెల్లడించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

విమానం

ఫొటో సోర్స్, JAICO PUBLICATION

5.చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది..?

జవహర్ లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో 1955 ఏప్రిల్‌లో ఇండోనేసియాలోని బాండుంగ్ నగరంలో ఆఫ్రో-ఆసియా కాన్ఫరెన్స్ జరిగింది.

తన ప్రతినిధుల కోసం 'కశ్మీర్ ప్రిన్సెస్' అని పిలిచే ఎయిరిండియా విమానాన్ని చైనా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అందులో ప్రయాణించే వారిలో చైనా ప్రధాని చు ఎన్ లై కూడా ఉన్నారు.

1955 ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12.15 గంటలకు బ్యాంకాక్ నుంచి హాంకాంగ్‌లోని కాయి టక్ విమానాశ్రయానికి ఎయిరిండియా విమానం చేరుకుంది. ఫ్లైట్ ఇంజినీర్ ఏఎన్ కార్నిక్ పర్యవేక్షణలో ఆ విమానాన్ని శుభ్రం చేశారు.

గ్రౌండ్ స్టాఫ్ ద్వారా విషయం తెలుసుకున్న కొ-పైలెట్ గొడ్బొలే, 'ఈరోజు చైనా ప్రధానిని చూసే అవకాశం మనకు వస్తుంది' అని అన్నారు.

చైనా వ్యతిరేక తైవాన్ ఏజెంట్లు హాంకాంగ్‌లో ఉన్నందున తమ ప్రధాని అక్కడి నుంచి విమానంలో ప్రయాణిస్తున్నారనే వార్తను బయటకు రాకుండా చైనా చర్యలు తీసుకుంది. అయినా వార్త బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)