బాపట్లలో 16వ నంబర్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన యుద్ధ విమానాలు, ఎందుకంటే...

వీడియో క్యాప్షన్, బాపట్లలో 16వ నంబర్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన యుద్ధ విమానాలు, ఎందుకంటే...
బాపట్లలో 16వ నంబర్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన యుద్ధ విమానాలు, ఎందుకంటే...

ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 16వ నంబరు జాతీయ రహదారిపై విమానాలను ల్యాండ్ చేసే ట్రయల్ రన్ నిర్వహించారు.

బాపట్ల జిల్లా పౌర సంబంధాల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం నాలుగు యుద్ధ విమానాలు, ఒక ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌ ఈ ట్రయల్ రన్‌లో పాల్గొన్నాయి.

విమానాలు జాతీయ రహదారిపై దిగడానికి సాధ్యాసాధ్యాలను వాయుసేన అధికారులు పరిశీలించారు.

బాపట్ల

సుమారు ఐదు అడుగుల ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టాయి.

ఈ ట్రయల్ రన్ విజయవంతం అయిందని అధికారులు చెప్పారు. అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం ఈ ఎయిర్‌స్ట్రిప్‌లను ఉపయోగించవచ్చని తెలిపారు.

దేశంలోని 20 ప్రాంతాల్లో జాతీయ రహదార్లపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలను కేంద్రం నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు ప్రారంభం కాగా మూడోది బాపట్ల జిల్లాలో పూర్తయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)