అమెరికాలో గన్ కల్చర్‌ను ఎందుకు ఆపలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో 2023 జనవరి మూడో వారంలో రెండుసార్లు జరిగిన కాల్పుల ఘటనల్లో 18 మంది చనిపోయారు.
కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ జరుగుతుంటుంది.
దాదాపు 50 ఏళ్ళ కిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ "అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి. మన దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణం'' అన్నారు.
ఆ సమయంలో, అమెరికాలో దాదాపు 9 కోట్ల తుపాకులు ఉన్నాయి. కానీ నేడు, 50 సంవత్సరాల తరువాత, అక్కడ అంతకన్నా ఎక్కువ తుపాకులు ఉన్నాయి, అలాగే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
మంగళవారం రాత్రి టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ సాయుధుడు 19 మంది చిన్నారులతో సహా 21 మందిని కాల్చిచంపాడు. తుపాకులు, మారణాయుధాలతో అమెరికాలో సామూహిక హత్యలు తరచూ జరుగుతున్నాయి.
ఈ ఒక్క ఏడాదే అమెరికాలోని పాఠశాలల్లో 27 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా ఘటనకు 10 రోజుల కిందట న్యూయార్క్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు.
అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఎన్ని తుపాకులు ఉన్నాయి?
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తుపాకులు ఉన్నాయో చెప్పడం కష్టం. కానీ స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రసిద్ధ పరిశోధనా సంస్థ స్మాల్ ఆర్మ్స్ సర్వే అనే అధ్యయనంలో, 2018 లో ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని అంచనా వేసింది.అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు 120.5 ఆయుధాలు ఉన్నాయి. కాగా, 2011లో ఈ సంఖ్య 88కి తగ్గింది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ప్రజల వద్ద ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి.గత కొన్నేళ్లుగా అమెరికాలో తుపాకీ యజమానుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఇటీవల వచ్చిన గణాంకాలు కూడా సూచిస్తున్నాయి.
ఒక నివేదిక ప్రకారం, జనవరి 2019, ఏప్రిల్ 2021 మధ్య, 7.5 మిలియన్ల అమెరికన్లు మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేశారు.అంటే అమెరికాలో మరో కోటి మంది తమ ఇళ్లకు తుపాకులను తెచ్చుకున్నారు. పొందారు, అందులో 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. తుపాకులు కొనుగోలు చేసిన వారిలో సగం మంది మహిళలే.గత సంవత్సరం మరొక నివేదికలో, కరోనా మహమ్మారి సమయంలో, తుపాకుల కారణంగా కాల్పులకు గురవుతున్న పిల్లల సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం గమనించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో తుపాకుల వల్ల ఎంతమంది చనిపోయారు?
1968 నుంచి 2017 మధ్య, అమెరికాలో తుపాకుల వల్ల సుమారు 15 లక్షలమంది మరణించారు. ఈ సంఖ్య 1775 స్వాతంత్ర్య యుద్ధం నుంచి అమెరికాలో జరిగిన ఏ యుద్ధంలో కూడా ఇంత మంది మరణించలేదు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, 2020లోనే అమెరికాలో 45,000 మందికి పైగా తుపాకుల కారణంగా మరణానికి గురయ్యారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి.
అమెరికాలో సామూహిక హత్యల గురించి ఎక్కువ చర్చ ఉన్నప్పటికీ, 2020 నాటి మరణాల్లో ఆత్యహత్యలు 24,300. అంటే, మొత్తం మరణాలలో 54% ఆత్మహత్యలే.
2016లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆత్మహత్యలకు ముఖ్యమైన కారణాలలో ఆయుధాలు కలిగి ఉండడం ప్రధానమైంది.

ఫొటో సోర్స్, Reuters
తుపాకులను ఎందుకు నియంత్రించడం లేదు?
అమెరికాకు ఇది రాజకీయ సమస్య అని చెప్పవచ్చు. ఈ చర్చలో ఒక వైపు ఆయుధాలపై నిషేధం గురించి మాట్లాడేవాళ్లు, మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధాలు ధరించే హక్కును కాపాడటం గురించి మాట్లాడేవాళ్లు ఉన్నారు.
తుపాకుల నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా అనే అంశంపై 2020లో అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో - కేవలం 52% మంది మాత్రమే దీనికి మద్దతు ఇవ్వగా, ప్రస్తుత చట్టాలలో ఎటువంటి మార్పు అవసరం లేదని 35% మంది అభిప్రాయపడ్డారు.
11% మంది ప్రజలు అమలులో ఉన్న చట్టాలను మరింత సులభతరం చేయాలని కోరారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారిలో 91% మంది చట్టాన్ని కఠినతరం చేయడానికి దాదాపు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారని కూడా ఈ సర్వేలో గుర్తించారు.
అదే సమయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిలో 24% మంది మాత్రమే చట్టాలను కఠినం చేయడానికి అనుకూలంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తుపాకుల నియంత్రణను ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) అమెరికాలో తుపాకులకు మద్దతు ఇచ్చే పెద్ద లాబీ. వారి వద్ద భారీ ఎత్తున డబ్బు ఉంది. దీని సాయంతో వారు అమెరికన్ పార్లమెంటు సభ్యులను ప్రభావితం చేయగలరు.
గతంలో జరిగిన అనేక ఎన్నికలలో ఎన్ఆర్ఏ, ఇతర సంస్థలు తుపాకీ నిషేధాన్ని కోరే గ్రూపులకంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసి మద్ధతు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
- ‘మంటలు ఆర్పడానికి వెళ్తే మా అగ్నిమాపక వాహనాలనూ తగలబెడతామని బెదిరించారు’
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













