కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా? BBC Reality Check

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రుతి మెనన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

కరోనావైరస్‌ను అరికట్టడానికి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించి ప్రజల కదలికల్ని నియంత్రించిన నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనే విధానాల గురించి రకరకాల తప్పుడు ప్రచారాలు వివిధ జాతీయ వార్తా మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.

వాటిలో కొన్నింటిని మేము పరిశీలించాం.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

సంప్రదాయ మూలికలు వైరస్‌ను నిరోధించే రోగ నిరోధక శక్తిని పెంపొందించవు

కరోనావైరస్ సోకకుండా చూసుకునే చర్యల్లో భాగంగా దేశ పౌరులను సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించడం ప్రధాని మోదీ ఉద్దేశంలా కనిపిస్తోంది.

రోగ నిరోధక శక్తిని పెంచడానికి కడ అనే వనమూలికల మిశ్రమం వాడేందుకు, అధికారిక సూచనలు పాటించమని మోదీ సూచించారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ తో పోరాడేటప్పుడు శరీరం ఎదుర్కొనే తీరు రోగ నిరోధక శక్తి పై ఆధారపడి ఉంటుంది కానీ ఈ మిశ్రమం తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు అన్నారు.

ఇలా ప్రచారమవుతున్న వాదనలకు ఎటువంటి ఆధారాలు లేకపోవడమే పెద్ద సమస్య అని యేల్ యూనివర్సిటీలో ఇమ్యూనాలజిస్ట్ అకికో ఇవసాకి అన్నారు.

భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ సంప్రదాయ వైద్యాన్ని ప్రచారం చేస్తూ, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి వివిధ విధానాల జాబితాను రూపొందించింది.

ఇందులో చాలా చికిత్సా పద్ధతులను కరోనావైరస్‌ను తరిమి కొట్టేందుకు మార్గాలుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

అయితే, ఇవి పని చేస్తాయని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

అధికారిక పేజీ

ప్రభుత్వ ఫాక్ట్ చెకింగ్ విభాగం కూడా వేడి నీరు తాగినా, వెనిగర్ లేదా ఉప్పు నీటితో గొంతు పుక్కిలించినా కరోనా వైరస్ రాదనే తప్పుడు సలహాలను నమ్మవద్దని ప్రకటించింది.

టీ తాగడం వలన కూడా వైరస్ దరి చేరదని చైనాలో పుట్టిన తప్పుడు సమాచారం ఇండియా సహా కొన్ని ఇతర దేశాలకు పాకడాన్ని పరిశీలించాం.

Screen grab of ABP News

భారతదేశంలో లాక్ డౌన్ విధించకపోయినట్లయితే ఏప్రిల్ 15 వ తేదీ నాటికి 8 లక్షల మంది కరోనావైరస్ బారిన పడి ఉండేవారని ఒక పరిశోధన తెలిపినట్లు ఉత్తర భారతదేశంలోని ఏబీపీ న్యూస్ చానల్ తెలిపింది.

అయితే, ఈ పరిశోధనకు ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనను పేర్కొంటోంది. ఈ వార్త ని బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తే, దాన్ని వేలాదిగా రీట్వీట్ చేశారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అయితే, అటువంటి పరిశోధన ఏది జరగలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఐసీఎంఆర్ లాక్‌డౌన్ ప్రభావంపై ఎటువంటి పరిశోధన చేయలేదని రీసెర్చ్ మేనేజ్మెంట్ అండ్ పాలసీ ప్రాంతీయ అధికారి డాక్టర్ రజనీకాంత్ చెప్పారు.

ఏబీపీ న్యూస్ మాత్రం తమ వార్త సరైనదేనని అంటోంది.

అయితే, వైరస్ ఎంతమందికి సోకి ఉండేదనే విషయంలో ఒక 'అంతర్గత పరిశోధన' చేసినప్పటికీ, ఆ వివరాలేవీ వెల్లడించలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మార్చి 25 నుంచి నుంచి ప్రజలు నిర్బంధంలోనే ఉండటంతో, ఒక వేళ లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే కచ్చితంగా ఎంత మందికి ఇన్ఫెక్షన్ సోకి ఉండేదన్నది తెలిసే అవకాశం లేదు.

Man drinking tea

ఫొటో సోర్స్, Getty Images

టీ తాగడం గురించి ప్రచారమయిన తప్పుడు కనం

"ఒక కప్పు టీ కరోనావైరస్‌కు మందు అని ఎవరికి తెలుసు?"

ఈ మాట చైనీస్ డాక్టర్ లీ వెన్లియాంగ్ చెప్పినట్లుగా సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం అయింది. అసలు ఈ వైర తీవ్రత గురించి హెచ్చరించి, అందరినీ అప్రమత్తం చేయాడానికి కృషి చేసిన వూహాన్ వైద్యుడే వ్యక్తి వెన్లియాంగ్. చివరికి ఆయన వైరస్ బారిన పడి మరణించారు.

టీలో ఉండే మిథైల్‌జాంథైన్స్ అనే పదార్థాలు వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తాయనే లిఖితపూర్వక ఆధారా లు ఆయన కేసు ఫైల్స్ లో ఉన్నాయనే తప్పుడు వాదన కూడా ప్రచారమైంది.

చైనాలోని హాస్పిటళ్లలో రోగులకు మూడు సార్లు టీ ఇస్తున్నారని కూడా ప్రచారం చేశారు.

మిథైల్‌జాంథైన్స్ అనే పదార్ధాలు టీ, కాఫీ, చాక్లెట్ లో ఉంటాయి.

కానీ, వాటి ప్రభావం గురించి వెన్లియాంగ్ పరిశోధన చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయన కంటి వైద్యుడు. కానీ, వైరస్ నిపుణుడు కాదు. అలాగే, చైనాలో హాస్పిటళ్లు రోగులకు టీ ఇచ్చి చికిత్స చేస్తున్నట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)