కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి

నారింజ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నారింజ

ఫ్యూచర్ మార్కెట్లో నారింజ రసం ధరలు ఈ నెలలో 20 శాతం పెరిగాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో నారింజ రసం ధరలు పెరుగుతున్నాయి.

ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షలు పెరగడంతో ఉత్పత్తి ఉన్నప్పటికీ సరఫరా తగ్గిపోయింది. ఇది ఫ్యూచర్ మార్కెట్లో నారింజ రసం ధర పెరిగింది.

‘‘కోవిడ్-19 దెబ్బకు డిమాండ్ అమాంతం పెరగ్గా సరఫరాకు అవకాశాలు తగ్గిపోయాయి. నారింజ రసంలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉండడంతో దీనికి గిరాకీ బాగా పెరిగింది.

అదేసమయంలో దీన్ని మార్కెట్లకు చేర్చడానికి అవకాశం లేకుండాపోయింది.

విమానయాన సదుపాయాలు తగ్గిపోవడంతో..

విమానయాన సంస్థల వద్ద సరిపడా ట్యాంకర్ స్పేస్ లేకపోవడం వల్ల సరఫరా పెంచడానికి కష్టమవుతోంద’’ని యాక్సీ కార్ప్ సంస్థ చీఫ్ గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ స్టీఫెన్ ఇన్స్ చెప్పారు.

మరోవైపు సోషల్ డిస్టెన్సింగ్ ఆంక్షలు కారణంగా నారింజ తోటల్లో పనిచేయడానికి కార్మికులు కూడా దొరకడం లేదు.

ఫ్లోరిడా, బ్రెజిల్‌లలోని నారింజ తోటల్లో పనికి కార్మికులు లేక వ్యాపారులు ఇదేంటీ పరిస్థితని ఆశ్చర్యపోతున్నారు’’ అని అమెరికాకు చెందిన వాణిజ్య సంస్థ ప్రైస్ ఫ్యూచర్స్ గ్రూప్‌కు చెందిన జాక్ స్కోవిల్లీ అన్నారు.

మార్కెట్
ఫొటో క్యాప్షన్, మార్కెట్

అయిదేళ్లలో ఇదే తొలిసారి

2015 అక్టోబరు నుంచి ఇప్పటివరకు కాలంలో ఈ నెల నారింజ రసం ఫ్యూచర్స్ ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.

పైగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమవుతున్న దశలో దీని ధరలు ఊపందుకున్నాయి.

లండన్‌లో ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ గత నెల 13 శాతానికంటే ఎక్కువ పతనమైంది.

వాల్ స్ట్రీట్‌లో డోజోన్స్ పారిశ్రామిక సూచీ సగటు 16 శాతానికి పైగా పతనమైంది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

సూపర్ మార్కెట్లలోనూ ధరలు పెరగనున్నాయి

ఫ్యూచర్స్ మార్కెట్లో నారింజరసం ధరలు పెరుగుతుండడమనేది దుకాణాల్లోనూ ధర పెరగబోతుందనడానికి సూచనేనని స్టీఫెన్ ఇన్స్ అన్నారు.

నారింజరసం తయారీదారులు ఈ పెరిగిన ధరలను సూపర్ మార్కెట్లు, కొనుగోలుదారులపైకి మళ్లిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తొందరలోనే జరుగుతుందన్నారు.

నారింజరసమే కాదు చాలా వస్తువులది అదే దారి

ఖండాంతర మార్కెట్లలో వర్తకమయ్యే చాలా వస్తువుల ధరలు ఫ్యూచర్స్ మార్కెట్లో పెరుగుతున్నాయి.

ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడం వల్ల కంపెనీలు ధరను స్థిరపరుచుకునేందుకు అవకాశామేర్పడుతుంది.

దానివల్ల వారు ధర మరింత పెరిగినా ఆ ప్రభావానికి గురికాకుండా ఉంటారు.

ప్రకృత్తి విపత్తులు, పంట దెబ్బతినడాలు వంటి కారణాల వల్ల నారింజ, గోధుమ వంటి ఉత్పత్తుల ధరలు ఆకస్మికంగా పెరుగుతుంటాయి. అందుకే ఇలాంటి ఉత్పత్తులకు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడం సాధారణమే.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.