కరోనావైరస్: ఈ సమయంలో మీరు ఏవిధంగా సహాయపడగలరు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హెలీర్ చెయుంగ్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్ డీసీ
ప్రపంచవ్యాప్తంగా అనేక విషాదకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. కరోనావైరస్ బైటపడటం దగ్గర్నుంచి, నిరుద్యోగం, రోడ్డునపడ్డ ప్రజలు, ప్రియమైన వారిని కోల్పోయినవారు ఇలా ఎన్నో. వీటన్నింటినీ చూస్తే మనమేం చేయగలం అనిపిస్తుంది.
కానీ, అదృష్టవశాత్తు ఆరోగ్యంగా ఉన్నవారు, చేతిలో డబ్బు, సమయం ఉన్నవారు, హెల్త్‌కేర్ వర్కర్స్‌కు, ఇతర కమ్యూనిటీలకు సాయం చేయడానికి చాలా అవకాశాలున్నాయి. డొనేషన్లు సేకరించడం, డైరీరాయడం, స్నేహితుల పిల్లలకు ఆన్‌లైన్‌లో కథలు చదివి వినిపించడం... ఇలా మీరు చేయగలిగిన అద్భుతమైన పనులు ఎన్నో ఉన్నాయి.
1.ఇంటి దగ్గరే ఉండండి-లేదంటే సామాజిక దూరం నిబంధనలు పాటించండి
ఇది అందరికీ తప్పదు. కానీ ఇంట్లో కాకుండా సామాజిక దూరం పాటించాల్సిన ప్రాంతంలో మీరుంటే తప్పకుండా ఆ నిబంధనలను పాటించండి. వ్యాధివ్యాప్తిని తగ్గించడంలో మీవంతు సాయం చేయండి. ముఖ్యంగా కొందరిలో కనిపించకుండా వ్యాధి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. హెల్త్‌వర్కర్స్‌కు భారం తగ్గుంది.
2. రక్తదానానికి మీ పేరు రిజిస్టర్ చేయండి
సామాజిక దూరం నిబంధనలు అమల్లో ఉండటంతో చాలాదేశాలలో రక్తదాన కేంద్రాలలో దాతలు కరువయ్యారు.'' మనకు రక్తం అవసరం చాలా ఉంది. మీకు వీలయింతే వెంటనే రక్తదానం చేయండి" అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రజలను అభ్యర్ధించారు. తమ దగ్గర రక్తం నిల్వలు బాగానే ఉన్నప్పటికీ, ప్రజలు రక్తందానాన్ని కొనసాగించాలని బ్లడ్‌బ్యాంక్స్ కోరుతున్నాయి. అపాయింట్‌మెంట్లు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు ఈ మాత్రం జాగ్రత్త ఉండాలన్నది వాటి ఆలోచన. ''కరోనావైరస్ కారణంగా వచ్చేయేడాదిలో మనకు రక్తం అవసరం ఎక్కువగా ఉండొచ్చు'' అని యూకేలోని బ్లడ్‌బ్యాంకులు ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Alamy
3. లోకల్ కమ్యూనిటీకి లేదా సహాయక బృందాలకు సాయం చేయండి
కరోనావైరస్ ప్రభావం కారణంగా ఇళ్లలోంచి బయటకు రాలేని అనేకమందికి సాయం చేసేందుకు వివిధ సంఘాలు, బృందాలు ఏర్పడ్డాయి.''మేం చిన్నచిన్న పనులు అంటే కూరగాయలు తీసుకురావడం, మందులు కొనుక్కురావడం, ఫోన్లలో మాట్లాడటంలాంటి వాటిలో సాయం చేస్తుంటాం'' అని తూర్పులండన్‌లోని సర్రేడాక్స్ ప్రాంతంలో 250మందితో ఒక సహాయక బృందాన్ని నడుపుతున్న ట్రిన్‌గాంగ్ వెల్లడించారు. స్థానిక సూపర్‌మార్కెట్‌లలో ఎక్కడ ఎక్కువ బిజీ ఉంది అనే సమాచారాన్ని కూడా వారు షేర్ చేసుకుంటారు.
