కరోనా వైరస్: సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే సామాజిక దూరం పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.
భారతదేశంలో కూడా సామాజిక దూరం పాటించమని చెబుతూ కనీసం మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరం పాటించమని సూచిస్తున్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకిచ్చిన సందేశంలో సామాజిక దూరం ఆవశ్యకతని గుర్తు చేశారు.
“కరోనావైరస్‌ని నియంత్రించాలంటే సామాజిక దూరం పాటిస్తూ వ్యాప్తి చెందే అవకాశాన్ని తగ్గించేలా చూడటమొక్కటే మార్గం" అని మోదీ అన్నారు.
లక్షలాది మంది ప్రజలు మోదీ సలహాలను పాటిస్తున్నప్పటికీ సామాజిక దూరం పాటించే విషయంలో దేశంలో వ్యతిరేకత కనిపిస్తోందా అనే విషయం ప్రశ్నగానే ఉంది.
కొన్ని సార్లు వలస కార్మికులు వారి ఇళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో నిస్సహాయ స్థితిలో సామాజిక దూరం పాటించాలనే నియమాన్ని ఉల్లంఘించి బస్సు స్టేషన్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర గుమిగూడారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత దేశం గత నెల రోజుల నుంచి లాక్ డౌన్‌లో ఉంది. లక్షలాది మంది వలస కార్మికులకు పని లేదు. దీంతో, రవాణా సేవలు పునరుద్ధరిస్తారనే వదంతులు వచ్చినప్పుడల్లా వీరంతా స్వస్థలాలకు వెళ్లడానికి బస్సు స్టేషన్ల దగ్గర గుమిగూడారు.
భారత్ 130 కోట్ల జనాభాతో సగటున చదరపు అడుగుకి 464 జనసాంద్రత గత దేశం. అత్యధిక జనాభా కలిగిన చైనాలో ప్రతి చదరపు అడుగుకి జన సాంద్రత 153 ఉండగా యూఎస్‌లో అది 36.
భారతదేశంలో ప్రతి కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులు ఉంటారు. అందులో 40 శాతం గృహాలలో కేవలం ఒకటే గది ఉంటుంది.
"ఒకే గదిలో ఐదు నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులు నివసించే దేశంలో సామాజిక దూరం పాటించగలగడం కూడా ఒక అదృష్టంగానే చెప్పవచ్చు" అని కాన్పూర్ సీఎస్‌జేఎం యూనివర్సిటీలో సోషియాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ లాంబా ఝా చెప్పారు.
"విశాలమైన ఇల్లు ఉన్నప్పుడే సామాజిక దూరం పాటించడానికి వీలవుతుందని" అన్నారు.
నిస్సహాయత, అధిక జనాభా వలన సామాజిక దూరం పాటించలేకపోవడాన్ని అంగీకరించవచ్చు. కానీ, గత నెలలో దేశంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అసలు ప్రజలు సామాజిక దూరం అంటే ఏమిటో సరిగ్గా అర్ధం చేసుకున్నారా అనే ప్రశ్నని మిగిల్చాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉదాహరణకి లాక్ డౌన్ మొదలవ్వడానికి సరిగ్గా రెండు రోజుల ముందు మోదీ దేశ వ్యాప్త జనతా కర్ఫ్యూ కి పిలుపు నిచ్చారు. కరోనా వైరస్ కి మందు లేనందున ఇంటిలోపల ఉండటం ఒక్కటే మార్గమని సూచించారు.
అయితే, దీంతో పాటు, ప్రజలకి అత్యవసర సేవలు అందిస్తున్న, డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రజలని అదే రోజు సాయంత్రం ఐదు గంటలకి తమ తమ బాల్కనీ లోకి వచ్చి తప్పట్లు లేదా గంటలు కొట్టమని చెప్పారు.
ఈ జనతా కర్ఫ్యూకి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది.
అయితే, పొద్దున్న నుంచి పాటించిన కర్ఫ్యూ అంతా సాయంత్రం అయ్యేసరికి కరిగిపోయింది. చాలా ప్రాంతాలలో, గుంపుల కొలది ప్రజలు వీధుల్లోకొచ్చి డప్పులు కొట్టడం, శంఖాలు ఊదటం, ప్లేట్ లు పట్టుకుని గంటలు కొట్టడం లాంటి పనులు చేశారు.
