క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, వాతావరణ మార్పులకు దారుణంగా ప్రభావితమయ్యే క్రీడల్లో క్రికెట్ ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే 2050 నాటికి క్రికెట్ స్వరూపం ఎలా ఉంటుంది?
ఇప్పటి వరకు మనం చూడని బయోడోమ్స్ క్రికెట్ ఆడేందుకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయని బీబీసీ స్పోర్ట్ ఊహించింది.
మెల్‌బోర్న్‌లో ఈ నెల మొదట్లో డోమ్ ఆఫ్ క్రికెట్ తెరవక ముందు దానిని ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్‌ను కాపాడే ప్రదేశమని కొనియాడారు.
కానీ, అక్కడ ఆట మొదలైన కొన్ని రోజులకు ఆటస్థలమే అసలైన సమస్యగా మారినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ బాబీ ఇలూకా అన్నారు.
క్రీడాకారులను, క్రీడాభిమానులను వేడిమి నుంచి రక్షించి సురక్షితమైన వాతావరణం కల్పించడానికి మాత్రమే కాకుండా, అడవిలో చెలరేగే మంటల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఆట ఆడే రోజులు పెరగకుండా 3 బిలియన్ల ఆస్ట్రేలియా డాలర్ల ఖర్చుతో ఈ వివాదాస్పద డోమ్‌ను నిర్మించారు.
కానీ, ఇప్పటికే దీని గురించి క్రీడాకారులు, అభిమానుల నుంచి కూడా విమర్శలు రావడం మొదలయింది. ఆటను చూసేందుకు వచ్చిన వారి సంఖ్య నాటకీయంగా మారిపోతుండటంతో వాతావరణాన్ని నియంత్రించడానికి సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి.
ఆ డోమ్ లోపల ఏమి జరిగింది?
ఇంగ్లాండ్‌తో జరిగిన ఫోర్త్ యాషెస్ టెస్ట్ తర్వాత ఇలూకా ఈ డోమ్ గురించి ఎక్కువగా విమర్శించారు.
ఆ డోమ్ లోపల ఆటకు సిద్ధం కావడం అసాధ్యమని ఆయన అన్నారు.
"ఆట మొదలయిన మొదటి రోజు ఆ డోమ్ లోపల 100,000 మంది ఉండగా, వాతావరణం బయట కంటే లోపల వేడిగా, తేమగా మారిపోయింది. దాంతో, ఆట చూడటం పక్కన పెడితే, ఆట ఆడటం చాలా కష్టంగా మారింది. చాలా మంది అభిమానులు వేడి తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్లిపోవడం కూడా చూశాను" అని చెప్పారు.
"మధ్యాహ్నానికి , కొన్ని మార్పులు చేశారు కానీ, నెమ్మదిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి".
"ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏ క్రీడకైనా, క్రీడాకారులకు అనువైన పరిస్థితులు కావు. కానీ, ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తుంటే, బంతి ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవడం కష్టం. మేము ఈ విషయంలో అదృష్టవంతులమే అని చెప్పుకోవాలి" అని అన్నారు.
మళ్ళీ ఆ గోపురం ఉన్న మైదానంలో ఆడతారా అని ఇలూకాను ప్రశ్నించినప్పుడు, ఆయన మొహమాటం లేకుండా, ఆడనని చెప్పారు.
"మేము యాషెస్‌ను వేసవి చివరలో ఆడాలని నిర్ణయించాం. అది, ఇతర ప్రాంతాల్లో పని చేసింది కూడా. భవిష్యత్తులో కూడా క్రికెట్ ఇన్‌డోర్‌లో ఆడగలమా లేదా అనేది నాకు సందేహమే? ప్రస్తుతానికి ఇది వీలయ్యే పని కాదు" అని అన్నారు.

ఎవరెవరు ఏమన్నారు...
2050 నాటికి టెస్ట్ మ్యాచ్ ల సమయంలో ఎక్కువ విశ్రాంతి ఇచ్చేందుకు, ఆట నిడివి తగ్గించేందుకు ఆరు రోజుల పాటు ఆడేందుకు ఇప్పటికే క్రికెట్‌లో ప్రయోగం చేశారు. ప్రస్తుతం అవి 5 రోజులు ఆడుతున్నారు.
