స్కాట్లాండ్: అందమైన దీవిలో ఆరు నెలలు గడిపే అవకాశం... అదో మరిచిపోలేని అనుభవం

ఫొటో సోర్స్, House By The Stream
- రచయిత, డెబీ జాక్సన్
- హోదా, బీబీసీ స్కాట్లాండ్
నగరానికి సుదూరంగా ఉన్న ఈ దీవిలో ఉదయం లేచి బ్రష్ చేసుకోవడానికి ఆరుబయట విహారానికి వెళ్లవచ్చు. ఈ స్కాటిష్ దీవిలో ఉంటున్న అలెక్స్ ముమ్‌ఫోర్ట్ అలా బ్రష్ చేకుంటుంటే ఓ రెండు సముద్రపు గద్దలు ఆయన తల మీంచి ఎగురుకుంటూ పోయాయి. అవి అలా తమ ఉనికిని చాటుకున్నాయి.
అలెక్స్ తన జీవిత భాగస్వామి బఫీతో కలిసి ఈ దీవిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఇక్కడి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
స్కాట్లండ్ ప్రధాన భూభాగానికి 30 మైళ్ళ దూరంలో ఉన్న'ఐల్ ఆఫ్ రమ్' దీవిలో కొత్త జీవితాన్ని సృష్టించుకునేందుకు బ్రిస్టల్‌కు చెందిన ఈ జంట ఆరునెలల క్రితం ఇక్కడికి వచ్చింది.
ఈ దీవిలో గడపాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిటీ ట్రస్ట్ ప్రకటించింది.
ఈ దీవిలో కొత్తగా నిర్మించిన పర్యావరణహిత గృహాల్లో నివసించేందుకు 440 మంది దరఖాస్తు చేయగా నాలుగు జంటలు అందుకు ఎంపికయ్యాయి. అయితే, వీరంతా ఇక్కడకు వచ్చిన తరువాత సమాజానికి ఉపయోగకరమైన పనులు కూడా చేయాల్సి ఉంటుంది.
అలెక్స్ జంటతో పాటు వీరంతా గత డిసెంబరులో ఈ దీవికి వచ్చారు.
ఈ ఆరు నెలల్లో వారి జీవితం ఎలా గడిచింది?
"మేమీ దీవికి మా సేవలను అందించగలమని భావిస్తున్నాం" అన్నారు అలెక్స్.
ఈ దీవిలో అలెక్స్, బఫీ బాగా స్థిరపడ్డారు. ఇక్కడ స్థానిక జీవనాన్ని అర్ధం చేసుకుని వారు ఈ దీవికి ఏమి చేయగలరో తేల్చుకోవడానికి వారికి కొన్ని రోజులు పట్టింది.
"మేమిద్దరం ఇప్పుడు దీవిలో పని చేస్తాం. దాంతో, మేమీ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వగలుగుతున్నామని భావిస్తున్నాం. రమ్ దీవికి రావడానికి ఈ భావనే మమ్మల్ని ప్రోత్సహించింది" అని అలెక్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Instagram / House by The Stream
ఈ జంట గతంలో కంటే ఎక్కువగా పని చేస్తున్నారు. స్కాట్ ల్యాండ్ నేచర్ ఏజెన్సీ నేచర్ స్కాట్ తో కలిసి వీరు పని చేస్తున్నారు.
"మేము ఈ దీవి చుట్టూ తిరుగుతూ ఇక్కడున్న సముద్రపు గద్దలు, రకరకాల పక్షులు, డాల్ఫిన్ చేపలు, మింక్ వేల్ లాంటి పక్షులను లెక్కించడానికి వెళ్లాం. ఇలాంటి దృశ్యం బ్రిస్టల్‌లో కనిపించదు" అని అలెక్స్ అన్నారు.
"ఇదొక సుందర ప్రదేశం, కానీ, ఇక్కడ నివాసానికి కొన్ని సమస్యలున్నాయి" అని కూడా అన్నారు.

