ఎలాన్ మస్క్: ఒక్క ట్వీట్‌తో టెస్లా కంపెనీ విలువ లక్ష కోట్ల రూపాయలు ఆవిరి

ఫొటో సోర్స్, Getty Images
టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో.. ఆయన కార్ల కంపెనీ విలువ 1400 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1.05 లక్షలు) ఆవిరైపోయింది.
కంపెనీ షేర్ల ధర చాలా ఎక్కువగా ఉందని ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించటమే దీనికి కారణం. ఇన్వెస్టర్లు వెంటనే కంపెనీ నుంచి తప్పుకోవటంతో.. మస్క్ కంపెనీలోని తన సొంత వాటాలో కూడా 300 కోట్ల డాలర్లు పోగొట్టుకున్నారు.
తన ఆస్తులను అమ్మేస్తున్నట్లు చెప్తూ పలు ట్వీట్లు చేసిన మస్క్.. ‘‘టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువగా ఉంది’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరొక ట్వీట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ తన మీద కోపంగా ఉన్నారని, మరొక ట్వీట్‌లో ‘‘కొడుగడుతున్న చైతన్య క్రాంతికి వ్యతిరేకంగా పోరాటం.. పోరాటం’’ అంటూ వ్యాఖ్యానించారు.
న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో టెస్లా భవిష్యత్తు గురించి మస్క్ 2018లో చేసిన ఒక ట్వీట్ కారణంగా.. ఆ కంపెనీ మీద నియంత్రణ సంస్థ 2 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. అంతేకాదు.. ఇకపై తాను చేసే ట్వీట్లను న్యాయవాదులు ముందుగానే పరిశీలించానికి కూడా ఆయన అంగీకరించాల్సి వచ్చింది.
‘తలనొప్పి’
‘షేర్ ధర గురించి చేసిన ట్వీట్.. హాస్యానికి చేశారా? దానిని న్యాయవాదులు ముందుగా పరిశీలించి ఆమోదించారా?’ అని ఆయనను అడిగితే.. ఆయన ‘లేదు’ అని బదులిచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది.
టెస్లా షేర్ ధర ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. సంస్థ విలువ దాదాపు 10,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ స్థాయికి చేరుకుంటే.. సంస్థ యజమాని కోట్లాది డాలర్లు బోనస్‌గా చెల్లించాల్సి వస్తుంది.
‘‘మస్క్ వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉంటాయని మనం అనకుంటాం. పెట్టుబడిదారులకు అది పెద్ద తలనొప్పే. ఆయన ఈ చర్యలతో వాల్ స్ట్రీట్ చాలా విసుగు చెందింది’’ అని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డానియల్ ఐవ్స్ రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ 2018లో.. టెస్లాను స్టాక్ మార్కెట్ నుంచి తప్పించి వ్యక్తిగతం చేసుకోవటానికి అవసరమైన నిధులు సమకూర్చుకున్నట్లు ట్వీట్ చేశారు. దానివల్ల కూడా కంపెనీ షేర్ల ధరలు ఎగుడుదిగుళ్లకు లోనయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్.. ఇది మార్కెట్ ను ప్రభావితం చేసే వ్యాఖ్య అని తీర్పు చెప్తూ ఆయనకు జరిమానా విధించింది. మళ్లీ ఇటువంటివి జరగకుండా ఉండటానికి టెస్లా మీద ఆంక్షలు విధించింది.
అయితే.. ప్రైవేటుగా వెళతానన్న ఎలాన్ ట్వీట్ ఉద్దేశం తమను మోసం చేయటమేనంటూ షేర్ హోల్డర్లు వేసిన కేసును టెస్లా, మస్క్ ఎదుర్కోక తప్పదని ఫెడరల్ జడ్జి ఒకరు గత నెలలో స్పష్టంచేశారు.
మస్క్ గత వారంలో.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో ఇళ్లలోనే ఉండాలంటూ విధించిన ఆంక్షలను విమర్శస్తూ ట్వీట్ చేశారు.
గత ఏడాది ఒక బ్రిటిష్ డ్రైవర్ను ‘పీడో గై’ (పిల్లలమీద లైంగిక దాడికి పాల్పడే వ్యక్తి) అని అభివర్ణిస్తూ ట్వీట్ చేయటంతో మస్క్ కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది.
నటుడు, ప్రొడ్యూసర్ జీన్ వైల్డర్ నుంచి 2013లో తాను కొనుగోలు చేసిన తన ఇల్లు కూడా తాను విక్రయించే ఆస్తుల్లో ఉందని మస్క్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- కరోనావైరస్: రెమెడెసివీర్ ఔషధం భారత్‌కు ఎలా వస్తుంది?
- కరోనావైరస్: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 తగ్గింది... భారత్‌లో ఎందుకు తగ్గించడం లేదు?
- కరోనావైరస్: ఈ సమయంలో మీరు ఏవిధంగా సహాయపడగలరు?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- హైపర్‌లూప్: 2020 నాటికి 10 కి.మీ. పరీక్షకు సిద్ధమంటున్న ఎలాన్ మస్క్
- భూగర్భంలో గంటకు 240 కి.మీ. వేగంతో ఎలక్ట్రిక్ కారు.. సొరంగం నమూనాను ఆవిష్కరించిన ఎలాన్ మస్క్
- హైపర్‌లూప్: గంటకు 457 కి.మీ. రికార్డు వేగంతో ప్రయాణం
- ఆరు వేల కిలోమీటర్లు, అరగంటలో!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