"ఎక్కువ సేపు ఆడటం అనే అంశాన్ని ఇలూకా ఖండిస్తూ, అలా చేయడం, క్రీడాకారులను, అభిమానుల నుంచి కూడా ఎక్కువ ఆశించడమే" అని అన్నారు.
"దానికి బదులుగా, క్రికెట్‌ను పూర్తిగా చలికాలంలో ఆడే ఆటగా మార్చవచ్చు. యూరప్‌లో ఉండే చలి కాలానికి మిగిలిన చోట్లకు తేడాలు ఉంటాయని నాకు తెలుసు. కానీ, ఇది ఉత్తమమైన పరిష్కారం" అని ఆయన సూచించారు.
"క్రికెట్ ఒక క్రీడ. దానిని ఇన్‌డోర్‌లో ఆడటం తప్పు" అని అన్నారు.

ఫొటో సోర్స్, BBCSport 2050
ఈ ఏర్పాటుతో అభిమానులు కూడా అంతగా ఆనందంగా లేరు. అక్కడున్న ఇబ్బందిని భరించలేక ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లినట్లు కొంత మంది నేరుగా చెప్పారు.
దాని వల్ల వికెట్లను మిస్ అయిన విషయాన్ని కూడా చెప్పారు. కానీ, ఆ ఏర్పాటు కొంత మందిని ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, BBC Sport 2050
ఈ గోపురం లో విద్యుత్ కోసం సోలార్ ప్యానెళ్లను వాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరికట్టడానికి ఇన్ డోర్ క్రీడా ప్రాంగణాలను నిర్మించిన ప్రైవేటు యజమానులు మాత్రం ఈ ఏర్పాటును సమర్ధించుకున్నారు.
టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ అని అంగీకరిస్తూ దానిని ఎప్పటికప్పుడు అవసరాలకు తగినట్లుగా మార్చుకోవాలని అన్నారు.

ఫొటో సోర్స్, BBCSport2050
కానీ, ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, అడవి మంటల దృష్ట్యా, తాము నిర్మించిన స్టేడియంలు కేవలం క్రికెట్ కోసమే కాకుండా, ప్రపంచమంతటా మిగిలిన క్రీడలకు కూడా భవిష్యత్తు కానున్నాయనే విషయాన్ని నొక్కి చెప్పారు.

"స్టేడియంలో ఎక్కువ మంది జనం లేనప్పుడు ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి వాతావరణం చల్లగా మారిపోయింది" అని ఇటీవల టెస్ట్ క్రికెట్ లో నెదర్లాండ్స్ మహిళల జట్టు కెప్టెన్ ఈవ బేకర్ చెప్పారు. అలాగే, పిచ్ సహజంగా క్షీణించలేదని అన్నారు.
"మాకు అర్ధమైనంతవరకు ఇన్‌డోర్‌లో ఆడుతున్నప్పుడు బౌలర్ లేదా బ్యాట్స్‌మన్ నాటకీయంగా మారుతూ ఉండాలి. కానీ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడటం సవాలుగా మారుతోంది" అని అన్నారు.
"మా దేశంలో ఈ ఆటను వేసవి ఆటగా ఆడతారు. కానీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల రీత్యా ఆస్ట్రేలియా, ఇండియా లాంటి దేశాల్లో ఇది ఎలా ఆడతారో అని చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు" అని అన్నారు.
భవిష్యత్తులో ఈ డోమ్ లను వాడటానికి వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షక క్రీడాభిమానులు డబ్ల్యూఐడీఈఎస్ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఎర్త్ అండ్ స్పోర్ట్) ఉద్యమాన్ని ప్రారంభించింది. అడవి మంటల్లో ప్రభావితమైన జంతువులకు ఇది సంరక్షణ కేంద్రంగా మార్చాలని సెలెబ్రెటీల మద్దతును కూడా కూడగట్టుకుంది.
"నేను టెస్ట్ క్రికెట్ మీద ప్రేమతో దానిని సంరక్షించుకోవాలని అనుకున్నాను. కానీ, అది పని చేయలేదు. జంతువులను సంరక్షించడం చాలా ముఖ్యం. దానిని ఒక మంచి పని కోసం మార్చి జంతువులకు అభయారణ్యంగా మార్చవచ్చు" అని క్రీడల నిర్వాహకుడు లౌ ఆల్సేన్ బీబీసీ స్పోర్ట్ కి చెప్పారు.
