కరోనావైరస్ R0: లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- రచయిత, జేమ్స్ గాల్లాగెర్
- హోదా, బీబీసీ హెల్త్ & సైన్స్ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ తో పొంచి ఉన్న ముప్పును అర్ధం చేసుకోవడం వెనుక ఒక కీలకమైన సంఖ్య ఉంది. ప్రజల ప్రాణాలని కాపాడటానికి కానీ, లాక్ డౌన్‌ను ఎంతమేరకు సడలించవచ్చనే నిర్ణయాలని తీసుకోవడానికి కానీ ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలకి ఈ సంఖ్య మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఇది ‘ఆర్ నాట్’ అని పిలిచే ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య ఆర్‌ఓ.. R0.
ఆర్ నాట్ అంటే ఏమిటి?
ఒక వ్యాధి వ్యాప్తి చెందే సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి పునరుత్పత్తి సంఖ్య సహాయపడుతుంది.
ప్రజలెవరికీ రోగ నిరోధక శక్తి లేని పక్షంలో వ్యాధి సోకిన రోగి నుంచి సగటున వైరస్ ఎంత మందికి వ్యాప్తి చెందగలదని అంచనా వేసే సంఖ్యని ఆర్ నాట్ అంటారు.
తట్టు వ్యాధి తీవ్రంగా ప్రబలితే దాని పునరుత్పత్తి సంఖ్య 15 ఉంటుంది. ఇది తీవ్ర స్థాయిలో ప్రబలవచ్చు.
ఇప్పుడు తలెత్తిన కోవిడ్-19 పునరుత్పత్తి సంఖ్య 3. కానీ, అంచనాలు మారే అవకాశం ఉంది.

ఇది ఎందుకు ముఖ్యం?
పునరుత్పత్తి సంఖ్య 1 కంటే ఎక్కువ ఉంటే , కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అప్పు తీర్చని క్రెడిట్ కార్డు మీద వడ్డీలా పెరిగిపోతుంది.
ఈ సంఖ్య 1 కంటే తక్కువ ఉంటే , వ్యాధి నెమ్మదిగా తగ్గు ముఖం పడుతుంది.
ఈ పునరుత్పత్తి సంఖ్య ని 3 నుంచి 1 మధ్యకు తేవాలని ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.

- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

అందుకే లాక్ డౌన్లు విధించి ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని, పిల్లలకి సెలవులిస్తూ స్కూల్స్ కూడా మూసేసారు. వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధానాన్ని ఎంచుకున్నాయి.
యూకేలో ఏం జరిగింది?
ఈ పునరుత్పత్తి సంఖ్య ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మనుషుల రోగ నిరోధక శక్తి పెరిగే కొలదీ ఈ సంఖ్య మారుతూ ఉంటుంది.
సామాజిక దూరం, లాక్ డౌన్ , నిర్బంధం వలన ఈ సంఖ్య లో వచ్చిన మార్పుని తెలుసుకునేందుకు లండన్ ఇంపీరియల్ కాలేజీలోని మాథెమటికల్ మోడెల్లెర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఈ సంఖ్య ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడే ఈ వైరస్ తీవ్రంగా ప్రబలే పరిస్థితులు ఉన్నాయి. నెమ్మదిగా అమలు చేసిన నిర్బంధనలు ఈ సంఖ్యని తగ్గించాయి. అయితే పూర్తి లాక్ డౌన్ అయ్యేవరకు ఈ సంఖ్య తగ్గు ముఖం పట్టలేదు.
ఇందులో కొంత సాంకేతికత ఉంది. ఈ సంఖ్య మారుతూ ఉండటంతో శాస్త్రవేత్తలు, R0 కన్నా RT ని వాడుతున్నారు.