మరోవైపు డేర్ టు కేర్ అనే స్వచ్చంద సంస్థలాంటి సంస్థలు యూకే మెడికల్ సిబ్బందికి కొరతగా ఉన్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ)లాంటి వాటిని కొనుగోలు చేసేందుకు డొనేషన్లు సేకరిస్తుంటాయి. ప్రభుత్వం నుంచి అత్యవసర సేవలు పొందలేని వారికి కూడా ఈ సంస్థలు సహాయపడుతుంటాయి.
''రోగనిరోధక శక్తిలేని వారు, తరచూ అడ్రస్ మార్చుకునే మహిళలు, శరణార్ధులు, కేర్ హోమ్‌లో ఉండేవాళ్లు ఇందులో చేరడానికి అర్హులు కారు'' అని సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫిన్ లియాంగ్ వెల్లడించారు. ''సబ్బులు, శానిటరీ ప్యాడ్ కొనడానికి మేం ఎక్కువగా నిధులు సేకరిస్తాం. వాటి అవసరం చాలా ఉంది'' అని అంటున్నారు లియాంగ్.
4. నీ నైపుణ్యం ఉపయోగపడేచోటే పని చేయాలి
హెల్త్‌కేర్ వర్కర్స్‌కు వ్యక్తిగత రక్షణ సాధనాలు తయారు చేసేవారు, అలాగే హ్యాండ్ శానిటైజర్లు తయారు ఆల్కహాల్ డిస్టిల్లరీలలో పనిచేసేవారికి కొరత ఉంది. వాలంటీర్లలో కొద్దిపాటి నైపుణ్యాలు కూడా ఇలాంటి ప్రదేశాలలో చాలా ఉపయోగపడతాయి. చాలా స్వచ్ఛంద సంస్థలకు ఆన్‌లైన్ పనుల్లో సహకరించేవారు అవసరం ఉంటుంది.
అందుకే మార్క్ సోలన్‌లాంటి వారు కోడ్4కోవిడ్, కోవిడ్ టెక్ సపోర్ట్‌లాంటి వాలంటరీ గ్రూపులను తయారు చేసి స్వచ్చంద సంస్థలకు టెక్నాలజీ సహాయం చేస్తున్నారు. వేర్‌హౌస్‌ల నుంచి సరుకు రవాణా చేయడానికి ఆన్‌లైన్ సహకారాన్ని ఇలాంటి వారు అందిస్తుంటారు.
అలాగే. పరస్పర సహాయక గ్రూపులకు సహాయకారిగా ఉండేందుకు, ఎక్కవమంది విజిటర్లను కూడా మేనేజ్ చేయగల వెబ్‌సైట్‌లు తయారు చేయడంలాంటి సహాయాన్ని అందిస్తుంటారు. ''మార్కెట్ నిపుణులు, ప్రోడక్ట్ మేనేజర్లు, డిజైనర్లు, కాపీరైటర్లను కూడా మాతో కలుపుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మా ప్రాజెక్టులకు అలాంటి వారి సహకారం అవసరముంది'' అంటారు సోలన్. చాలా సహాయక సంస్థలకు డ్రైవర్లు, డెలివరీకి సహాయపడే ప్యాకర్లు అలాగే డొనేషన్లు సేకరించే వ్యక్తుల అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Dare to Care Packages
5. అవసరమైన మేరకే డబ్బును ఖర్చు చేయండి...
