భానుడి భగభగలు.. తప్పించుకునేందుకు జనాల అగచాట్లు

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తున్నాయి.
ఎప్పుడూ అత్యధిక ఉష్ణోగ్రతలుండే రాజస్థాన్‌లోని చురులో ఆదివారం 50.8 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ విభాగం ప్రకటించింది.
‘తీవ్ర ఉష్ణ పరిస్థితుల’ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎండాకాలం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీటితో పాటు ఉత్తర భారత దేశంలోని మైదాన ప్రాంతాలు, పశ్చిమ, దక్షిణ దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లోనూ ఎండలు మండుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిరాశ్రయులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుడ్ డెలివరీ సంస్థల కోసం పనిచేసే వారు, కొరియర్ డెలివరీ సిబ్బంది కూడా మండుటెండల్లో కష్టపడాల్సి వస్తోంది.
వాతావరణ వెబ్‌సైట్ ఎల్ డొరాడో అత్యంత వేడైన 15 ప్రదేశాల జాబితాను విడుదల చేస్తే అందులోని భారత పట్టణాలే ఏడున్నాయి. మిగతా ఎనిమిది ప్రదేశాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రుతుపవనాలు ఆలస్యమవుతున్న కారణంగా ఎండలు మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ పట్టణాల్లో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద, వీధుల్లో కొందరు స్వచ్ఛందంగా మంచి నీళ్లు, శీతల పానీయాలు పంచుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో వాహన తనిఖీలు చేసే పోలీసులు కూడా గొడుగుల కింద తల దాచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎండలు రోజురోజుకీ పెరుగుతుండటంతో కొన్ని పట్టణాలు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్ లాంటి పట్టణాల్లో ప్రభుత్వ ఈత కొలనులు జనాలతో కిటకిటలాడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో మధ్యాహ్నం పూట చన్నీటి స్నానంతో చిన్నారులు సేదతీరుతుండగా తీసిన చిత్రమిది.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన 17 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








