'ది సింప్సన్స్' సిరీస్‌లో నల్లజాతి పాత్రలకు తెల్లజాతి వారితో డబ్బింగ్‌కు స్వస్తి

ఫొటో సోర్స్, TCFFC
'ది సింప్సన్స్' కామెడీ కార్టూన్ సిరీస్ అమెరికాలో బాగా పాపులర్. అందులో వివిధ దేశాలు, జాతులకు సంబంధించిన పాత్రలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏ జాతి క్యారెక్టర్‌కైనా తెల్లజాతి నటులతోనే వాయిస్ చెప్పించింది ఆ సిరీస్ నిర్మాణ సంస్థ. ఇప్పుడది ఆ విధానానికి స్వస్తి పలకనుంది.
ఫాక్స్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే ఈ కార్టూన్ సిరీస్‌లో 'అపు' అనే ఇండియన్-అమెరికన్ పాత్రకు తెల్లజాతికి చెందిన హ్యాంక్ అజారియా ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పారు. అయితే ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నుంచి తాను తప్పుకుంటున్నానని ఈ ఏడాది ఆరంభంలోనే అజారియా ప్రకటించారు.
శ్వేత జాతియేతరులకు కూడా అవకాశాలు కల్పించాలని అమెరికాలోని వినోద పరిశ్రమపై ఇటీవల ఒత్తిడి పెరుగుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చెలరేగిన బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమంతో ఈ కార్యక్రమ రూపకర్తలపై కూడా ఈ తరహా ఒత్తిడి పడింది. దీంతో తాము ఇక ఏ జాతికి చెందిన వ్యక్తులకైనా తెల్లజాతి వ్యక్తితో డబ్బింగ్ చెప్పించే విధానాన్ని రద్దు చేసుకుంటామని శుక్రవారంనాడు ప్రకటించింది నిర్మాణ సంస్థ.
''ఇకపై 'ది సింప్సన్స్' లో నాన్-వైట్ క్యారెక్టర్లకు వైట్ ఆర్టిస్టుల వాయిస్ ఇకపై ఉండదు'' అని ఆ సంస్థ సంక్షిప్తంగా ఒక సందేశాన్ని విడుదల చేసింది. 1990లలో సృష్టించిన 'అపు' అనే ఇండియన్-అమెరికన్ క్యారెక్టర్‌కు తాను వాయిస్ చెప్పబోవడం లేదని ఈ ఏడాది జనవరిలోనే అజారియా ప్రకటించారు.
'' ఇది సమష్టి నిర్ణయం. ఇది సరైందేనని మేం బలంగా నమ్ముతున్నాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సిరీస్‌లోని పాత్రల చిత్రణలో జాతివివక్ష ఉందని ఆరోపణలు వినిపించాయి. 'లౌ' అనే బ్లాక్ పోలీస్ పాత్ర, బంబ్లీబీ మ్యాన్‌లాంటి మెక్సికన్-అమెరికన్ పాత్రల విషయంలో విపరీతమైన జాతివివక్ష నిజమేనని వాటికి డబ్బింగ్ చెబుతున్న అజారియా అంగీకరించారు. తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ పాత్రల చిత్రణపట్ల అసంతృప్తికి లోనయ్యానని అన్నారు అజారియా. 'అపు' పాత్రను గమనిస్తే ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు అజారియ.
'అపు' లేదా ఇతర పాత్రలు కొనసాగుతాయా లేక ఆపేస్తారా అన్న విషయాన్ని ఫాక్స్ న్యూస్ నెట్‌వర్క్ తన శుక్రవారంనాటి ప్రకటనలో వెల్లడించలేదు. మరోవైపు మైక్ హెన్రీ, క్రిస్టెన్ బెల్‌లాంటి వైట్ ఆర్టిస్టులు, తాము కూడా నాన్-వైట్ క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పబోమని ప్రకటించారు.
'ఫ్యామిలీ గఫ్'లో క్లీవ్‌లాండ్ బ్రౌన్ అనే పాత్రకు హెన్రీ అనే ఆర్టిస్టు గత 20 సంవత్సరాలుగా వాయిస్ అందిస్తున్నారు. ''ఈ పాత్ర నాకెంతో ఇష్టం. కానీ ఏ రంగు పాత్రకు ఆ రంగు ఆర్టిస్టే వాయిస్ చెప్పడమే మంచిది'' అని హెన్రీ ట్వీట్ చేశారు. 'సెంట్రల్ పార్క్' అనే సిరీస్‌లో 'మోలీ' అనే మిక్స్ డ్ రేస్ చిన్నారికి వాయిస్ చెబుతున్న బెల్ అనే ఆర్టిస్టు కూడా ''ఇలా చెప్పడం కచ్చితంగా అవగాహనా లోపమే'' అన్నారు. ''మిక్స్ డ్ రేస్ పాత్రకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టు మిక్స్ డ్ రేస్‌తోపాటు నల్లజాతి అమెరికన్ పాత్రలో లీనం కాలేకపోవచ్చు'' అని బెల్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల రూపాయలు ఆవిరి
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- అదన్నమాట : వేలంటైన్స్ డే
- సన్నీ లియోని సినిమా పేరుపై వివాదం
- జోకర్ సినిమాకు 11 ఆస్కార్ నామినేషన్లు
- జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