కోవిడ్ కారణంగా ఛారిటీ సంస్థలు, వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించి తోటి వారికి సాయపడండి. లాభాపేక్షలేని అనేక సంస్థలు అవసరం ఇప్పుడు బాగా పెరిగింది. అయితే, ఆయా సంస్థలు కూడా మహమ్మారి కారణంగా తమ ఆదాయ మార్గాలను కోల్పోయాయి. 75% స్వచ్చంద సంస్థలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయని అమెరికాలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
అలాగే, యూకేలోని ఛారిటీ సంస్థలు దాదాపు 4.3 బిలియన్ యూరోల ఆదాయాన్ని కోల్పోయాయి. అలాగే చిన్నవ్యాపారస్తులు, స్వయం ఉపాధిలో ఉన్నవారు కూడా ఆర్ధికంగా నష్టపోయారు. మహమ్మారి కారణంగా రాబోయే రోజుల్లో కూడా వారు త్వరగా ఆదాయాన్ని పొందలేరు.
మీరేదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దానికి ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని గురించి ముందు పరిశీలించండి. చాలా పుస్తకాల షాపులు ఇంటి నుంచే నడుస్తున్నాయి. ఆర్డర్లపై బుక్స్ సరఫరా చేస్తున్నాయి. అలాగే కొన్నిబార్లు ఆన్‌లైన్‌లో కాక్‌టైల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.
డొనేషన్ల సేకరణ కోసం అమెరికాలోని కొందరు వాలంటీర్లు వర్చువల్ టిప్ జార్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా తమకిష్టమైన సర్వీస్ సెక్టార్‌కు టిప్ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ''టిప్ వర్కర్స్‌కు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో తక్కువ జీతాలుంటాయి.
చాలామంది ఉద్యోగులకు టిప్పుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది'' అన్నారు న్యూఒర్లియాన్స్‌లో ఆన్‌లైన్ టిప్ జార్ ఏర్పాటు చేసిన క్రిస్టెన్ మోంటెలియోన్ అనే స్వచ్చంద సేవకుడు.
6. బంధువులు, ఐసోలేషన్‌లో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాయండి
కేవలం భౌతికంగా, ఆర్దికంగా సాయం చేయడమొక్కటే కాకుండా, మానసికంగా సాయం చేయడం కూడా కీలకమైందే. తెలిసిన వారితో రీ-కనెక్ట్ కావడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా వ్యాధికారణంగా ఐసోలేషన్‌లో ఉన్నవారికి దగ్గర కావడం ఇంకా మంచిది. ఇందుకోసం ఉత్తరాలు రాయడం అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ''ఉత్తరం అనేది మనం స్పృశించేది, దాచుకునేది, జ్జాపకంగా టేబుల్ మీదనో, వాల్ మీదనో పెట్టుకునేది. ఈ-మెయిల్‌లా డిలీట్ అయ్యేది కాదు'' అంటారు ఫ్రాన్స్‌లో వన్ లెటర్ వన్ సౌరీ (ఫ్రెంచ్ పదం. దీని ఇంగ్లీషు అర్ధం వన్ లెటర్-వన్ స్మైల్) ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన అలీనర్ డ్యూరాన్.
ఫ్రాన్స్,కెనడా, స్విట్జర్లాండ్, బెల్జియమ్, లక్జెంబర్గ్‌లలో ఐసోలేషన్‌లో ఉన్నవారికి తమ టీమ్ ద్వారా లేఖలు రాయిస్తుంటారీమే. కేవలం ఒక నెలరోజుల్లో మా నుంచి వారంతా 95,000కు పైగా లేఖలు అందుకున్నారని చెప్పారామె. మీకు ఒక భాషకన్నా ఎక్కువ తెలిసి ఉంటే మీలాంటి వారు ఇందుకు బాగా ఉపయోగపడతారు. న్యూయార్క్‌కు చెందిన హార్ట్ ఆఫ్ డిన్నర్ అనే స్వచ్చంద సంస్థ నగరంలోని చైనా టౌన్‌లో ఐసోలేషన్‌లో ఉన్న చైనీస్ వృద్ధులకు తాజా ఆహారంతోపాటు, చైనా భాషలో చేతితో రాసిన నోట్స్‌ను అందిస్తున్నారు. ''ఏషియన్ అమెరికన్లు తరచూ వేధింపులకు గురికావడం, చాలామంది వృద్ధులకు ఇంగ్లీషు రాకపోవడం , చాలామంది ఒంటరి ఒంటరితనాన్ని ఫీలవుతున్నట్లు మేం గమనించాం'' అన్నారు సంస్థ వ్యవస్థాపకులు యెన్ చాంగ్, మూన్‌లిన్ ట్సాయి.