నిపుణుల అభిప్రాయం
క్రికెట్ ఏ దేశంలో ఆడినా అది మైదానాల్లో ఆడే అన్ని రకాల ఆటల్లో ఎక్కువగా వాతావరణ మార్పులకు ప్రభావితమయ్యే క్రీడ.
ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు పిచ్‌ను ప్రభావితం చేయడం వల్ల ఆట ఆడేవారికి అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. వాతావరణ పరిస్థితులు వారు ఆట ఆడే తీరు పై ప్రభావం చూపడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా ముప్పును చేకూర్చవచ్చు
అధిక వేడి, తేమ కలిసి, కళ్ళు తిరగడం, వికారం, వాంతులు లాంటివి రావడమే కాకుండా ఒక్కొక్కసారి మరణం వరకు కూడా దారి తీయవచ్చు.
కానీ, అధిక ఉష్ణోగ్రతలు అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
సిడ్నీలో జనవరి 2018లో జరిగిన యాషెస్ టెస్ట్‌లో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అతిసారం బారిన పడి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.
వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్ హౌస్ వ్యర్ధాలు వేసవి ఉష్ణోగ్రతలను మరింత పెంచి ఆట దీర్ఘకాలం ఆడేందుకు చాలా రకాల ముప్పులను తేవచ్చు.
మ్యాట్ మెక్ గ్రాత్, బీబీసీ ఎన్విరాన్మెంట్ ప్రతినిధి
భవిష్యత్తులో క్రీడా కార్యక్రమాలకు అధిక ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా, గాలిలోని మార్పులు కూడా ముప్పుగా కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న వాయు కాలుష్యం వల్ల క్రీడాకారులు ప్రభావితమైన ఉదాహరణలు ఉన్నాయి.
వాతావరణ మార్పులు ఇలాంటి అనుభవాలను మరింత సాధారణంగా మార్చవచ్చు.
కార్బన్ వ్యర్ధాల విడుదల ఎక్కువగా జరిగితే, ఈ శతాబ్దపు మధ్య నాటికి ప్రపంచ వ్యాప్తంగా అడవి మంటలు 35 శాతం పెరిగే అవకాశం ఉంది.
దీని వల్ల కేవలం అటవీప్రాంతాలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ప్రమాదం ఉంది.
వీటి వల్ల వచ్చే పొగ 23 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి గాలి ద్వారా ఖండాల ఆవలకు కూడా విస్తరిస్తుంది.
పొగతో పాటు, ఈ మంటల వల్ల కనిపించని ధూళి కణాలను కూడా విడుదల అవుతాయి.
ఈ చిన్న కణాలు మనిషి తల వెంట్రుక కంటే 30 రెట్లు తక్కువగా ఉండి ఊపిరితిత్తులలోకి, రక్తంలోకి చొచ్చుకుపోతాయి. దాంతో, ఉబ్బసం వచ్చి గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి వాతావరణ పరిస్థితులు, నీటి కొరత క్రీడా కార్యక్రమాల పై కూడా ప్రభావం చూపించవచ్చు.
నగర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు. దాంతో నగరాల్లో జరిగే క్రీడా కార్యక్రమాలకు హాజరు కావడం కష్టంగా మారుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా అధిక వేడిమి ఉండే రోజుల్లో మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.
ఇటీవల అమెరికా, యూరప్, ఆసియాలో చోటు చేసుకున్న వేసవి ఉష్ణోగ్రతలు ఇక పై సాధారణంగా మారవచ్చు.
2030లో 50 శాతం వేసవి ఉష్ణోగ్రతలు గత 40 సంవత్సరాల్లో అత్యంత వేడిమి ఉన్నప్పటి కంటే ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇటీవల చూసిన ఉష్ణోగ్రతల కంటే, 2050 నాటికి, వేసవి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- భానుడి భగభగలు.. తప్పించుకునేందుకు జనాల అగచాట్లు
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు?
- తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- ఏసీ ‘టెంపరేచర్’ 24°C చేయాలని కేంద్రం ఆలోచన - అలా చేస్తే ఏమవుతుందంటే..
- పర్యావరణానికి సిమెంటు సమాధి కడుతుందా.. 8 వేల ఏళ్ల కిందటే కాంక్రీటు ఉండేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








