హీరాబెన్: నరేంద్ర మోదీ తల్లి కన్నుమూత, అంత్యక్రియలలో పాడె మోసిన ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతిచెందారు.
ఈ నెల 28న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు.
తల్లి ఆసుపత్రిలో చేరిన తరువాత ప్రధాని మోదీ వెంటనే అహ్మదాబాద్ వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. కోలుకుంటున్నారని గురువారం అక్కడి వైద్యులు వెల్లడించారు.
అయితే, వృద్ధాప్యం కారణంగా మళ్లీ ఆరోగ్యం విషమించి శుక్రవారం ఉదయం ఆమె మృతి చెందారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తల్లి మరణించిన సమాచారాన్ని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కొద్దినెలల కిందట ఆమె పుట్టిన రోజు సమయంలో కలిసినప్పుడు ‘స్వచ్ఛమైన జీవితం గడుపు’ అని నాకు చెప్పారు.. అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.
‘అమ్మ నూరేళ్ల జీవితం పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. అమ్మలో నేను ఎల్లప్పుడూ త్రిమూర్తి అనుభూతిని పొందాను. ఒక తపస్విలాంటి జీవనయానం ఆమెది, నిష్కామ కర్మయోగికి ప్రతీక ఆమె, విలువలకు కట్టుబడిన జీవితం ఆమెది’ అంటూ తల్లి గొప్పతనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రధాని తల్లి మరణంపై రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతి చాలా బాధాకరం. ఎవరి జీవితంలోనైనా తల్లి మరణమనేది అంతులేని వేదనను కలిగిస్తుంది. ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఈ వేదనాభరిత సమయంలో ప్రధాని మోదీకి, ఆయన కుటుంబసభ్యలకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ట్వీట్‌లో ‘మోదీ తల్లి హీరాబెన్ మరణం అత్యంత బాధాకరం. ఏ వ్యక్తి జీవితంలోనైనా తొలి మైత్రి అమ్మతోనే ఉంటుంది, తొలి గురువు అమ్మే. అమ్మను కోల్పోవడం కంటే దుఃఖం ఇంకేదీ ఉండదు’ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. దేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు, దేశంలోని ఇతర పార్టీలకు చెందిన నేతలు మోదీ తల్లి మృతిపై సంతాపం తెలిపారు.
రాజకీయేతర రంగాలకు చెందిన ప్రముఖులూ ప్రధాని తల్లి మరణంపై తమ సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, facebook/kcr
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
ప్రధాని తల్లి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సంతాపం ప్రకటించారు.
హీరాబెన్ మరణం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
హీరా బెన్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీ తల్లి మృతిపై సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రా సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరికొందరు కూడా ప్రధాని తల్లి మరణంపై తమ సంతాపం తెలిపారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
తల్లి 100వ పుట్టిన రోజున మోదీ ఏం చెప్పారంటే..
ఈ ఏడాది జూన్ 18న హీరాబెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా నరేంద్ర మోదీ తల్లి గురించి అనేక విషయాలు తన బ్లాగులో పంచుకున్నారు.
నరేంద్ర మోదీ తన బ్లాగులో తల్లి గురించి ఇలా రాశారు...‘ఈ ఏడాది జూన్ 18న ఆమె 100వ పడిలోకి అడుగుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది.తన చుట్టూ ఉండే వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకునేది.మా ఇల్లు చిన్నదే కావొచ్చు. కానీ మా అమ్మ మనసు చాలా పెద్దది.మా పక్క ఊర్లో నాన్న స్నేహితుడు ఒకరు ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు... పేరు అబ్బాస్.నాన్న స్నేహితుడు చనిపోవడంతో అబ్బాస్‌ను నాన్న మా ఇంటికి తీసుకొచ్చారు.మా అందరి మాదిరిగానే అబ్బాస్‌ను కూడా ఎంతో ప్రేమతో అమ్మ పెంచింది.ఈద్ రోజున అబ్బాస్‌కు నచ్చినవి చేసేది’ అంటూ అమ్మ గురించి మోదీ అప్పట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అంతా ఆమె చలవే’
‘నాలోని మంచి అంతా అమ్మ, నాన్న నుంచి వచ్చిందే. అమ్మ సామాన్యురాలే కావొచ్చు. కానీ ఆమె చాలా శక్తిమంతురాలు. అమ్మ అంటే వ్యక్తి కాదు. ఆమె దేవుని మాదిరి ఒక రూపం.గుజరాత్‌లోని మెహసనా జిల్లాలో గల విస్నానగర్‌లో అమ్మ పుట్టింది.
ఆమె పుట్టిన కొద్ది రోజులకు మా అమ్మమ్మ చనిపోయింది. అమ్మ చిన్నతనమంతా తల్లి లేకుండానే గడిచింది. తన తల్లి ఒడిలో తల పెట్టుకునే అదృష్టానికి అమ్మ నోచుకోలేదు.అమ్మకు ఉత్తరాలు అంటే ఏంటో తెలియదు.
కనీసం స్కూలు గేటును కూడా ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమె చూసిందల్లా ఇంట్లో కనిపించే పేదరికమే.అమ్మ ఇంట్లో అందరికంటే పెద్దది. పెళ్లి అయిన తరువాత పెద్ద కోడలు అయింది.
వాద్నానగర్‌లో మేం ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉండేది. ఆ ఇంటికి ఒక్క కిటికీ కూడా ఉండేది కాదు. బాత్రూం, టాయిలెట్లు లేవు’ అంటూ తన తల్లి జీవితం గురించి మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI
‘ఇప్పటికీ చిన్నపిల్లాడిలా నాకు స్వీట్ తినిపించి మూతి తుడిచేది’
‘మట్టితో కట్టిన గోడల మీద పెంకులతో ఉండే ఆ ఒకటిన్నర గదుల ఇంట్లో అమ్మనాన్నతో మా అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఉండేవారు.
ఆ చిన్న ఇంట్లోనే ఒక గోడకు వెదురు కర్రలతో మంచెలాగా నాన్న కడితే, అది ఎక్కి అమ్మ వంట చేసేది.
నాన్న తెల్లవారు జామున నాలుగు గంటలకే పనికి వెళ్లేవాడు.
అమ్మ కూడా అదే సమయంలో నిద్ర లేచేది.ఇంటిని నడిపేందుకు ఇతరుల ఇళ్లలో అమ్మ పని చేసేది.
పత్తి విత్తనాలు తీయడం, పత్తి ఒడకడం వంటి పనులు చేసేది మా అమ్మ.
నేను ఇంటికి వస్తే ఇప్పుడు కూడా స్వీట్లు తినిపిస్తుంది.
చిన్న పిల్లాడికి తుడిచినట్లు మూతి తుడుస్తుంది.
గుజరాతీలో ‘నువ్వు’ అనాలంటే ‘తు’ అంటారు. ‘మీరు’ అనాలంటే ‘తమే’ అని పిలుస్తారు. నేను ఇంటి దగ్గర ఉన్నంత కాలం నన్ను అమ్మ, ‘తు’ అనే పిలిచేది. కానీ నేను ఇల్లు విడిచి వెళ్లిపోయిన తరువాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత అమ్మ పిలుపు మారింది.
ఇప్పుడు నన్ను ‘తు’ అని పిలవడం లేదు. ‘తమే’ అని మాత్రమే పిలుస్తోంది.’ అని మోదీ బ్లాగులో రాశారు.
ఇవి కూడా చదవండి:
- కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
- ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే
- ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)