సన్నీ లియోని సినిమా పేరుపై వివాదం

ఫొటో సోర్స్, facebook/sunnyleone
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలీవుడ్ నటి సన్నీ లియోని జీవితంపై తెరకెక్కిన సినిమా 'కరణ్‌జీత్ కౌర్' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
ఈ చిత్రంలో సన్నీలియోని బాల్యం నుంచి పోర్న్ స్టార్, బాలీవుడ్ నటిగా మారిన వరకు ఆమె జీవితాన్ని చూపిస్తున్నారు.
జులై 5న సినిమా ట్రైలర్ రిలీజైన తర్వాత య్యూటూబ్, ట్విటర్, ఫేస్‌బుక్‌లో సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి.
పవన్ గోగ్నా అనే ఒక ట్విటర్ యూజర్ "ఒక పంజాబీ సిక్కు యువతిగా మీరు మీ పేరునే కాదు, మీ కుటుంబం పేరు కూడా చెడగొడుతున్నారు. ఓడిపోయిన వారి బయోపిక్ చూడాలని ఎవరికీ ఆసక్తి ఉండదు" అని కామెంట్ పెట్టాడు.

ఫొటో సోర్స్, TWITTER/PGOGNA
మరోవైపు ఈ సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని నిర్ణయించింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
సినిమాలో కౌర్ అనే పదం ఎందుకు?
సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సన్నీ లియోని సినిమాలో కౌర్ అనే పదం ఎందుకు వాడారని ప్రశ్నించింది.
"ఆమె పోర్న్‌స్టార్‌గా పనిచేసింది. తను చిన్నప్పుడు సిక్కు. తర్వాత మతం మార్చుకుని క్రైస్తవం తీసుకుంది. సిక్కు మతంలో పేర్ల పక్కన ఉండే సింగ్, కౌర్ లాంటి వాటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే సిక్కుల మనోభావాలకు భంగం కలిగించేలా ఆ చిత్రానికి కౌర్ అనే పదం ఉపయోగించవద్దని ఆమెకు చెప్పాం". అని కమిటీ ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ బీబీసీతో అన్నారు.
ఈ సినిమాలో కౌర్ అనే పదం ఉపయోగించడంపై ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని దల్జీత్ సింగ్ చెప్పారు.
"కౌర్ అనే పదం సన్నీ లియోని వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనప్పుడు ఆమె దానిని ఎందుకు ఉపయోగించకూడదు అని బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
ఆ ప్రశ్నకు సమాధానంగా "సన్నీ లియోని ఒక క్రిస్టియన్, అందుకే తను ఏం చేయాలనుకుంటే అది చేయచ్చు. కానీ ఆమె ఈ పదం ఉపయోగించకూడదు. తన సినిమాను ‘సన్నీ లియోని-ద అన్‌టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్‌తోనే రిలీజ్ చేయచ్చు కదా? అని బేడీ అన్నారు.
ఈ సినిమా దర్శకుడు ఆదిత్య దత్ ఈ వివాదంపై స్పందించారు. సిక్కు సమాజం మనోభావాలను పూర్తిగా గౌరవిస్తానని చెప్పిన ఆయన.. ఈరోజుల్లో కూడా తమ కుటుంబం పేరును ఉపయోగించద్దంటూ కొందరు సినిమా పేరును వ్యతిరేకించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఫొటో సోర్స్, ఆ ప్రశ్నకు సమాధానంగా "సన్నీ లియోని ఒక క్రిస్టియన్,
కౌర్ అనే పదంఎవరు ఉపయోగించవచ్చు?
సిక్కు సమాజంలో మహిళలు తమ పేరు చివరన కౌర్ అనే సర్ నేమ్ ఉపయోగిస్తారు. దానికి రాజకుమారి అని అర్థం.
నిజానికి సిక్కు సమాజంలో పదో గురువు అయిన గురు గోవింగ్ సింగ్, తమ మతంలో చేరుతున్న మహిళలకు కౌర్ అనే సర్ నేమ్, పురుషులకు సింగ్ అనే పేరు ఇచ్చారు.
సిక్కు మతం సిద్ధాంతాల ప్రకారం, మహిళలు, పురుషుకు సమాన హోదా ఉంటుంది. మహిళలు గుర్తింపు కోసం తమ పేరు పక్కన పురుషుల సర్ నేమ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 4
సినిమాలో ప్రత్యేకత ఏంటి?
సన్నీ లియోని జీవితంపై తీస్తున్న చిత్రం ఒక విషయంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఫీచర్ బయోపిక్‌లో ఎవరి ఆధారంగా సినిమా తీస్తున్నారో వారంతా ఆయా పాత్రల్లో కనిపించనున్నారు.

ఫొటో సోర్స్, INSTAGRAM/SUNNYLEONE
దీనికి ముందు మహమ్మద్ అలీ జీవితంపై తెరకెక్కిన 'ద గ్రేటెస్ట్-మై ఓన్ స్టోరీ'లో మహమ్మద్ అలీ స్వయంగా నటించాడు.
అయితే, ఈ సినిమాలో సన్నీ లియోని భర్త డేనియల్ వెబర్ పాత్రను మార్క్ బకర్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)