ఫొటో సోర్స్, Getty Images
7. ఒక డైరీ రాయండి
మీరు నమ్మండి..నమ్మకపోండి...మీతో ఒక డైరీ ఉండటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు అన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం చాలా ప్రయోజకరమని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ కూడా సూచించారు. దీనివల్ల అధికారులకు కాంట్రాస్ట్ ట్రేసింగ్ చాలా సులమవుతుందని ఆమె చెప్పారు.
ఈ మహమ్మారి విస్పోటనం ఒక చరిత్రాత్మక ఘటన కాబట్టి చరిత్రకారులకు కూడా ఉపయోగపడొచ్చు. ప్రజలు ఆడియో లేదా వీడియో ఫార్మాట్‌లో డైరీలు రాయడాన్ని మేం ప్రోత్సహిస్తున్నామన్నారు నేషనల్ లైఫ్ స్టోరీస్ ఎట్ ది బ్రిటిష్ లైబ్రరీ డైరక్టర్ రాబ్ పెర్క్స్.
మీ చుట్టు జరుగుతున్న పరిణామాలను వారు రికార్డు చేయవచ్చు లేదా రాయొచ్చు. అది మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుంది. భవిష్యత్తులో చరిత్రకారులకు ఈ సమాచారం ఎంతో విలువైనదిగా మారొచ్చు'' అన్నారు పెర్క్స్. '' మనలో చాలామంది చరిత్ర అంటే రాజులు, రాజకీయాలు అనుకుంటుంటారు.
వాస్తవానికి చరిత్ర అంటే ప్రతి ఒక్కరు'' అన్నారు పెర్క్స్. ఆయన ప్రస్తుతం ఓరల్ హిస్టరీ సొసైటీకి సెక్రటరీగా కూడా పని చేస్తున్నారు. ''గ్రౌండ్‌లెవెల్లో ఏం జరిగిందో తెలుసుకోడానికి సామాన్యులు రాసిన కథనాలు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకుల నిర్ణయాలు రోజువారీగా ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసింది తెలుస్తుంది'' అంటారాయన.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

8. అట్టడుగున ఉన్నవారికి ఏం కావాలో తెలుసుకోండి
అట్టడుగున ఉన్న వర్గాలు, తరచూ ఇతరుల మీద ఆధారపడే వారు ఈ పరిస్థితుల్లో ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు. వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని సంబంధిత స్వచ్చంద సంస్థను సంప్రదించండి. ఉదాహరణకు సింగపూర్‌లోని డార్మిటరీలలో ఉండే వలసకూలీలలో 80%మందికి కరోనావైరస్ సోకింది.
వారంతా విదేశాలలో పనిచేయడానికి భారీగా అప్పులు చేసి అక్కడికి వచ్చారు. తాము ఈ డార్మిటరీలో ఇరుక్కుపోయామని వారు భావిస్తున్నారు. వారంతా కుటుంబాలకు దూరంగా ఉన్నారు.
''రెయినింగ్ రెయిన్ కోట్స్'' అనే సంస్థ వారికోసం ఒక వాట్సప్ గ్రూప్‌ను సిద్ధం చేసింది. వారికి కావాల్సిన సబ్బులు ఇతర ముఖ్యమైన అవసరాలతోపాటు, మొబైల్ టాప్‌అప్ కూపన్లలాంటి వాటిని అందిస్తోంది. ఇలాంటి వాటివల్ల వాళ్లు సొంత దేశంలోని తమ వారితో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.
