వీడియో గేమ్‌లు టెర్రరిస్టులకు ఆయుధాలుగా మారుతున్నాయా

- రచయిత, కార్ల్ మిల్లర్, షిరోమా సిల్వ
- హోదా, బీబీసీ క్లిక్
విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రవాదులు మెయిన్ స్ట్రీమ్ వీడియో గేమింగ్ చాట్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నట్లు బీబీసీ క్లిక్ గుర్తించింది. డీలైవ్, ఒడీసీలాంటి ప్లాట్‌ఫామ్‌లు సహా కొన్ని వీడియో గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఇవి జరుగుతున్నట్లు తేలింది.
యూదు వ్యతిరేక, జాత్యహంకారానికి సంబంధించిన అనేక చాటింగ్‌లు గత మూడు నెలలుగా సాగినట్లు పరిశోధకులు గుర్తించారు.
రోజువారీ సంభాషణల మధ్య తీవ్రవాదానికి సంబంధించిన విషయాలను చేర్చడం ద్వారా టెర్రరిస్టు కార్యక్రమాలకు ప్రచారం కల్పించవచ్చని కొందరు భావిస్తున్నట్లు తేలింది.
తర్వాత ఈ సంభాషణలు టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల వరకు వెళతాయి.
"మీరు ఆ ప్రపంచంలో ఒక్కసారి అడుగు పెడితే, మిమ్మల్ని టెర్రరిస్టులుగా మార్చాలనే ప్రయత్నం మొదలవుతుంది" అని ఫాసిస్ట్ వ్యతిరేక ‘హోప్ నాట్ హేట్‘ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన జో ముల్‌హాల్ అన్నారు.
"ఇక మీరు వీడియో గేమ్‌లు కాకుండా చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అయినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెడతారు'' అన్నారాయన.
''ఇలాంటివి అడ్డుకోవడానికి మేం వివిధ రకాల చర్యలను తీసుకుంటున్నాం. పలు టూల్స్ ఉపయోగిస్తున్నాం'' అని టెలిగ్రామ్ యాప్ సంస్థ ప్రతినిధి బీబీసీతో అన్నారు.
ఈ వ్యవహారంపై డీలైవ్, ఒడెసీ సంస్థలను బీబీసీ సంప్రదించగా, వారు మాట్లాడటానికి సుముఖత చూపలేదు

గేమింగ్ కంపెనీలు ఏం చేస్తున్నాయి?
అయితే, వారి విధానాలు మాత్రం ద్వేషం, హింస, తీవ్రవాదానికి వ్యతిరేకమని, తమ మార్గదర్శకాలను ఉల్లంఘించే వారెవరి కంటెంట్‌నైనా తీసి వేస్తామని పేర్కొంటున్నాయి.
''మా జాత్యహంకార నిరోధక చర్యల్లో రేసిజాన్ని తలపించేలా ఉన్న పేర్లను, అలాంటి వ్యాఖ్యలు చేసే ఆటగాళ్లను నిషేధించడంతోపాటు, వీడియో గేముల్లో అభ్యంతరకర ప్రవర్తనను ఎప్పటికప్పుడు గుర్తించి నివేదించడానికి వీలుగా సాంకేతికతను వాడుతున్నాం'' అని కాల్ ఆఫ్ డ్యూటీ అనే వీడియో గేమింగ్ సంస్థ వెల్లడించింది.
కానీ పరిశోధకులు మాత్రం వివిధ ప్లాట్‌ఫారమ్‌లలోని గేమ్‌లలో తీవ్రవాద పాత్రలున్న దృశ్యాలను గుర్తించారు. పైగా ఇవి ఆటగాళ్లు తమకు కావలసిన ప్రదేశాలను, మ్యాప్‌లను తయారు చేసుకునేలా కస్టమైజేషన్‌కు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.

వీటిలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులు, వీగర్ నిర్బంధ కేంద్రాల్లాంటివి రాబ్లాక్స్, మైన్‌క్రాఫ్ట్ వంటి గేమ్‌లలో ఉన్నాయి.
రాబ్లాక్స్‌లోని ఒక డ్రైవింగ్ గేమ్ ఆటగాళ్లను జాత్యహంకారులుగా మారాలంటూ ఆహ్వానించింది. మైనారిటీ జాతికి చెందిన వారు కారులో పారిపోతున్నట్లు, వారిని ప్లేయర్‌లు వెంటాడి చంపినట్లు చూపిస్తుంది.
" ఇవి చిన్నవే. ఎక్కువమంది ఆడేవి కూడా కావు. కానీ, ఇందులో వారు ఆటగాళ్లను నిజమైన తీవ్రవాదులనే అనుభూతి కలిగించేలా చేస్తారు. ఒకవిధంగా ఆన్‌లైన్‌లో రాడికలైజ్డ్ ఫాంటసీలను సృష్టించడమే" అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ డైలాగ్ కు చెందిన జాకబ్ డేవి అన్నారు.
"మా ప్లాట్‌ఫాం సురక్షితమైన, పౌర ప్రదేశంగా ఉండేలా మేం నిరంతరం పని చేస్తున్నాం. అనుచితమైన కంటెంట్‌ను గుర్తించడానికి 2000మంది మోడరేటర్‌ల బృందం 24గంటలు పని చేస్తుంటుంది'' అని రాబ్లాక్స్ కంపెనీ వెల్లడించింది.

"మా కమ్యూనిటీ ప్రమాణాల ప్రకారం తీవ్రవాద లేదా హింసాత్మక కంటెంట్ పై ఖచ్చితమైన నిషేధం ఉంది. మా సిస్టమ్‌లలో అలాంటి కంటెంట్ కనిపిస్తే దాన్ని తొలగించడానికి మేము సిద్ధం" అని మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమింగ్ సంస్థ వెల్లడించింది.
అయితే, సోషల్ మీడియా మీద నిఘా పెరిగిన తర్వాత తీవ్రవాద సంస్థలు గేమింగ్‌వైపు మొగ్గు చూపవచ్చని పరిశోధకులు అంటున్నారు.
''రైట్ వింగ్ భావజాలం ఉన్న సంస్థలకు తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్‌లాంటివి సురక్షితంగా ఉండేవి'' అని డేవి అన్నారు.
"ఆన్‌లైన్ గేమింగ్ ఒకే అభిరుచిగల వారిని ఒకచోట చేరుస్తుంది. ఇందులో తీవ్రవాదులు కూడా ఉన్నారు'' అన్నారాయన.
''వారు ఒకే రకం మనస్తత్వం గల వ్యక్తులతో కనెక్ట్ కావడానికి, సోషలైజ్ అయ్యేందుకు ఇది ఒక మార్గం. అయితే తీవ్రవాద భావజాలాన్ని ప్రసారం చేయడంలో ఇది కీలకమైందిగా మారింది'' అని డేవీ వ్యాఖ్యానించారు.
ఈ ఆన్‌లైన్ గేమింగ్‌లో తీవ్రవాద కార్యకలాపాలను నివారించడంలో రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ పని చేస్తోంది.
''నిఘా తక్కువగా ఉండే ఆన్‌లైన్, చాట్ స్పేస్‌లలో తీవ్రవాదుల చొరబాటు పెరిగింది'' అని డిఫెన్స్ థింక్ ట్యాంక్‌కు చెందిన జెస్సికా వైట్ అన్నారు.

ఆటగాళ్లను రక్షించడం ఎలా?
గేమింగ్ స్పేస్‌ను కూడా తీవ్రవాదులు కబ్జా చేసే ప్రయత్నాలపై ప్రభుత్వం, గేమింగ్ పరిశ్రమ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.
"ఆటగాళ్ల సేఫ్టీ కోసం మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం'' అని యూకే గేమింగ్ ట్రేడ్ సంస్థ యూకీకి చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
''మేం ఎందుర్కొంటున్న సవాళ్లు ఇతర డిజిటల్ ఎంటర్‌టైన్ మెంట్ రూపంలో కూడా షేర్ అవుతాయని మాకు తెలుసు. అందుకే ఆటగాళ్ల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చిన్నారులకు ప్రాణాంతకంగా మారుతున్న మరో వైరస్
- మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలా?
- మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా? ఎవరేమంటున్నారు?
- గడ్డం గీయడాన్ని నిషేధించిన తాలిబాన్.. ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని ప్రకటన
- హిమాలయాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు?
- ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చైనా-అమెరికా-కెనడా సంబంధాలను ఎలా మార్చిందంటే..
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