ఫొటో సోర్స్, Instagram / House by The Stream
"ఎప్పుడైనా ఇక్కడకు రావడానికి ఫెర్రీలు రద్దయితే, మధ్యలో చిక్కుకుపోతాం. అలాంటప్పుడు, వెనక్కి రావడానికి స్థానిక బోటు కంపెనీని సాయం ఆడగాల్సి ఉంటుంది" అని చెప్పారు.
కోవిడ్ నిబంధనలు ఈ దీవిలో కూడా అమలులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ దీవికి వచ్చే కొత్త పర్యటకుల కోసం వీరు ఎదురు చూస్తున్నారు.
వీరిద్దరూ ఈ దీవిలో జీవితం గడిపేందుకు పూర్తిగా మునిగిపోయారు.
వారు తమ అనుభవాలను దీవికి సంబంధించిన బ్లాగ్ లో రాస్తున్నారు. వారు చేసిన సాహసాలను, అందమైన చిత్రాలను కూడా 'పేజీ హౌస్ బై ది స్ట్రీమ్టలో పొందుపరుస్తున్నారు.
బఫీ ఇక్కడున్న ఐల్ ఆఫ్ రమ్ కమ్యూనిటీ ట్రస్ట్‌తో కలిసి పని చేస్తున్నారు.
అలెక్స్ పర్యటక రంగంతో కలిసి పని చేస్తున్నారు.
"పని లేని రోజుల్లో మేమిద్దరం దీవిలో తిరగడానికి వెళతాం. స్నేహితులతో కలిసి గడుపుతాం. మన పరిసరాలతో, చుట్టూ ఉన్న మనుషులతో సంతృప్తికరంగా ఉన్నప్పుడు జీవితమెప్పుడూ చేయాల్సిన పనులతో నిండిపోవాల్సిన అవసరం లేదు అని మేము నేర్చుకుంటున్నాం. కొన్ని రోజులు చాలా నెమ్మదిగా గడుస్తాయి. వార్తాపత్రికలు తెచ్చుకోవడానికి ఫెర్రీ మీద వెళ్లే అలాంటి రోజులను మేము ప్రేమిస్తాం" అని అలెక్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Instagram / House By The Stream
బఫీ ఇక్కడుండే ఎత్తయిన శిఖరాల మీదకు ట్రెక్కింగ్ చేశారు.
"ఇప్పటి వరకు నేను రెండు సార్లు సముద్రపు పక్షులను లెక్కించడానికి వెళ్లాను. ఇలాంటి పనులు మేము మామూలు నగర జీవితంలో చేసే అవకాశం ఉండదు. నేనిక్కడ సరస్సులో ఈత కొట్టడంతో పాటు, సముద్రపు క్షీరదాలను వెతికేందుకు పడవను కూడా నడిపాను" అని అలెక్స్ చెప్పారు.
"అందరితో కలిసి సాగే జీవితం"
ఇక్కడ వారు అనుభవిస్తున్న జీవితం గతంలో ఎప్పుడూ చూడనిది. బ్రిస్టల్‌లో వారొక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉండేవారు.
కానీ, ఈ దీవిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, స్నేహాలు ఏర్పడడం చాలా సులభంగా జరిగిపోతోంది.
"మేమంతా ఒకేలాంటి వాతావరణంలో నివసిస్తున్నాం. ఇక్కడకు కొత్తగా వచ్చిన కుటుంబాలన్నీ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు, రద్దీగా ఉండే సంఘ జీవనంలోనూ ఉండవచ్చు. మేే ఈ రెంటికీ మధ్య ఉండే జీవన శైలిని ఎంచుకున్నాం"అని బఫీ చెప్పారు.

ఫొటో సోర్స్, Instagram / House by The Stream
ఈ దీవి సహజ సౌందర్యం వారి అంచనాలను మించిపోయింది.
అలెక్స్ ఇక్కడ అనుభవిస్తున్న జీవితం గురించి ఇలా వివరించారు:
"గతవారం నేను బయటకు టూత్ బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా తల పై నుంచి రెండు సముద్రపు గద్దలు ఎగురుకుంటూ వెళ్లాయి. మా వెనుక ఉన్న కొండల్లోంచి పుట్టినట్లు అరుచుకుంటూ వెళ్లాయి. ఆ దృశ్యం అద్భుతం."