వారికి ఆడుకునేందుకు రూబిక్స్ క్యూబ్స్, క్యారంబోర్డులాంటివి కూడా ఏర్పాటు చేసినట్లు స్వచ్చంద సేవకురాలు దీపా స్వామినాథన్ అన్నారు. ''వారు ఆ ఆటలవల్ల తమకు తాము చిన్నపిల్ల్లల్లా మారిపోయి వ్యాధి భయం నుంచి ఉపశమనం పొందుతారు'' అన్నారామె.

ఫొటో సోర్స్, iStock/Getty Images
9. రిమోట్ చైల్డ్ కేర్‌తో స్నేహితులకు, కుటుంబాలకు సాయం చేయండి
పిల్లల్ని చూసుకోవడం, ఆఫీసు పని చేయడం పేరెంట్స్‌కు తలకుమించిన భారమే. అయితే కొందరు తమ స్నేహితుల పిల్లల కోసం ఆన్‌లైన్ ద్వారా కథలు వినిపించే కార్యక్రమం మొదలుపెట్టారు. దీనివల్ల పేరెంట్స్‌చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోడానికి వీలుపడుతుంది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కథలు వినిపిస్తున్నారు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో టీచర్‌గా పని చేస్తున్న కేషా యెర్బీ . పిల్లలకు కథలు చెప్పేంత టైమ్ లేని పేరెంట్స్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రోజూ చదివినట్లుగానే చదవడం కాకుండా కాస్త భిన్నంగా చదవడానికి ప్రయత్నించండి అని సలహా ఇస్తున్నారు కేషా. పిల్లలను చిన్నచిన్న ప్రశ్నలు అడగడ ద్వారా వారి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయవచ్చంటారామె.
10. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి.
కరోనా మహమ్మారి గురించి తప్పుడు సమాచారం పోటెత్తుతోంది. 15 నిమిషాలకొకసారి నీళ్లు తాగాలని, వేడినీటితో స్నానం చేస్తే క్రిములు దగ్గరికి రావని...ఇలా అనే ప్రచారాలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తే ఇలాంటి సమాచారానికి ప్రముఖ వైద్యరంగ నిపుణుల పేర్లను తగిలిస్తుంటారు.
''మీకు నమ్మకమైన సోర్సు నుంచి వస్తే తప్ప అలాంటి సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దు'' అని సిటీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఇన్ఫర్మేషన్ సైన్స్ నిపుణులుగా పనిచేస్తున్న లిన్ రాబిన్సస్, డేవిడ్ బాడెన్ అంటున్నారు. ఒకవేళ మీద దగ్గర నమ్మకమైన సమాచారం ఉంటే, దాన్ని ఎప్పుడు, ఎలా షేర్ చేయాలో ఆలోచించండి.
''ఆటోమేటిక్‌గా దాన్ని షేర్ చేయవద్దు. మీరు చదవని లింకును, మీరు చూడని వీడియోలను అందరికీ పంపవద్దు'' అంటున్నారు డాక్టర్ రాబిన్సన్, ప్రొఫెసర్ బాడెన్. ఒకవేళ మీరు వీడియోను షేర్ చేయాలనుకుంటే దానికి వివరణగానీ, సందర్భంగాని రాయండి అంటున్నారు వారు.
కొందరికి ''నిరంతరంగా వచ్చే సమాచారం తరచూ వైరుధ్యంగా కనిపిస్తూ తికమక పెట్టి భయాన్ని, ఆదుర్ధాను పెంచుతుంది'' అంటున్నారు వారు. ''అతిగా పుట్టుకొచ్చే సమాచారం ప్రజలను సరైన నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేస్తుంద''ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?
- ఇండియా లాక్డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