లాక్డౌన్ యూకేలో ఇన్ఫెక్షన్ రేటును ఎలా తగ్గించింది?
ఈ సంఖ్య 0. 7 గా కనిపిస్తోంది. ఇలాంటి అంచనాలలో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వైజ్ఞానిక సలహాదారులు మాత్రం ఈ సంఖ్య ఒకటి కంటే తక్కువ ఉందని కచ్చితంగా నమ్ముతున్నారు.
లాక్ డౌన్ సడలించడానికి ఈ సంఖ్య ఎలా సహాయపడుతుంది?
వివిధ దేశాలలో లాక్ డౌన్ సడలించడానికి పునరుత్పత్తి సంఖ్య ఒకటి కంటే తక్కువ ఉండాలి. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమని, లండన్ స్కూల్ అఫ్ హైజీన్ & ట్రోపికల్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ ఆడమ్ కుకర్స్కి బీబీసీ కి చెప్పారు.
అయితే, దీంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం కూడా ఉందని , తిరిగి వైరస్ విజృభించకుండా చూసుకోవడం ఒక పెద్ద సవాలు అని చెప్పారు.
అయితే, ఈ పునరుత్పత్తి సంఖ్యలో ఒక ఆమోదం పొందని అంశం ఉంది . ఈ సంఖ్యని 3 నుంచి 0. 7 కి తెచ్చే ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది 1 కంటే తక్కువ ఉంచి ప్రయోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వదు.
ఏప్రిల్ మొదటి వారంలో జర్మనీ ఈ సంఖ్య ని 0. 7 కి తేవడంలో సఫలం అయింది. ఇదే పరిస్థితి ఇప్పుడు యు కె లో నెలకొంది. అయితే జెర్మనీ లో రాబర్ట్ కోక్ సంస్థ ధ్యక్షుడు ఈ సంఖ్య 1 కి పెరిగిందని అన్నారు. ఇది ఒకటి కన్నా తక్కువ ఉండాలని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ నిబంధనలు సడలించవచ్చు?
దురదృష్టవశాత్తు ఈ వైరస్ వ్యాప్తి ఎలా చెందుతుందనే విషయం పై అంచనాలే కానీ, కచ్చితమైన నియమావళి ఏమి లేదు.
లాక్ డౌన్ తో నిబంధనలు అమలవ్వడంతో పూర్తిగా దీని వ్యాప్తిని అంచనా వేయలేకపోయామని రాబర్ట్ అన్నారు.
“పునరుత్పత్తి సంఖ్య ని అంచనా వేయడానికి, స్కూల్స్, పని స్థలాలు, భారీ సమూహాలను తెరిచి ఉంచితే ఎదురయ్యే ముప్పుని ఎదుర్కోవటం ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది”.
“లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజల ప్రవర్తనలో మార్పు వచ్చి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. వైరస్ ని అరికట్టడానికి కనిపెట్టడం, పరీక్షలు నిర్వహించడం, లొకేషన్ ట్రాకింగ్ యాప్ లను వాడటం లాంటి విధానాలని అవలంభించాల్సిన అవసరం ఉంది”.
ఇలా చేయడం వలన పునరుత్పత్తి సంఖ్య తగ్గి, లాక్ డౌన్ ని నెమ్మదిగా సడలించవచ్చు.
ఇది చాలా ముఖ్యమైన సంఖ్యా?
వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు పరిగణనకి తీసుకునే మూడు అంశాలలో ఇది ఒకటి .
ఇంకొకటి వైరస్ ప్రభావ తీవ్రత. పెద్దగా సమస్యలు లేకుండా తేలికపాటి లక్షణాలు కనిపించినట్లైతే ప్రమాదకరం కాకపోవచ్చు. అయితే, కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండి ప్రాణాంతకంగా మారింది.
అలాగే, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య . దీని ద్వారా ఎప్పుడు చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించవచ్చు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధనలు సడలిస్తే కేసు ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.
వ్యాక్సిన్ సంగతి ఏమిటి?
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పునరుత్పత్తి సంఖ్య తగ్గుతుంది. సగటున ఒక కరోనావైరస్ రోగి ద్వారా ముగ్గురికి వ్యాప్తి చెందుతుంది. కానీ, అందులో ఇద్దరిని వ్యాక్సిన్ రక్షించగల్గితే , పునరుత్పత్తి సంఖ్య 3 నుంచి 1 కి వస్తుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








