'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్‌లో 'బాబా కా ధాబా' పేరుతో షాపు నడిపే కాంతా ప్రసాద్‌ను అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు.
కాంతా ప్రసాద్‌ను గురువారం రాత్రి దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చేర్పించినట్లు దక్షిణ దిల్లీ డీసీపీ అతుల్ ఠాకూర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
"ఆయనను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన కొడుకు వాంగ్మూలం రికార్డ్ చేశాం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాంతా ప్రసాద్ నిద్రమాత్రలు వేసుకుని మద్యం తాగారని పోలీసులు చెబుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ 7, 8 తేదీల్లో సోషల్ మీడియాలో ఒక వృద్ధ దంపతుల వీడియో జోరుగా వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో 'బాబా కా ధాబా' పేరుతో ఫుడ్ స్టాల్ నడిపే వృద్ధుడు కాంతా ప్రసాద్ లాక్‌డౌన్ వల్ల తనకు సంపాదన లేకుండా పోయిందని కన్నీళ్లు పెడుతూ కనిపించారు.
అందులో, కాంతా ప్రసాద్ ఏడుస్తూ తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని మాట్లాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో జనం ఆ వృద్ధ దంపతులకు చాలా సాయం అందించారు.
80 ఏళ్ల కాంతా ప్రసాద్ తాను, భార్యతో కలిసి చాలా కష్టపడుతున్నానని.. కానీ, నాలుగు గంటలకు 50 రూపాయలే సంపాదించగలుగుతున్నామని, తమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఈ వీడియో వైరల్ కావడంతో, చాలా మంది ఆ వృద్ధ దంపతులకు సాయం అందించాలని అపీల్ చేయడం మొదలుపెట్టారు. చూస్తూ చూస్తుండగానే ధాబా దగ్గర జనం గుమిగూడడం మొదలెట్టారు. అక్కడికి వెళ్లి, వారిని కలిసిన తమ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాంతా ప్రసాద్ వైరల్ వీడియోను స్ట్రీట్ ఫుడ్ గురించి వీడియోలు తీసే, యూట్యూబర్ గౌరవ్ వాసన్ తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాంతా ప్రసాద్ వీడియోను చాలా మంది ప్రముఖులు షేర్ చేశారు. వారికి సాయం చేయాలని అపీల్ చేశారు. 'బాబా కా ధాబా'కు ప్రజలు వెల్లువెత్తడం మొదలైంది. కాంతా ప్రసాద్‌కు మెరుగైన ఆర్థిక సాయం కూడా అందింది.
ఆరోపణలు - సయోధ్యలు
కానీ, తనకు లభించిన విరాళాల్లో యూట్యూబర్ గౌరవ్ వాసన్ అవకతవకలకు పాల్పడ్డారని కాంతా ప్రసాద్ ఆరోపించడంతో ఈ విషయం మరో మలుపు తిరిగింది.
ఆయన దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, గౌరవ్ వాసన్ ఈ అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చారు. విరాళాల ద్వారా అందిన మొత్తం డబ్బును కాంతా ప్రసాద్‌కు అందించానని చెప్పారు.
ఆ తర్వాత వృద్ధ దంపతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మొదట్లో రోజుకు 250-300 సంపాదిస్తుంటే, ఇప్పుడు ఐదారు వేలు సంపాదిస్తున్నానని కాంతా ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, SWADOFFICIAL
యూట్యూబర్ గౌరవ్ వాసన్‌తో వివాదం తర్వాత కాంతా ప్రసాద్ మాలవీయ నగర్‌లోనే ఒక రెస్టారెంట్ తెరిచారు. కానీ అది సరిగా నడవలేదు.
రెండు నెలల్లో, అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఆ రెస్టారెంట్ మూసేయాల్సి వచ్చింది. దాన్ని నడపడం వల్ల తను ఆర్థికంగా నష్టపోయానని ఆయన చెప్పారు.
ఈలోపు ఆయన గౌరవ్ వాసన్‌తో కూడా సయోధ్య చేసుకున్నారు. తాను గౌవర్ మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదని అన్నారు.
ఇటీవల గౌరవ్ వాసన్ చాలా రోజుల తర్వాత కాంతా ప్రసాద్‌ను కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో బాబా కెమెరా ముందే గౌరవ్ వాసన్‌ను హత్తుకుని, ఏడ్చారు కూడా.
గౌరవ్ వాసన్ కూడా తాను గతంలో జరిగినవన్నీ మర్చిపోయానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: వ్యాక్సీన్ తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక..,
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా...
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్‌లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా...
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