కొంత మంది సెల్ఫీలు తీసుకుంటూ 'కరోనా పారిపో', కరోనా పారిపో' అంటూ నినాదాలు కూడా చేశారు.
విచిత్రమేమిటంటే కొన్ని ఊరేగింపులు సామాజిక దూరం గురించి ప్రజలకి అవగాహన కల్పించాల్సిన రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి.
ఇలాంటి దృశ్యాలే మరో రెండు వారాల తర్వాత ప్రజలని కోవిడ్ 19 బారిన పడినవారికి సౌభ్రాత్రత్వం చాటేందుకు బాల్కనీలో దీపాలు వెలిగించమని చెప్పినప్పుడు కూడా కనిపించాయి.
అప్పటికి దేశం 21 రోజుల లాక్ డౌన్ మధ్యలో ఉంది. కానీ చాలా చోట్ల ప్రజలు బయటకి వచ్చి నినాదాలు చేస్తూ బాణాసంచా కూడా కాల్చారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

"ఒక విధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మద్దతుని తెలియచేస్తాయి. కానీ , కరోనా తమ చుట్టూ ఉందని మర్చిపోతారు", అని లాంబా నవ్వుతూ అన్నారు.
సామాజిక దూరం పాటించడం అనేది దేశంలో ఇంకా అందరికి అర్ధం కాని కొత్త విషయమని ఆమె అన్నారు.
"మనిషి సంఘ జీవి అని అంటాం. భారతీయులు ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తారు. ఇక్కడ అందరికి చాలా మంది స్నేహితులు, బంధువులు ఉంటారు. భారతీయులు మిగిలిన వారి కన్నా కొంచెం ఎక్కువ సాంఘిక జీవనాన్ని ఇష్టపడే వ్యక్తులని" ఆమె అన్నారు.
దిల్లీ లాంటి నగరాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కొన్ని షాపుల దగ్గర ఒక మీటర్ దూరంలో గడులను గీసి ప్రజలని ఆ దూరం పాటించమని చెబుతున్నారు.
అయితే, ఇక్కడ కూడా కొన్ని చోట్ల ప్రజలు గుమిగూడటం ఆగటంలేదు. ఉదాహరణకి మురికివాడలో ఒక నీళ్ల టాంకర్ దగ్గరకి ప్రజలు బారులు తీరుతున్నారు. నోయిడా లాంటి ప్రాంతాలలో పేదలకి ఆహారం సరఫరా చేస్తున్న చోట కూడా ప్రజలు ఒకరి పై ఒకరు పడుతున్నారు.
పాట్నాలో కొన్ని కాయగూరల మార్కెట్లలో గుంపులు గుంపులుగా ప్రజలని నేను చూసాను.
అలాహాబాద్ లో మందుల షాపుల దగ్గర కూడా ప్రజలు సామాజిక దూరం పాటించటం లేదు.
దేశంలో 69 శాతం నివాసించే గ్రామీణ ప్రాంతాలలో కూడా సామాజిక దూరం నియమం పూర్తిగా అమలు జరగటం లేదు.
“సామాజిక దూరం అనేది నగరాలకు సంబంధించినదని”, బీహార్ లోని ఒక జర్నలిస్ట్ అమర్నాథ్ తివారి అన్నారు.
“గ్రామాలలో ప్రజలు సామూహికంగా జీవిస్తారు. చాలా కుటుంబాలకి కలిపి నీటిని తెచ్చుకోవడానికి ఒకటే నీటి ఆధారం ఉంటుంది. వీళ్లంతా కలిసి పొలాలలో పని చేసుకుంటూ ఉంటారు. షాపుల దగ్గర కూడా ఒకరినొకరు తాకుతూనే నిలబడతారు” అని అన్నారు.
కోవిడ్ 19 విదేశాల నుంచి వచ్చింది కాబట్టి అది ధనికులకు మాత్రమే వస్తుందని అనుకోవడమే సామాజిక దూరం పాటించకపోవడానికి కారణమని లాంబా అన్నారు.
“కరోనావైరస్ కేసులు నగరాలలోని ఎక్కువగా ఉన్నాయని, గ్రామాలలో అంతా బాగుందని వారి అభిప్రాయం. దీని తీవ్రత ఏమిటో వారికి అర్ధం కావటం లేదు".
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 విషయంలో కొందరు నైజీరియన్లు తెగ సంబరపడుతున్నారు.. ఎందుకో తెలుసా
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