"ఈ దీవిలో మమ్మల్ని ఏ విషయమూ నిరుత్సాహపరచలేదు. కాకపొతే, ఇక్కడ సమయానికనుగుణంగా పనులను పూర్తి చేసుకోవడం పెద్ద సవాలు" అని అలెక్స్ అన్నారు.
ఈ దీవికి ఉత్తరం వైపున కరీబియన్ తరహా సముద్ర ప్రాంతం ఉంది.
వారి తోటలో కదిలే వన్యప్రాణుల కదలికలను, పక్షులను, సరస్సులను ఈ జంట చాలా ఆస్వాదించారు. వీరి పడవ పక్కనే, డాల్ఫిన్లు ఈత కొట్టుకుంటూ వెళ్లడం వారికి పులకరింత కలిగిస్తుంది.
ఈ దీవికి వచ్చే వారితో కలిసి పని చేసి, వారికి తెలియని భూభాగాన్ని చూపించాలని అలెక్స్ ఎదురుచూస్తున్నారు.

ఫొటో సోర్స్, Instagram / House By The Stream
ఇక్కడ మొదటి ఆరు నెలలు అంత సునాయాసంగా ఏమీ గడవలేదు. కోవిడ్ నిబంధనల వల్ల వారి కుటుంబాన్ని కలవడానికి వెళ్లలేకపోయారు. కానీ, నిబంధనలు సడలించగానే, వారు ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకున్నారు.
"ఇక్కడ జీవనశైలిని అనుభవించడానికి ఒక ఫెర్రీ ట్రిప్, సుదూర ప్రయాణం తప్పని సరి" అని అన్నారు.
ఈ దీవికి చెందినవారిమేనని అనిపిస్తోంది
ఈ జంట ఇక్కడ జీవితాన్ని ప్రతీ రోజూ కొత్తగా అస్వాదించాలని కోరుకుంటోంది.
"మాకు పెట్రోల్ వస్తుంది. కానీ, మేము ఆర్డర్ చేసినట్లు ఆహారం మాత్రం లభించదు. కాకపొతే, నేరుగా మా ఆర్డర్ లను డెలివెరీ చేసే షాపు ఒకటి మాకు దొరికింది" అని అలెక్స్ చెప్పారు.
"ఇక్కడకు రాగానే, చాలా ప్రాజెక్టులలో పని చేయాలని అనిపిస్తుంది. కానీ, మేం బాగా చేయగల పని మీదే మా దృష్టి పెట్టాం. దాని వల్ల ఇక్కడ స్థానికులకు, పర్యటకులకు వీలైనంత లాభాన్ని చేకూర్చేందుకు చూస్తున్నాం" అని అలెక్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Instagram / House By The Stream
ఆరు నెలలు గడిచేప్పటికి వీరిద్దరికీ తాము ఈ దీవికి చెందినవారిమనే భావన కలుగుతోంది.
"మేము నగర జీవితాన్ని పోల్చుకుంటూ ఇన్నాళ్లూ అక్కడ ఎలా గడిపామా అని ఆలోచిస్తున్నాం" అని అలెక్స్ అన్నారు.
"మేమీ నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని అందరూ విచిత్రంగా చూశారు. కానీ, ఒకసారి ఆ నగరంలో ఉన్న ఇరుకైన జీవితాన్ని ఛేదిస్తే , ఇది చాలా సులభంగా తీసుకోగలిగే నిర్ణయం అని అన్నారు.
"ఇక్కడ మీలా మీరు బ్రతకడానికి కావల్సినంత స్వేచ్ఛ లభిస్తుంది. అలాగే, గద్దలను చూస్తూ హాయిగా బ్రష్ కూడా చేసుకోవచ్చు" అని అలెక్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న మియన్మార్ ఆర్మీ జనరల్స్
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








